రాష్ట్రంలో రాజ‌కీయాల జోరు పెరిగింది. రాజ‌ధాని విష‌యంలో ఓ వ‌ర్గం ఒక‌వైపు.. మ‌రో వ‌ర్గం ఇంకోవైపు అన్న ట్టుగా రెండు చీలిపోయిన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలో ఒక వ‌ర్గానికి మ‌ద్ద‌తుగా ఓ ప్ర‌ధాన మీడి యా భారీ ఎత్తున క‌థ‌నాల‌ను వండివారుస్తోంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు అస‌లు అమ‌రావ‌తికి కేంద్రం పెద్ద గా ఇచ్చింది లేదు.. రూపాయి రూపాయి విదిలిస్తోంది.. దీంతో నిర్మాణాలు న‌త్త‌న‌డ‌క‌న సాగుతున్నాయి. పాపం సీఎంగా ఉన్న చంద్ర‌బాబు వ‌య‌సు ను కూడా లెక్క‌చేయ‌కుండా భారీ ఎత్తున రోజుకు 20 గంటలు క‌ష్ట‌ప‌డుతూ... నిర్మాణాలు సాగిస్తున్నారు.. అంటూ.. క‌న్నీరు పెట్టుకున్న స‌ద‌రు ప‌త్రిక య‌జ‌మాని, తాతగా రుగా మీడియా వ‌ర్గం పిలుచుకునే ప‌త్రికాధినేత‌.. ఇప్పుడు ఈ క‌న్నీటిని మ‌రింత‌గా పారించారు.

 

ఠాఠ్‌! రాజ‌ధాని పూర్తి అయిపోయింది. అయినా జ‌గ‌న్‌కు బుద్ది మంద‌గించి.. మూడు రాజ‌ధానులు అంటు న్నాడు.. అనేలా.. భారీ ఎత్తున గురువారం స‌చిత్ర క‌థ‌నాన్ని ప్ర‌చురించి హ‌ల్‌చ‌ల్ చేశారు తాత‌గారు. అ న్నీ అమ‌రిన అమ‌రావ‌తి.. అంటూ గ‌తంలో చంద్ర‌బాబు చెప్పిన తాత్కాలిక భ‌వ‌నాల‌నే శాశ్వ‌త భ‌వ‌నా లుగా పేర్కొంటూ.. భారీ ఎత్తున క‌న్నీరు పెట్టుకున్నారు. ఇప్పుడు వీటికి ప్రాభ‌వం ఉండ‌ద‌ని, గ‌దులు బూ జు ప‌డ‌తాయ‌ని, గ‌బ్బిలాలు తిరుగుతాయ‌ని.. తాత‌గారు రోదించేశారు. మరి తాత‌గారు ఇంత‌గా రోదించాక కూడా.. ప్ర‌భుత్వం చూస్తూ.. ఊరుకుంటుందా? ఊరుకుంటే మాత్రం.. ఊరుకోనిస్తారా?

 

అందుకే.. వెంట‌నే మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ రంగంలోకి దూకేశారు. షిట్‌! ఇదీ ఒక ప‌త్రికేనా? ఇవి కూడా ఒక రాత‌లేనా? ఏటి అప్పుడేటి సెప్పారు? ఇప్పుడేటి రాశారు?  అప్ప‌ట్లో చంద్ర‌బాబు ల‌క్ష కోట్లు తెచ్చిన‌ప్పుడు .. ఏం సేశావంటూ.. నిల‌దీశారా? మ‌రి ల‌క్ష‌కోట్లు అప్పు చేసి.. 5 వేల కోట్లే ఖ‌ర్చు చేసిన‌ప్పుడు ఎందుకు రాయ‌లేదు? ఎందుకు నిల‌దీయ‌లేదు? అంటూ.. అమాయ‌కంగా ప్ర‌శ్నించేశారు. త‌న 30 ఏళ్ల రాజ‌కీయ జీవితంలో ఇలాంటి మీడియాను చూడ‌లేద‌ని ఈస‌డించారు. నేరుగా తిట్టిపోశారు. మీ ప‌త్రిక‌ను ఎందుకు చ‌ద‌వాల‌ని ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నార‌ని అన్నారు. దీంతో ఒక్క‌సారిగా విశ్లేష‌కులు.. శుక్ర‌వారం నాటి తాత‌గారి ప‌త్రిక కోసం ఎదురు చూశారు.

 

ఇంకేముంది.. ఇంత ఇదిగా బొత్స బ‌ట్ట‌లూడ‌దీసేసిన త‌ర్వాత తాత‌గారు స్పందించ‌కుండా ఉంటారా? ఎదురు విమ‌ర్శ‌లు చేయ‌డ‌మో.. త‌మ‌ను తాము స‌మ‌ర్ధించుకుంటూ.. బాబుగారిని మ‌రో భుజంపైకి మార్చుకోవ‌డ‌మో చేస్తార‌ని మీడియా వ‌ర్గం మొత్తం పేజీలు తిర‌గేసేసింది. అయితే, తాత‌గారు అంత ఈజీగా దొరికిపోతారా?  తేలుకుట్టిన పెద్ద‌మ‌నిషిగా మౌనం పాటించేశారు. మేం రాళ్లేస్తాం.. మీ చావు మీరు చావండి! అనేశారు! సో.. ఇద‌న్న‌మాట విష‌యం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: