శ్రీ‌దేవి అంటే చాలు ముందు అందరికీ గుర్తు వ‌చ్చేది ఆమె అందం త‌ర్వాత అభిన‌యం. అందుకే ఆమెను అతిలోక‌సుంద‌రితో పోలుస్తారు. శ్రీ‌దేవి 1963వ సంవ‌త్స‌రంలో ఆగ‌స్టు 13వ తేదీన త‌మిళ‌నాడు రాష్ట్రంలో శివ‌కాశిలో జ‌న్మంచింది. తెలుగు, హిందీ, త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల్లో వంద‌లాది సినిమాల్లో క‌థానాయిక‌గా జ‌న్మించింది. శ్రీ‌దేవి అగ్ర‌శ్రేణి క‌థానాయిక‌గా గుర్తింపు సంపాదించింది. 

 

శ్రీ‌దేవి వ్య‌క్తిగ‌త జీవితం బాల్యం విష‌యానికి వ‌స్తే...

ఆమె తండ్రి పేరు అయ్య‌ప్ప‌న్ ఓ న్యాయ‌వాధి. త‌ల్లి పేరు రాజేశ్వ‌రి శ్రీ‌దేవికి శ్రీ‌ల‌త అనే ఒక సోద‌రి ఉంది. స‌తీష్ అని ఒక సోద‌రుడు కూడా ఉన్నాడు. శ్రీ‌దేవి తండ్రి ల‌మ్‌హే అనే చిత్ర నిర్మాణంలో ఉండ‌గానే చ‌నిపోయారు. అలాగే శ్రీ‌దేవి త‌ల్లి కూడా జుదాయియే అనే చిత్ర నిర్మాణంల ఉండ‌గానే చ‌నిపోయారు. అయితే హిందూ సంప్ర‌దాయాలు పాటించే ఏ ఇంట్లో అన్నా ఇంట్లో పెద్ద కుమారుడు త‌ల్లి చితికి నిప్పు అంటిస్తాడు. కానీ శ్రీ‌దేవి త‌న త‌ల్లి చితికి నిప్పంటించింది. 

 

శ్రీ‌దేవి న‌ట జీవితాన్ని ప‌రిశీలిస్తే...

శ్రీ‌దేవి అగ్ర క‌థానాయిక‌గా తెలుగు, త‌మిళం, హిందీ, క‌న్న‌డ భాష‌ల్లో కొన‌సాగించింది. శ్రీ‌దేవి త‌న న‌ట‌న జీవితాన్ని బాల న‌టిగా మొద‌లు పెట్టింది. తొల‌న త‌న న‌టజీవితాన్ని మొద‌లుపెట్టిన కొత్త‌లో ఎక్కువగా త‌మిళం, మ‌ల‌యాళం చిత్రాల్లో న‌టించింది. శ్రీ‌దేవి న‌టించిన చెప్పుకోద‌గ్గ మ‌ల‌యాళ చిత్రాలు ఆద్య‌పాద‌న్‌, ఆలింగ‌నన్‌, క‌ట్టువం శిక్ష‌యుం 1976లో బాల‌చంద‌ర్ చిత్రంలో క‌మ‌ల్‌హాస‌న్‌, ర‌జ‌నీకాంత్‌ల‌తో క‌లిసి న‌టించి మంచి పేరు తెచ్చుకుంది శ్రీ‌దేవి. మూట్ర‌ముడుచ్చు చిత్రం శ్రీ‌దేవికే కాదు ర‌జ‌నీకాంత్‌కి కూడా మంచి హిట్ ఇచ్చింది. ఆ త‌ర్వాత శ్రీ‌ద‌వి ఎప్పుడూ కూడా వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. శ్రీ‌దేవి త‌ర్వాత ఎన్నో విజ‌య‌వంత‌మైన సినిమాల్లో న‌టించింది. క‌మ‌ల్‌హాస‌న్ తో ఆమె ఎక్కువ సినిమాల్లో న‌టించింది. గురువు, శంక‌ర్‌లాల్‌, వ‌రుమ‌యం శిగ‌ప్ప ఎలా ఎన్నో చిత్రాల్లో న‌టించింది.  ఇక ర‌జ‌నీకాంత్‌తో ధ‌ర్మ‌యుద్ధం, ప్రియా, పోకిరి రాజా, ట‌క్క‌రి రాజా, ఆడుతావారిస్సు1975 నుంచి 85 వ‌ర‌కు త‌మిళంలో అగ్ర క‌థానాయిక‌గా పేరు గాంచింది. త‌మిళంలోనే కాకుండా తెలుగులో కూడా అగ్ర‌స్థాయిలోనే కొన‌సాగింద‌ని చెప్ప‌వ‌చ్చు. ఆమె న‌టించిన తెలుగు సినిమాల‌కు ఎక్కువ‌గా కె.రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఎన్టీరామారావుతో కొండ‌వీటిసింహం, సర్దారు పాపారాయుడు  బొబ్బిలి పులి ఇలా అనేక చిత్రాల్లో న‌టించాడు. ఇక ఏఎన్నార్ విష‌యానికి వ‌స్తే ముద్దుల కొడుకు, ప్రేమాభిషేకం, బంగారుకానుక‌, ప్రేమ‌కానుక మొద‌ల‌గు చిత్రాల్లో న‌టించారు.

 

ఇక సూప‌ర్‌స్టార్ కృష్ణ‌తో క‌లిసి కంచుకాగ‌డా, క‌ల‌వారిసంసారం, బుర్రిపాలెం బుల్లోడు, చిత్రాల్లో న‌టించింది శ్రీ‌దేవి. క‌మ‌ల్‌హాస‌న్ త‌ర్వాత తిరిగి మ‌ళ్ళీ అంత ఎక్కువ చిత్రాల్లో న‌టించింది సూప‌ర్‌స్టార్ కృష్ణ‌తోనే అని చెప్ప‌వ‌చ్చు. ఓప‌క్క తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళంలో బిజీగా ఉన్న స‌మ‌యంలోనే ఆమె హిందీలో అడుగుపెట్టారు. బాలీవుడ్‌లో శ్రీ‌దేవి ఎక్కువ చిత్రాలు జితేంద్ర‌తో స్క్రీన్ షేర్ చేసుకుంది. బాలీవుడ్‌లో శ్రీ‌దేవి న‌టించిన ఎక్కువ చిత్రాలు తెలుగు నుండి రీమేక్ అయిన చిత్రాలే. జితేంద్ర‌తో న‌టించి హిమ‌జ్వాలా చిత్రంతో శ్రీ‌దేవి బాలీవుడ్‌లో కూడా వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. అప్పటి నుంచి బాలీవుడ్‌లో శ్రీ‌దేవిని థండ‌ర్ తైస్ అని పిలిచేవారు. న‌గీనా, మిస్ట‌ర్ఇండియా, చాందిని లాంటి చిత్రాలు  ఆమెను అగ్ర శ్రేణిలో నిల‌బెట్టాయి. ఇక‌బాలీవుడ్‌లోనే అత్య‌ధిక రెమ్యూన‌రేష‌న్ అందుకునే న‌టిగా ఎదిగింది. 

 

ఇక హాలీవుడ్‌లో ఆంగ్ల చిత్ర ద‌ర్శ‌కుడు ఆమెతో సినిమా తీయాల‌నుకుని ఆమెతో చిత్రాన్ని నిర్మించేందుకు సంప్ర‌దించారు. కానీ శ్రీ‌దేవి ద‌గ్గ‌ర స‌మ‌యం లేక‌పోవ‌డం వ‌ల్ల హాలీవుడ్ మూవీని తిర‌స్క‌రించారు. ఇక జుదాయి చిత్రంతో ఆమె వెండితెర‌కు జుదాయి చెప్పేశారు. బోనీక‌పూర్ ని వివాహ‌మాడారు. శ్రీ‌దేవి బోనీక‌పూర్‌ని  పెళ్ళాడ‌క ముందు కూడా కొన్ని క‌థ‌నాలు శ్రీ‌దేవి కెరియ‌ర్‌లో సంచ‌ల‌నం రేపాయి. శ్రీ‌దేవి కొంత కాలం మిథున్ చక్ర‌వ‌ర్తితో క‌లిసుంద‌ని డేటింగ్ చేసింద‌ని వారిద్ద‌రు ర‌హ‌స్య వివాహం చేసుకున్నార‌ని గాసిప్స్ వ‌చ్చాయి. శ్రీ‌దేవి త‌ల్లి హాస్ప‌ట‌ల్లో ఉన్న స‌మ‌యంలో బోనీక‌పూర్ చాలా హెల్ప్ చేశార‌ని త‌న త‌ల్లికి ఇచ్చిన మాట ప్రకారం బోనీక‌పూర్‌ని వివాహం ఆడింది అన్నారు. శ్రీ‌దేవికి ఇద్ద‌రు ఆడ‌పిల్ల‌లు జాన్వి, ఖుషీ. శ్రీ‌దేవి ఒక బాలీవుడ్ సీరియ‌ల్‌లో న‌టించారు. 

 

ఫైన‌ల్ ట‌చ్‌...
ఆమె జీవితం కష్టాల మయం, ఆమె సినిమా అజరామరం, ఆమెను మించిన నటి మ‌రెవ‌రు లేరు, ఆమె స్థాయిని అందుకునే రేంజ్ కూడా  ప్ర‌స్తుతం ఉన్న‌వారికి ఎవరికి లేదు. శ్రీదేవి సినిమాను కావాలనుకుంది. కాని శ్రీదేవిని సినిమా తనలో దాచుకుంది. ఆమె మరణం ఒక సందేహం… తీరని సందేహం. నా అన్న వాళ్ళ అవమానాలు వేదించినా, వెండి తెర మీద పడిన పూలలో ఆమె తన సంతోషాన్ని వెతుక్కుంది. ఎన్నో అవార్డులు, ఉత్తమ నటిగా ఆమెను వరించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: