నేను రైతు ప‌క్ష‌పాతిని.. అమ‌రావ‌తిని తీసేయ‌డం ద్వారా జ‌గ‌న్ ప్ర‌బుత్వం ఈ రైతుల‌కు అన్యాయం చేస్తోం ది.. అందుకే రోడ్డెక్కాను.. జోలి ప‌ట్టాను.. అంటూ న‌క్క విన‌యాలు.. ఊక దంపుడు ఉప‌న్యాసాలు దంచేసిన  చంద్ర‌బాబు చ‌రిత్ర‌ను అసెంబ్లీ సాక్షిగా వైసీపీ ప్ర‌భుత్వం బ‌ట్ట‌బ‌య‌లు చేసేసింది., బాబుగారి ప‌రువును బ జారు కీడ్చేసింది. అనుభ‌వం ఉంద‌ని, అనుభ‌వంతో ఈ రాష్ట్రానికి ఏమైనా చేస్తాడ‌ని భావించి చంద్ర‌బాబుకు అధికారం అప్ప‌గిస్తే.. ప్ర‌జ‌ల ఆశ‌ల‌ను ప‌టాపంచలు చేస్తూ.. త‌న‌కు, త‌న వారికీ.. త‌న కుల‌పోళ్ల‌కి ఎంత మేరకు న్యాయం చేసుకున్నాడో.. ప్ర‌జ‌ల‌ను రైతుల‌ను ఎంత‌మేర‌కు ద‌గా చేయాలో చంద్ర‌బాబు అంత మేర‌కు ద‌గా చేశార‌ని ప్ర‌భుత్వం అసెంబ్లీలో స‌సాక్ష్యంగా వెల్ల‌డించింది.

 

సోమ‌వారం అసెంబ్లీలో రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ‌, జోన్ల ఏర్పాటు అంశాల‌తో కూడిన బిల్లును ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టింది. విశాఖ‌ను పాల‌నా రాజ‌ధానిగా.. క‌ర్నూలును న్యాయ‌రాజ‌ధానిగా.. అమ‌రావ‌తిని లెజిస్టేటివ్ రాజ‌ధానిగా మార్చేందుకు వీలుగా బిల్లును ప్ర‌వేశ‌పెట్టింది. దీనిపై జ‌రిగిన చ‌ర్చ‌లో ఎందుకు మూడు రాజ‌ధానుల ఏర్పాటు చేయాల్సి వ‌చ్చిందో ప్ర‌భుత్వం సోదాహ‌ర‌ణంగా వివ‌రించింది.

 

అదే స‌మయంలో అమ‌రావ‌తి విష‌యంలో చంద్ర‌బాబు అంత సీరియ‌స్‌గా తీసుకుని రోడ్డెక్కి జోలెప‌ట్ట‌డం వెనుక ఉన్న కుతంత్రం ఏంటో కూడా ప్ర‌భుత్వం అసెంబ్లీలో నే వివ‌రించింది. చంద్ర‌బాబు చేసిన భూదందాను బ‌ట్ట‌బ‌య‌లు చేసింది.రాజ‌ధాని పేరుతో అమ‌రావ‌తిని వెల్ల‌డించ‌కుండా ప్ర‌జ‌ల‌ను, రియ‌ల్ వ్యాపారుల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించి త న అనుకున్న వారికి మాత్రమే రాజ‌ధానిపై ఉప్పందించి.. అమ‌రావ‌తిలో భూములు కొనేలా చేసి తాను కూ డా కొని ఇటు ప్ర‌జ‌ల‌ను , అటు రైతుల‌ను కూడా చంద్ర‌బాబు మోసం చేశార‌ని స‌సాక్ష్యాల‌తో బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి వివ‌రించారు.

 

ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు ఇక్క‌డ కొన్న భూముల వివ‌రాల‌ను స‌ర్వే నెంబ‌ర్ల‌తో స‌హా బ‌ట్ట‌బ‌య‌లు చేశౄరు. చంద్ర‌బాబు త‌న హెరిటేజ్ సంస్థ పేరుతో  తాడికొండ మండ‌లం కంతేరు గ్రామంలో 14.25 ఎక‌రాలు కొన్నారు. ఓ వైపు శివ‌రామ‌కృష్ణ‌న్ కమిటీ రాజ‌ధానిలో పర్య‌టిస్తుండ‌గానే బాబు భూములు కొన్నారు. అది కూడా స‌ర్వే నెంబ‌ర్ల‌తో సహా బుగ్గ‌న వెల్ల‌డించ‌డంతో చంద్ర‌బాబు నోరు ఎత్తి మాట్లాడేందుకు కూడా అవ‌కాశం లేకుండా పోయింది. మొత్తంగా చూస్తే.. బాబు గారికి రాజ‌ధానిపై ఉన్న ప్రేమ ఎందుకో.. ?   దీని వెనుక ఏముందో ఇట్టే అర్ధ‌మ‌య్యే ఉంటుంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: