ఎవడి ముఖం చూద్దామన్నా ఇప్పుడు మూతి.. ముక్కూ కనిపించకుండా మాస్క్ లు, కర్చీఫ్ లు ఇలా ఏది దొరికితే పెట్టుకుని రోడ్ల మీద తిరిగేస్తున్నారు. తెలిసినవాడు కూడా తెలియనట్టు చూసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఏంట్రా అంటే కరోనా అంటున్నారు. ఇక పరాయి దేశాల నుంచి ఎవడైనా వచ్చాడంటే... వాడిని అనుమానంగా చూడడమే కాదు, వాడిని పురుగుని చూసినట్టుగా, గ్రహాంతరవాసులను చూసినట్టుగా అనుమానంగా చూస్తున్నారు. ఇప్పుడు ఆ దేశం , ఈ దేశం, ఆ ఊరు ఈ ఊరు అనే తేడా లేకుండా అందరూ మాస్క్ మహారాజులు అయిపోయారు. ఏంటో వింత వింత జబ్బులు, వైరస్ లు అన్నీ ఇప్పుడే పుట్టుకొచ్చేస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో అయితే చెప్పక్కర్లేదు. 

 

IHG


ఆ చైనా వైరస్ మనల్ని ఏమీ చేయలేదు. ఆ దేశం వేరు ఈ దేశం వేరు. అక్కడి వైరస్ గారు మన వేడి దేశాల్లో బతికి చావదు అంటూ ఒకడు చెబుతుంటే... వంటింట్లో వెల్లుల్లి ఉందా అయితే కరోనా నుంచి మీరు సేఫ్ అంటూ ఇంకొకడు. కరోనా అంటే కరీనా సిస్టర్ కాదా ..? వైరస్ పేరా ..? నాకు తెలీదురా అనేవాడు ఇంకొకడు. ఏంటో వింత వింత క్యారెక్టర్లు. ఈ సోదంతా ఎందుకులే కానీ. ఇప్పడు అసలు మ్యాటర్ కు పరిగెత్తుకుని వచ్చేద్దామా ? 

 

IHG


అదిగో పులి అంటే ఇదిగో మేక అనే టైపు కదా మన 'టెల్గూ'  మీడియా. ఇంకేముందు ఎవడు తుమ్మినా, దగ్గినా కరోనా కరోనా అంటూ ఒకటే హడావుడి. కొంతమందిని ఆసుపత్రుల్లో వేసి అన్ని రకాల ట్రీట్మెంట్స్ చేస్తున్నారు. కొన్ని మీడియాల్లో చాలామందికి కరోనా వచ్చేసింది అంటూ ఊదరగొడుతుంటే.. కొన్ని మీడియా గొట్టాలు మాత్రం కరోనా లేదు పాడూ లేదు. ఎవరికీ పాజిటివ్ రాలేదు అంటూ చెబుతూ అసలు కరోనా మన తెలుగు రాష్ట్రాలకు పాకిందో లేదో అనే కన్ఫ్యూజన్ లో పడేసారు. ఇది ఇలా ఉంటే అందరూ మాస్క్ మహారాజుల్లుల్లా తిరుగుతుంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న ఈటెల రాజేందర్ ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. పొద్దున్న లేచింది మొదలు పొద్దుగూకే వరకు ఆసుపత్రులంటా తీరుతున్న మంత్రిగారు మాస్క్ పెట్టుకోకుండా రిస్క్ చేస్తున్నారు. 

 

IHG


ఏంటి మంత్రివర్యా ..? అందరూ మాస్క్ లు పెట్టేస్తుంటే మీరేమి ? ఇలా తిరిగేస్తున్నారు అని ప్రశ్నిస్తే...? కరోనా వైరస్ సోకకుండా ఉండాలంటే వ్యక్తిగత శుభ్రత చాలా ముఖ్యం.  వైరస్ సోకిన వారు తప్ప ఇంకెవరూ మాస్కులు పెట్టుకోకపోయినా ఫర్వాలేదు అంటూ ఈటెల గారు తాపీగా సెలవిచ్చారు.పాపం ఈ అమాయక జనానికి తెలిసొచ్చేలా చేసేందుకే మంత్రిగారు ఇంత సాహసం చేస్తున్నారట. అంటే మంత్రిగారి మాటలను డికోడ్ చేస్తే తెలిసింది ఏంటి అంటే ... ఓరి అమాయకుల్లారా ఆమూతి గుడ్డలు అవతల పడేసి మీ మూతి ముక్కూ ఈ ప్రపంచానికి చూపించని అని మంత్రిగారు సెలవిచ్చారన్నమాట.  

మరింత సమాచారం తెలుసుకోండి: