ఏపీ మాజీ మంత్రి, ప్ర‌స్తుత టెక్క‌లి ఎమ్మెల్యే అచ్చ‌న్నాయుడు తాజాగా చేసిన ఓ కామెంట్‌పై సోష‌ల్ మీడి యాలో స‌టైర్లు పేలుతున్నాయి. `అచ్చీ` మాబాగా సెప్పావ్‌గా! అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అం తే కాదు, శ్రీకాకుళం యాస‌లో ఆయ‌న‌పై బాగానే కామెంట్లు పెడుతున్నారు. 1600 కోట్లు పోనాయా అచ్చ‌న్నా! అంటూ వ్యాఖ్య‌లు పెడుతున్నారు. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. మార్చి నెల 1 వ తారీకు రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక పింఛ‌న్ల‌ను వృద్ధులు, విక‌లాంగులు, రోగులు, ఒంటరి మ‌హిళ‌ల‌కు జ‌గ‌న్ ప్ర‌భుత్వం పింఛ‌న్లు అందించింది. ఇందులో విశేషం ఏంటంటే.. వాటిని గ‌తంలో చెప్పిన‌ట్టుగా వ‌లంటీర్లు, అధికారులు తూ.చ త‌ప్ప‌కుండా జ‌గ‌న్ ఆదేశాల‌ను అమ‌లు చేశారు.

1వ తారీకు వాస్త‌వానికి ఆదివార‌మే అయిన‌ప్ప‌టికీ.. సీఎం జ‌గ‌న్‌.. ఆ రోజును వ‌ర్కింగ్ డే గా ప్ర‌క‌టించి పింఛన్ల వ‌ర‌కు అందించే బాధ్య‌త‌ను ఉన్న‌తాధికారుల‌కు అప్ప‌గించారు. దీంతో ఐఏఎస్‌లు రంగంలోకిదిగారు. మారుమూల గిరిజ‌న ప్రాంతాల కు కూడా వెళ్లి ల‌బ్ధిదారుల‌కు పింఛ‌న్లు అందించారు. అంతేకాదు, కొండలు , గుట్ట‌లు, వాగులు, వంక‌ల‌ను దాటుకుని మ‌రీ వృద్ధుల చెంత‌కే వెళ్లి పింఛ‌న్లు ఇచ్చారు. ఇది రికార్డు స‌మ‌యంలో అంటే మ‌ధ్యాహ్నం 1గంట‌కే 45 శాతం పూర్తి చేశారు. సాయంత్రానికి దాదాపు 81 శాతం మంది కి పింఛ‌న్లు అందించారు. దీంతో ఈ విష‌యాన్ని అధికార పార్టీ ప్ర‌చారం చేసుకుంది.



ఈ ప్ర‌చారాన్ని త‌ట్టుకోలేక పోయిన టీడీపీ బృందం ఏదో విధంగా బెడ్డ‌లు వేయాల‌ని భావించింది. దీంతో రంగంలోకి దిగిన అచ్చ‌న్న అండ్ పార్టీ.. జ‌గ‌న్ ప్ర‌బుత్వంపై విమ‌ర్శ‌లు చేశారు. మేం కూడా ప్ర‌తి నెల 1వ తారీకునే ఇచ్చాం. అయినా ఇప్పుడు జ‌గ‌న్ చేసింది ఏమీ లేదు. పైగా ఆయ‌న వ‌లంటీర్ల‌ను పెట్టి పింఛ‌న్లు ఇవ్వ‌డం వ‌ల్ల ఏడాదికి 1600 కోట్లు వృధా చేశారు. వారికి జీతాలు ఇవ్వ‌డం వృథా అని సూత్రీక‌రించారు. అంతేకాదు. ఈ 1600 కోట్లు(వ‌లంటీర్ల జీతాలు) ఉంటే వేరే ప‌థ‌కాలు అమ‌ల‌య్యేవ‌ని, కొన్ని వంద‌ల మందికి కొత్త పింఛ‌న్లు ఇచ్చే అవ‌కాశం ఉండేద‌ని త‌న‌దైన శైలిలో వ్యాఖ్యానించారు.



దీనిని పాయింట్ అవుట్ చేసిన సోష‌ల్ మీడియా.. వలంటీర్లు ఆ ఒక్క‌రోజు క‌ష్ట‌ప‌డి నందుకు జ‌గ‌న్ 1600 కోట్లు ఇచ్చార‌నే ఆలోచ‌న‌ను తీవ్రంగా త‌ప్పుప‌ట్టింది. పైగా వ‌లంటీర్ వ్య‌వ‌స్థ వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు గ‌డ‌ప దాట‌కుండా ప్ర‌భుత్వ ప‌థ‌కాలు చేరువ అవుతున్నాయ‌న్న విష‌యాన్ని అచ్చ‌న్న మ‌రిచిపోతున్నార‌ని, ఇంకో కీల‌క విష‌యం ఏంటంటే రాష్ట్రంలో క‌నీసంలో క‌నీసం 3 ల‌క్ష‌ల మంది వలంటీర్లు జ‌గ‌న్ ప్ర‌భుత్వ నిర్ణ‌యం కార‌ణంగా ఉపాధి పొందార‌నే విష‌యాన్ని గుర్తించాల‌ని అంటున్నారు. ఒక‌వేళ‌.. వృథా చేశార‌నే అనుకున్న ప్ప‌టికీ.. అది నిరుద్యోగులైన వ‌లంటీర్ల‌కు ఇవ్వ‌డంలో త‌ప్పులేద‌ని చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌పై స‌టైర్లు పేలుస్తున్నారు. మ‌రి అచ్చ‌న్న ప‌ట్టించుకుంటాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: