పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఇప్పటివరకు చూసుకుంటే జనసేన పార్టీలో మొత్తం వ్యవహారం అంతా గందరగోళంగానే ఉంటూ వస్తోంది. రాజకీయాల్లోకి రావడమే కాకుండా ప్రజలు ఎవరూ చూడని రాజకీయం వారికి చూపించి, సాంప్రదాయ రాజకీయ పార్టీలకంటే భిన్నమైన పాలన అందించాలని పవన్ భావించారు. ఆ ఉద్దేశంతోనే పార్టీని పెట్టారు. పవన్ పార్టీ పెట్టడం ఏపీలో సంచలనం సృష్టించడంతో పాటు అనేక అనుమానాలను కూడా కలిగించింది. ఎందుకంటే గతంలో పవన్ అన్న చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించడం, ఆ తరువాత కాంగ్రెస్ లో విలీనం చేయడంతో అప్పటివరకు ఉన్న క్రేజ్ మొత్తం చిరంజీవికి పోయింది. ఇక ఆ తరువాత పవన్ జనసేన స్థాపించినా అదే రకమైన అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.

IHG


తాను పూర్తికాలం రాజకీయాల్లోని ఉంటానని, సినిమాలకు  కూడా ఇక స్వస్తి చెబుతున్నానని ఆర్భాటంగా ప్రకటించారు. కానీ జనసేన స్థాపించిన తర్వాత వచ్చిన  ఎన్నికల్లో పవన్ పోటీ చేయలేదు. ఇంకా పూర్తిస్థాయిలో బలపడలేదు అంటూ పోటీకి దూరంగా ఉన్నారు. కానీ అదే సమయంలో టిడిపి, బీజేపీ కూటమికి మద్దతు పలికి పవన్ వ్యూహాత్మక తప్పిదం చేశారు. అంతేకాదు ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఏపీలో టీడీపీతో సన్నిహితంగా మెలుగుతూ వచ్చారు. సొంత పార్టీని బలోపేతం చేసే విషయంలో పవన్ నిర్లక్ష్యం వహించాడు..దీంతో క్షేత్రస్థాయిలో పార్టీ బలపడ లేకపోయింది.

 

IHG

 తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నెలకొన్న ప్రజా సమస్యలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు పైన పోరాటం చేసేందుకు పవన్ ముందుకు రాలేదు. పైగా ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ పై విమర్శలు చేయడం ద్వారా పవన్ కళ్యాణ్ చంద్రబాబు మనిషి, ఆయన ఏది చెబితే అదే పవన్ చేస్తారనే అపకీర్తిని పవన్ మూటగట్టుకున్నారు. దీంతో జనసేనపైన, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పైన ప్రజల్లోనూ అనుమానాలు మొదలయ్యాయి. 

IHG


ఇక మొన్నటి ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీచేసినా క్షేత్రస్థాయిలో బలహీనంగా ఉండడం, ఆ పార్టీలో పవన్ తప్ప మరో బలమైన సమర్థులైన నాయకుడు లేకపోవడంతో, ఆ ఎన్నికల్లోనూ పవన్ ఓటమి చెందారు. ఏపీలో ఏ నాయకుడికి, ఏ సినిమా హీరోకి లేనంత క్రేజ్ పవన్ కళ్యాణ్ కు ఉంది. కష్టమైనా, నష్టమైనా పవన్ మాటే మా బాట అన్నట్టుగా నడుచుకునే అశేషమైన అభిమానులు ఉన్నా.. పవన్ సమర్థవంతంగా వినియోగించుకోలేకపోయారు. ఇప్పటికీ పవన్ అనుమానాస్పదంగానే రాజకీయాలు చేస్తున్నారు. పవన్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు జగన్ ను మాత్రమే టార్గెట్ చేసుకుంటూ, చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తూ జనాల్లో మరింతగా చులకనయ్యాడు పవన్. ఇప్పటికీ పవన్ అసలు పార్టీ పుంజుకోకపోవడానికి కారణం ఏంటి అనే విషయంపై దృష్టి పెట్టకుండా, కన్ఫ్యూజన్ గానే రాజకీయాలు చేస్తున్నారు. 

IHG


సొంతంగా జనసేన ఏపీలో బలమైన పార్టీగా అవతరించే అవకాశం ఉన్నా, పవన్ తన సామర్ధ్యాన్ని, తన ఆలోచనలతో తక్కువ చేసి చూసుకుంటున్నాడు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసి, పార్టీ నాయకులు, కార్యకర్తల్లో మనోధైర్యం నింపి సొంతంగా ఎదిగే ప్రయత్నం చేయకుండా, బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. పొత్తు పెట్టుకోవడం తప్పుకాదు కానీ, ఇప్పుడు పూర్తిగా జనసేన బిజెపి ఆధీనంలోకి వెళ్ళిపోయింది. ఏపీలో సొంతంగా పవన్ ఏ కార్యక్రమం, ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. ఇదంతా పవన్ చేసుకున్న స్వయంకృతాపరాధంగానే కనిపిస్తుంది. మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల్లో పోటీ చేసేందుకు పవన్ వెనకడుగు వేస్తున్నారు. కానీ బీజేపీ మాత్రం జనసేనతో కలిసి తాము స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించింది. 

 

IHG


ఏపీలో జనసేనకు బీజేపీకి క్షేత్రస్థాయిలో ఎంత బలం ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరోసారి ఈ రెండు పార్టీలు ఏపీలో అవమానానికి గురికాక తప్పదు. ఇప్పుడు కూడా పవన్ ఈ విషయాల పైనే చర్చించేందుకు ఢిల్లీకి వెళ్తున్నారు. పూర్తిగా బిజెపి కంట్రోల్ లోకి వెళ్లిపోయిన పవన్ జనసేన పార్టీ భవిష్యత్తు కూడా వారి చేతుల్లోనే పెట్టేసారు. వచ్చే ఎన్నికల నాటికి జనసేన బలపడుతుంది అనే నమ్మకం ఇప్పుడు ఆ పార్టీ నాయకుల్లో కూడా లేదు. జనసేన లో ఇప్పటికీ పవన్ తప్ప మరో ప్రజా బలం ఉన్న సమర్ధుడైన నాయకుడు మరొకరు కనిపించడం లేదు. గతంలో సినిమాల్లో నటించను అని చెప్పిన పవన్ ఇప్పుడు ఆ మాట మరిచిపోయే పూర్తిగా సినిమాలలో బిజీ అయిపోయారు.

 

IHG

 

ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో నడుస్తున్న చర్చ ఏంటి అంటే..?  జనసేన పార్టీని త్వరలోనే  బిజెపిలో విలీనం చేస్తారని, ఇక పూర్తి స్థాయిలో సినిమాల మీద దృష్టి పెడతారనే ప్రచారం జరుగుతోంది. జనసేన పార్టీపైన ఎన్ని విమర్శలు వచ్చినా, ఎటువంటి ప్రచారాలు పెరుగుతున్నా పవన్ మాత్రం స్పందించడం లేదు. 

IHG


అసలు ఇప్పుడు జనసేన పార్టీ పరిస్థితిపై ప్రజల్లోనే కాదు, సొంత పార్టీ నాయకుల్లోనే సమాధానం లేని ప్రశ్నలెన్నో తలెత్తుతున్నాయి. అసలు పవన్ ఏ ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాడు అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఇన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పేవారు కూడా జనసేన లో కరువయ్యారు. కేవలం కాలమే దేనికి సమాధానం అన్నట్టుగా ఇప్పుడు ఆ పార్టీలో పరిస్థితి నెలకొంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: