అక్కడ ఓ సభ జరుగుతోంది.. తెలుగుదేశాధినేత చంద్రబాబు గారి సభ.. ఆయన ఆవేశంగా ప్రసంగిస్తున్నారు.. జనంపై రంకెలు వేస్తున్నారు.. నేను గత ఐదేళ్లు మీకోసం రేయింబగళ్లు కష్టపడ్డాను.. నిద్రాహారాలు మాని మరీ కష్టపడ్డాను.. నా మనవడిని కూడా ఎత్తుకోకుండా మీ కోసం కష్టపడ్డాను.. కానీ మీరేం చేశారు.. నన్ను చిత్తు చిత్తుగా ఓడించారు. మొత్తం 175 సీట్లుంటే.. కనీసం 50 సీట్లు కూడా ఇవ్వలేదు..

 

ఇప్పుడేమైంది.. మీ తిక్క బాగా కుదిరింది. మీకు ఇలాగే జరగాలి.. ఈ ఐదేళ్లు మీకు తగిన శాస్తి జరగాలి.. లేకపోతే.. నన్ను ఓడిస్తారా.. నాలాంటి ప్రపంచ స్థాయి నాయకుడిని ఓడిస్తారా.. అసలు మీకు బుర్ర ఉందా.. మీకు బుద్ధి ఉందా.. ఇక మీకు ఫించన్లు రావు.. ఇక మీకు కరంటు రాదు.. ఇక మీకు రైతు భీమా రాదు.. ఇక మీకు ఏమీ రావు..

 

మీరు నన్ను ఎందుకు ఓడించానా అని తల గోడకేసి కొట్టుకోవాలి.. నన్ను ఓడించినందుకు మీరు లెంపేలేసుకోవాలి.. ఇలా సాగుతోంది చంద్రబాబు గారి ప్రసంగం. ఇలా అంటే అచ్చంగా ఇలాగే అని కాదు కానీ... ఆయన ప్రసంగంలో అంతర్లీనంగా కనిపిస్తున్న భావం ఇదే. అంతకుముందు కొన్ని రోజుల క్రితం వరకూ కూడా చంద్రబాబు గారి ప్రసంగాలు ఇలాగే సాగాయి.

 

అసలు నన్ను ఎందుకు ఓడించారో జనం అర్థం కావడం లేదు. అసలు నేను ఓడిపోవడం ఏంటి.. నన్ను ఓడించి జనం తప్పు చేశారు.. ఈ ధోరణిలో సాగాయి. జనం మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడించి తొమ్మిది నెలలు అవుతున్నా ఆ దెబ్బ నుంచి ఇంకా చంద్రబాబు తేరుకున్నట్టు కనిపించడం లేదు.

 

రాజకీయాల్లో ఎత్తు పల్లాలు సహజం.. గెలుపుఓటములు సహజం. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్నవారే రాణిస్తారు. కానీ పాపం .. చంద్రబాబు ఓటమిని అంగీకరించేందుకే సిద్ధంగా లేదు. తన ఐదేళ్ల పాలనలో జరిగిన లోపాలను విశ్లేషించుకునే ఆలోచనే లేదు. నేను సూపర్.. నా పాలన సూపర్.. ఈ జనమే పిచ్చి జనాలు.. వీళ్లకు కనీసం ఓటేయడం కూడా రాదు.. వీళ్ల ఖర్మ ఇంతే.. ఇలా తప్పించి చంద్రబాబు వేరేలా ఆలోచించే ప్రయత్నమే చేయడం లేదు.

 

 

అందుకే అధికారం కోల్పోయి తొమ్మిది నెలలైన తర్వాత కూడా అదే ధోరణి.. అదే వైఖరి. చంద్రబాబు తాజా ప్రసంగాలు చూసి.. ఇదెక్కడి శాడిజంలా నాయనో అని తలపట్టుకుంటున్నారు సొంత పార్టీ నేతలు కూడా. మరి బాబోరు మారేదెప్పుడో..?

మరింత సమాచారం తెలుసుకోండి: