రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ‌కు రాజ‌ధానుల వికేంద్రీక‌ర‌ణే కీల‌క సూత్ర‌మ‌ని భావిస్తూ.. వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ మూడు రాజ‌ధానుల బిల్లును సోమ‌వారం అసెంబ్లీలో ప్ర‌వేశ పెట్టారు. భారీ సంఖ్యాబ‌లం ఉండ డంతో అసెంబ్లీలో ఈ బిల్లు కొన్నిగంట‌ల చ‌ర్చ‌, విమ‌ర్శ‌లు, ప్ర‌తివిమ‌ర్శ‌లు, ఈస‌డింపులు, అవ‌మానాలు.. ప్ర‌తిప‌క్షం ప్ర‌తివిమ‌ర్శ‌లు.. ఇలా అనేక మంది మాట్లాడిన త‌ర్వాత ఆమోదం పొందింది. అయితే, ప్ర‌స్తుతం ఇది మండ‌లిలోనూ ఆమోదం పొందిన‌త ర్వాత గ‌వ‌ర్న‌ర్‌కు వెళ్తుంది. ఆయ‌న కూడా ఆమోద ముద్ర వేస్తే.. ఇక‌, రాజ‌ధానుల రూపు రేఖ‌లు మారిపోతాయి.

 

ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. అయితే, మూడు రాజ‌ధానుల‌ను వ్య‌తిరేకిస్తున్న  వ‌ర్గాలు, అమ‌రావ‌తిలోనే రాజ‌ధానిని కొన‌సాగించాల‌ని డిమాండ్లు చేస్తున్న వ‌ర్గాలు మాత్రం రాష్ట్ర ప్ర‌బుత్వం తీసుకువ‌చ్చిన బిల్లుపై బిన్న‌మైన వాద‌న‌లు చేస్తున్నాయి. రాజ‌ధానుల‌పై జ‌గ‌న్ తీసుకువ‌చ్చిన బిల్లు చెల్ల‌ద‌ని ఒక వ‌ర్గం అంటుం టే.. అస‌లు బిల్లు పెట్టే హ‌క్కు ప్ర‌భుత్వానికి ఎక్క‌డ? అని నిల‌దీస్తున్న వ‌ర్గాలు కూడా ఉన్నాయి. మొత్తంగా చూస్తే.. ఈ బిల్లు విష‌యంలో కేంద్రం జోక్యం చేసుకుని, తొక్కి పెట్ట‌డ‌మో.. లేదా ర‌ద్దు చేయ‌డ‌మో చేయాల‌ని ఈ వ‌ర్గాలు బ‌లంగా కోరుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్ప‌టికే మ‌హిళ‌లు, రైతులు రోడ్డెక్కారు.

 

ఇక‌, ఇప్పుడు ఒక రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన బిల్లును లేదా అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లును తిర‌స్క‌రించే హ‌క్కు ఎవ‌రికి ఉంటుంది? అది రాజ‌ధాని అయితే.. కేంద్రానికి ఉంటుందా? ఇప్పుడు ఈ విష‌యంపై చ‌ర్చ సాగుతోంది. రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 3 ప్ర‌కాశం రాష్ట్ర‌ల పున‌ర్విభ‌జ‌న, స‌రిహ‌ద్దుల నిర్ణ యం వ‌ర‌కు పార్ల‌మెంటు ఉభ‌య ప‌క్షాలు చేసిన చ‌ట్టం మేర‌కు ఏర్పాటు అయ్యే అవ‌కాశం ఉంద న‌డంలో సందేహం లేదు. ఆ క్ర‌మంలోనే తెలంగాణ ఏర్ప‌డింది. ఎవ‌రు వ‌ద్ద‌న్నా ఆనాడు పార్ల‌మెంటు త‌లుపులు మూసి తెలంగాణ ఏర్పాటుకు అప్ప‌టి కేంద్ర ప్ర‌భుత్వం మొగ్గు చూపింది.

 

అయితే, మ‌రి రాజ‌ధానుల విష‌యం?  దీనిపై రాజ్యాంగం ఏమీ ప్ర‌తిపాద‌న చేయ‌లేదు. రాజ‌ధాని ఏర్పాటు అనేది అంతా రాష్ట్ర ప్ర‌భుత్వ ఇష్టం. అయితే, కేంద్రంతో చ‌ర్చించి ఏర్పాటు చేసుకోవ‌చ్చు. లేదా ఒక నిర్ణ‌యం తీసుకున్నాకైనా కేంద్రంతో చ‌ర్చించ‌వ‌చ్చు.(నిన్న చంద్ర‌బాబు ఇదే చెప్పారు. మేం అమ‌రావ‌తి పై నిర్ణ‌యం తీసుకుని కేంద్రంతో చ‌ర్చించాం అన్నారు). స‌రే! ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. మ‌రి ఇప్ప‌టికే ఏర్పాటైన రాజ‌ధానిని మ‌రో ప్ర‌భుత్వం వ‌చ్చాక మారిస్తే.. కేంద్రం అడ్డుకోలేదా? అస‌లు అలా చేయొచ్చా? అనేవి కూడా ప్ర‌స్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.

 

నిజ‌మే! గ‌త ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన రాజ‌ధానిని మార్చే హ‌క్కు కొత్త‌గా ఏర్పాటైన ప్ర‌భుత్వం తీసుకుం టే.. దీనికి స‌రైన కార‌ణాలు చూపించాలి. ఈ క్ర‌మంలోనే మ‌హారాష్ట్ర‌లో న‌వీ ముంబై  న‌గ‌రం ఏర్పాటైంది. ఇక‌, ఇప్పుడు అమ‌రావ‌తి విష‌యంలోనూ ఇలాంటి స‌హేతుక కార‌ణాలు చూపించాలి. అయితే, ఆయా కార‌ణాలు స‌హేతుకం అవునా కాదా? అనే విష‌యాల‌ను ప‌క్క‌న పెడితే.. ప్ర‌ధానంగా జ‌గ‌న్ తీసుకున్న రెండు నిర్ణ‌యాలు, చూపిస్తున్న కార‌ణాలు మాత్రం కేంద్రం గ‌తంలో ప‌చ్చ‌జెండా ఊపిన‌వే కావ‌డం గ‌మ‌నార్హం. వీటిలో ఒక‌టి 1938 నాటి శ్రీబాగ్ ఒప్పందం. రెండు 2014 నాటి శివ‌రామ‌కృష్ణ‌న్ క‌మిటీ నివేదిక‌.

 

ఈ రెండింటిలోనూ కూడా చెప్పిన విష‌యాల‌ను ప్రాతిప‌దిక‌గా చేసుకుని జ‌గ‌న్ ప్ర‌భుత్వం మూడు రాజ ధా నుల‌ను ఏర్పాటు చేస్తున్న విష‌య‌మే ప్ర‌ధాన‌మైంది. రేపు అటు కేంద్రానికి చెప్పినా.. ఇటు న్యాయ స్థానా ల‌కు చెప్పినా కూడా జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఇదే విష‌యం ప్ర‌స్తావిస్తుంది. ఇవే.. న్యాయ స‌మీక్ష‌కు కూడా నిల బ‌డ‌తాయి. సో.. ఈ రెండు నివేదిక‌ల కీల‌క అంశం.. అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ‌, పాల‌నా పంప‌కం. దీని ప్ర‌కారం క‌ర్నూలుకు హైకోర్టు ఏర్పాటు.. అనే విష‌యంలో ఎవ‌రికీ ఎలాంటి అభిప్రాయ భేదాలు కూడా లేవు. నిన్న మొన్న‌టి వ‌రకు కూడా ఇది కావాల‌ని ఇక్క‌డి వారు ఆందోళ‌న‌లు కూడా చేశారు.

 

సో.. శ్రీబాగ్ ఒప్పందం మేర‌కు క‌ర్నూలుకు అంద‌రూ ఒకే చెప్పాల్సిందే. దీనిని న్యాయ‌స్థానాలు కూడా త‌ప్పు ప‌ట్టే ప‌రిస్థితి లేదు. ఇక‌, విశాఖ‌లో రాజ‌ధాని ఏర్పాటు, అమ‌రావ‌తి త‌ర‌లింపు.. ఈ రెండు విష‌యాల‌ను ప‌రిశీలిస్తే.. శివ‌రామ‌కృష్ణ‌న్ క‌మిటీ జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ఆప‌ద్భాంధ‌వుడిగా మారింద‌ని అంటున్నారు నిపుణులు. 2014లో కేంద్ర ప్ర‌భుత్వ‌మే ఏపీ రాజ‌ధాని కోసం ఈ క‌మిటినీ నియ‌మించిన విష‌యం తెలిసిందే. ఈ రిపోర్టు ప్ర‌కారం కృష్ణా, గుంటూరు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లో రాజ‌ధాని ఏర్పాటు చేయొద్ద‌ని సూచించారు.

 

దేశానికే ఆహార‌భ‌ద్ర‌త‌ను అందించే ఈమూడు జిల్లాల్లో రాజ‌ధాని ఏర్పాటుతో ప‌ర్యావ‌ర‌ణం దెబ్బ‌తింటుం ద‌ని అన్నారు. ఇక‌, సూప‌ర్ కేపిట‌ల్‌(బాబు చెబుతున్న ప్ర‌పంచ రాజ‌ధాని) ఏర్పాటు వ‌ద్ద‌ని ఈ క‌మిటీ నిర్ద్వంద్వంగా పేర్కొంది. అదేస‌మ‌యంలో పాల‌న‌ను కూడా వికేంద్రీక‌రించాల‌ని ఈ క‌మిటీ సూచించింది. ఇప్పుడు జ‌గ‌న్ అమ‌రావ‌తి విష‌యంలో దీనినే ప్రాతిప‌దిక‌గా తీసుకున్నారు. దీనివెనుక రేపు ఎలాంటి అభ్యంత‌రాలు వ‌చ్చినా.. గ‌తంలో కేంద్రం ఏర్పాటు చేసిన శివ‌రామ‌కృష్ణ‌న్ నివేదిక‌నే తాము అమ‌లు చేస్తున్నామ‌ని ఆయ‌న చేసే వాద‌న‌కు అంద‌రూ నిల‌బ‌డ‌వ‌ల‌సి ఉంటుంది. సో.. మొత్తంగా చూస్తే.. కేంద్రం జోక్యం చేసుకున్నా.. న్యాయ‌స్థానాలు జోక్యం చేసుకున్నా.. జ‌గ‌న్ వ్యూహమే అంతిమంగా విజ‌యం సాధిస్తుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

మరింత సమాచారం తెలుసుకోండి: