బిజెపి జనసేన పొత్తు పెట్టుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసినా ఆ రెండు పార్టీలు మాత్రం రాబోయే రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కలిసి ముందుకు వెళ్లేందుకు సిద్ధమయ్యాయి. ఆ సందర్భంగా పవన్ అమరావతికి బిజెపి మద్దతు ఇస్తానని చెప్పింది కాబట్టి ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నాను అని పవన్ ప్రకటించారు. ఇది నిజమే అని ఏపీలో చాలామంది నమ్మారు. ఇక అమరావతి రైతులు కూడా పవన్ బీజేపీ పొత్తుపై చప్పట్లు కొట్టారు. ఇంత వరకు బాగానే ఉన్నా ఇప్పుడు అమరావతి వ్యవహారం ఒక కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. జగన్ తీసుకున్న నిర్ణయానికి ఏ అడ్డంకి లేకుండా దానికి సంబంధించిన నిర్ణయాలు వెలువడుతున్నాయి.

 

IHG


ఇక అమరావతి విషయంలో టిడిపి మొదట్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా, ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పార్టీ పక్కకు తప్పుకున్నట్టుగా కనిపిస్తోంది. కొద్దిమంది టీడీపీ అనుకూల వ్యక్తులు మాత్రం అమరావతి ఉద్యమాన్ని నడుపుతున్నారు. ఇదిలా ఉంటే అమరావతి వ్యవహారంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకునేలా కనిపించడం లేదు. కేంద్రం నుంచి హామీ తీసుకున్నానని, ఆ మేరకు పొత్తు పెట్టుకున్నాను అని పవన్ కళ్యాణ్ చెప్పినా ఇప్పుడు పరిస్థితి తారుమారు అయినట్టుగా కనిపిస్తోంది. వైసీపీ మాత్రం తాము కేంద్రానికి అన్నీ చెప్పే చేస్తున్నామని ముందు నుంచి చెబుతూ వస్తోంది.


 కొద్ది రోజుల క్రితం బీజేపీ పెద్దలు రాజధాని విషయంలో తాము జోక్యం చేసుకోమని, తమ మనసులో మాట బయట పెట్టారు. ఇప్పుడ బిజెపి అమరావతి విషయంలో తలదూర్చేలా కనిపించడం లేదు. కానీ ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న జనసేన అధినేత పవన్ అమరావతి రైతులకు ఇచ్చిన మాట ఏ విధంగా నెరవేర్చాలో తెలియని పరిస్థితి నెలకొంది. అందుకే పవన్ బాగా సైలెంట్ అయిపోయారు. ఈ విషయంలో అమరావతి రైతుల నుంచి ఒత్తిడి పెరిగితే ఒంటరిగానే పోరాటం చేయాలి తప్ప బీజేపీతో కలిసి ఉద్యమం చేసే పరిస్థితి లేదు. దీంతో అసలు ఆ పార్టీతో పొత్తు ఎందుకు పెట్టుకున్నామా అనే బాధ జనసేన వర్గాల్లో వ్యక్తం అవుతోంది. అలా అని రాజధానిపై జనసేన ఇప్పటికిప్పుడు ఏ ఉద్యమం చేపట్టే పరిస్థితి కూడా లేదు. 

 

IHG bjp


ప్రస్తుతం పవన్ సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఒక వైపు సినిమా మరోవైపు రాజకీయం ఇలా రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్నారు.బీజేపీతో పొత్తు వ్యవహారం అనుమానాస్పదంగా ఉండడం, ఆ పార్టీ అగ్ర నాయకులు ఎవరూ పవన్ కు తగిన ప్రాధాన్యం ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో పవన్ ముందుకు వెనక్కి వెళ్లలేని పరిస్థితి ఉంది. ఇక బీజేపీ కూడా పవన్ ను కేవలం తమ అవసరాల మేరకే వాడుకుందాం .. మిగతా సమయంలో లైట్ తీసుకుందాం అన్నట్టుగా వ్యవహారం చేస్తోంది. అమరావతి విషయంలోనే కాదు ఏ విషయంలోనూ బీజేపీ జనసేన లో ఏకాభిప్రాయం కనిపించకపోవడం ఆ రెండు పార్టీల పొత్తు పై అనేక అనుమానాలు కలిగిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: