రాజ‌ధానుల విష‌యంలో జ‌గ‌న్ తీసుకు వ‌చ్చిన బిల్లును అడ్డుకుంటామ‌ని, ఈ విష‌యంలో త‌మ‌ను, త‌మ పార్టీని ఎలా కాపాడుకోవాలో..? అమ‌రావ‌తిని ఎలా ర‌క్షించుకోవాలో?  త‌మ‌కు బాగానే తెలుస‌ని, ఈ క్ర‌మంలో త‌మ వ‌ద్ద అనేక అస్త్రాలు ఉన్నాయ‌ని .. టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఇటీవ‌ల కాలంలో త‌ర‌చుగా ప్ర‌క‌టిస్తు న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న జ‌గ‌న్ తీసుకువ‌చ్చిన వికేంద్రీక‌ర‌ణ బిల్లును శాస‌న మండ‌లిలో వ్య‌హాత్మకం గా అడ్డుకున్నారు. దీనిని ప్ర‌స్తుతానికి సెల‌క్ట్ క‌మిటీకి పంపించారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా .. జ‌గ‌న్ తీసుకున్న‌ మండ‌లి ర‌ద్దు ప్ర‌క‌ట‌న టీడీపీకి శ‌రాఘాతం కానుంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

 

అంటే, ప్ర‌స్తుతం 28 మంది ఎమ్మెల్సీలు ఒక్క టీడీపీకే ఉన్నారు. వీరికి అటు ఇటుగా 2023 వ‌ర‌కు స‌భ్యత్వా లు ఉంటాయి. అయితే, ఇప్పుడు మండ‌లిపై ఆగ్ర‌హంతో ఉన్న జ‌గ‌న్‌.. ఈ మండ‌లిని ర‌ద్దు చేస్తూ.. సోమవా రం అసెంబ్లీలో తీర్మానం చేయించారు. ఈ ర‌ద్దును కేంద్రంతో ఒప్పించుకోగ‌లిగితే.. ఆ వెంట‌నే టీడీపీ స‌భ్యులు భారీగా స‌భ్య త్వాలు కోల్పోయే ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది. ఈ విష‌యాన్ని గ‌మ‌నిస్తున్న టీడీపీ ఎమ్మెల్సీల్లో చాలా మంది త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. వీరు క‌నుక వైసీపీ మ‌ద్ద‌తిస్తే.. అనే చ‌ర్చ కూడా సాగుతోంది. నిజానికి ఇప్పుడు వైసీపీ కూడా ఇదే కోరుకుంటోంది. అత్యంత వేగంగా మండ‌లి నుంచి బిల్లును తీసుకువ‌చ్చి..(ఏదో ఒక రూ పంలో) ఒక నిర్ణ‌యం తీసుకుని, విశాఖ రాజ‌ధానిపై నిర్ణ‌యం తీసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

 

కానీ, ఇప్పుడు మండ‌లి సెల‌క్ట్ క‌మిటీకి పంప‌డంతో అస‌లు మండ‌లి ర‌ద్దు అనే ప్ర‌తిపాద‌న తెర‌మీదికి వ‌చ్చింది. దీంతో టీడీపీ ఎమ్మెల్సీల్లో ఆందోళ‌న క‌నిపించింది. మ‌రి వీరిని బుచ్చ‌గించేందుకు రంగంలోకి దిగిన పార్టీ అధినేత‌, ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ చంద్ర‌బాబు.. త‌న పార్టీ ఎమ్మెల్యేల‌కు సంబంధించి చేసిన ప్ర‌క‌ట‌న ఇప్పుడు వివాదానికి కార‌ణ‌మ‌వుతోంది. ``భ‌య‌ప‌డితే క‌నుమ‌రుగే``- అంటూ చంద్ర‌బాబు ఎమ్మెల్సీల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌క‌ట‌న‌లో రెండు అర్ధాలు ఉన్నాయ‌ని అంటున్నారు విశ్లేష‌కులు. ఎమ్మెల్సీలు భ‌య‌ప‌డి వైసీపీకి మ‌ద్ద‌తిస్తే.

 

ఇక‌, వారిని రాజ‌కీయంగా శాశ్వ‌తంగా లేకుండా చేస్తాన‌నే అర్ధం ఒక‌టైతే.. ఇప్పుడు ఎమ్మెల్సీలుగా బ‌య‌ప‌డి వైసీపీకి అనుకూలంగా ఓటేస్తే.. వ‌చ్చే రోజుల్లో మా ప్ర‌భుత్వం వ‌స్తుంది క‌నుక‌.. అప్పుడు మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు? అని ఇప్ప‌టి  నుంచి చంద్ర‌బాబు వారిని గంద‌ర‌గోళానికి గురి చేశార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. మ‌రి ఈ డ‌బుల్ మీనింగ్ డైలాగుల వెనుక బాబు ఆశిస్తున్నల‌బ్ధి ఏంట‌నే ప్ర‌శ్న కూడా తెర‌మీదికి వ‌స్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: