మూడు రాజ‌ధానుల‌కు సంబంధించిన వికేంద్రీక‌ర‌ణ బిల్లు, ఏపీ సీఆర్ డీఏ ర‌ద్దు బిల్లు  సెల‌క్ట్ క‌మిటీకి పం పాల‌నే మండ‌లి చైర్మ‌న్ ష‌రీఫ్ నిర్ణ‌యం త‌ర్వాత ప‌రిణామాల నేప‌థ్యంలో ఏపీ ప్ర‌భుత్వంపై మ‌రింత ఒత్తిడి పెరుగుతోందా?  ఇటు రాష్ట్ర‌, అటు జాతీయ స్థాయిలో టీడీపీ అనుకూల మీడియా జ‌గ‌న్‌ను ఇరుకున పెడు తోందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. తాజాగా జాతీయ మీడియాలో వ‌చ్చాయ‌ని, జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని తూర్పార‌బ‌ట్టార‌ని ఓ రెండు ఇంగ్లీష్ జాతీయ దిన‌ప‌త్రిల్లో వ‌చ్చిన వ్యాసాల‌ను ఏపీలోని ప్ర‌ధాన మీడియా వారాలు తేదీలు, వ‌ర్జాల వారీగా ప్ర‌చురించింది.

 

అంటే, మేం చెబుతున్నా.. నీకు చెవికెక్క‌డం లేదు క‌దా.. అదిగో జాతీయ మీడియా కూడా నీమీద బుర‌ద జ‌ల్లింది చూడు! అంటూ.. ఓ ప్ర‌ధాన మీడియా సీఎం జ‌గ‌న్‌పై త‌న అక్క‌సును వెళ్ల‌గ‌క్కింది. ఓకే ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. మ‌రి ఆ జాతీయ మీడియాల్లో వ‌చ్చిన సంపాద‌కీయాల విష‌యానికి వ‌ద్దాం.. రెండు ప్ర‌ధాన ప‌త్రిక‌లు(వీటిలో ఒక‌టి వ్యాపార ప్ర‌యోజ‌నాల‌తో ప‌నిచేసేది) కూడా ఈ నెల 23, 24 తేదీల్లో సంపాద‌కీయాలు ప్ర‌చురించాయి.

 

ఏపీలో అంతా గంద‌ర‌గోళం చింద‌ర వంద‌ర‌గా ఉంద‌ని, రాజ‌ధానిని అల్లంత దూరంలో ఏర్పాటు చేస్తున్నారు.. సో.. ప్ర‌జ‌ల‌కు దూర‌మ‌వుతుంద‌ని త‌మ వాయిస్‌లో వినిపించాయి. ఇక‌, రెండో ప‌త్రిక సంపాద‌కీయంలో.. అస‌లు జ‌గ‌న్ ల‌క్ష్యం ఏమిటో కూడా అర్ధం కావ‌డం లేదు. జిల్లాల వారీగా స‌చివాల‌యాల‌ను ఏర్పాటు చేస్తే..(పంజాబ్‌, హ‌ర్యాయానాల్లో ఏర్పాటు చేశార‌ట‌!) ఇక‌, అన్నీ ఒకే చోట ఉన్న‌ప్ప‌టికీ.. ఎలాంటి ఇబ్బందీ లేద‌ని రాసుకొచ్చింది.

 

అయితే, వాస్త‌వానికి ఈ రెండు సంపాద‌కీ యాల్లో వ‌చ్చిన అంశం.. ప్ర‌తిదీ.. గ‌త కొన్నిరోజులుగా ఏపీలో చంద్ర‌బాబు అనుకూల మీడియా ఊద‌ర‌గొ డుతున్న విష‌యాలే త‌ప్ప కొత్త‌గా చెప్పింది ఏమీ లేదు. విశాఖ రాజ‌ధాని అయితే, క‌ర్నూలు వారికి దూర‌మ‌ని గ్రాఫిక్స్‌లోనూ చూపించారు. అదే స‌మ‌యంలో జ‌గ‌న్ ఇంత వివ‌రంగా మూడు ప్రాంతాల అభివృద్ధికి అని చెబుతున్నా.. ఇంకా అర్ధం కావ‌డం లేద‌ని చెప్ప‌డం వెనుక ఇమిడి ఉన్న వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ఏమిటో చూడాలి.

 

అయినా.. నేడేమీ నార్ల వెంక‌టేశ్వ‌ర‌రావు, సి.రాఘ‌వాచారి స్థాయి, ప‌ట్టు ఉన్నవారి క‌లాల నుంచి వ‌స్తున్న సంపాద‌కీయాలుగా వేటినీ భావించ‌లేదు. నిస్వార్థంగా ప్ర‌జ‌ల ప‌క్షాన నిలిచిన సంపాద‌కీయాల‌కు విలువ ఉంటుంది. కానీ, ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తూ.. స్వ‌ప‌క్షీయుల‌కు మేలు జ‌ర‌గాల‌నే వ్యూహంతో వండి వార్చే సంపాద‌కీయాలు నేడు ఆద‌ర‌ణ కోల్పోతున్న త‌ర‌ణంలో వాటి సూచ‌న‌లు... స‌ల‌హాలు ముందు త‌రాల‌కు ప్ర‌యోజ‌న‌కారులుగా మారేలా జాగ్ర‌త్త‌లు వ‌హించాల్సి న అవ‌సరం ఎంతైనా ఉంది. 

 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: