మారుతీ రావు అంటే తెలియకపోవచ్చేమో కానీ, మిర్యాలగూడ మారుతీ రావు అంటే తెలియని వారు ఉండరు. అంతగా ఆయన పేరు టీవీల్లోనూ, పేపర్లలోనూ, సోషల్ మీడియాలోనూ మారుమోగింది. వేరే కులం వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుని కూతురు  వెళ్ళిపోయింది అన్న బాధతో, సమాజంలో తన గౌరవ మర్యాదలకు భంగం కలిగిందనే  భయంతోనో, తన అల్లుడు పెరుమాళ్ళ ప్రణయ్ ను మారుతీ రావు కిరాయి హంతకులతో నరికి పంపించాడు. ఇలా చేయడం ద్వారా, మారుతీ రావు క్షమించని నేరమే చేశాడు. ఆయన చేసింది నూటికి నూరు శాతం తప్పే. అయితే ఈ సంఘటన మాత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కనీసం ఒక నెల రోజుల పాటు ఈ వ్యవహారం మీడియా ఛానళ్లలో జోరుగా ప్రచారం జరిగింది. దీనిపై రకరకాల కోణాల్లో టీవీ డిబేట్ లు జరిగాయి.

 

IHG


 ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంచలన విషయాలు బయట పడ్డాయి. ఇప్పుడు ఆ మారుతీరావు భూమ్మీద లేడు. ఆత్మహత్య చేసుకున్నాడు. అసలు అమృత, ప్రణయ్ మారుతీ రావు వ్యవహారాల్లో మీడియా జోక్యం బాగా ఎక్కువ అయ్యిందనే విమర్శలు మొదటి నుంచి వస్తూనే ఉన్నాయి. మారుతీ రావు మరణం తర్వాత మీడియా ప్రతినిధులు అంతా ఆయన ఇంటికి వెళ్లగా, మీడియా వల్లే ఈ పరిస్థితి వచ్చిందని, మీరెవరూ రావద్దంటూ మారుతీ రావు భార్య ఆగ్రహం వ్యక్తం చేశారు. అవును నిజంగానే మారుతీ రావు ఆత్మహత్యకు మీడియానే కారణంగా కనిపిస్తోంది. అంతగా వారి కుటుంబాన్ని మీడియా బాధపెట్టింది, భయపెట్టింది.. వెంటాడి వేధించింది. తన అల్లుడు ప్రవీణ్ మారుతీరావు ఒక్కసారి చంపేస్తే, మీడియా వందల వేల సార్లు మారుతీ రావు చంపేసింది. ఎదుటి వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడకూడదనే నియమాలను కూడా మీడియా మరిచిపోయి టీఆర్ఫీ రేటింగులు పెంచుకోవడానికి, సెన్సేషనల్ టైపు ప్రొఫెషనలిజానికి  తెలుగు మీడియా దిగజారిపోయింది. 

 

IHG


కేవలం ఒక్క మీడియా చానల్ అని చెప్పుకోవడానికి లేదు. దాదాపు అందరూ ఇదే బాటలో వెళ్లారు, వెళ్తున్నారు. మారుతీ రావు వ్యవహారమే కాదు, చాలా సంఘటనల్లో మీడియా ఇదే రకంగా వ్యవహరిస్తోంది. ఏది చూపించాలి ? ఏది చూపించకూడదు అనేది పక్కన పెట్టేసి కేవలం ప్రతీది సెన్సషనల్ చేయడమే తమ పనిగా మీడియా ఇప్పుడు తయారయింది. రాష్ట్రంలో ఎన్నో నేరాలు, ఘోరాలు జరుగుతున్నా, కేవలం కొన్ని కొన్ని సంఘటనలకు మాత్రమే మీడియా ప్రాధాన్యత ఇస్తున్నాయి. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టుగా మారుతీ రావు పరువు గా భావించిన కుమార్తె ప్రేమించిన వ్యక్తితో కలిసి రూపొందించుకున్న వీడియోను పదే పదే చూపిస్తూ.. మారుతీ రావును వెంటాడి వేధించడమే లక్ష్యంగా మీడియా ముందుకు వెళ్ళింది. ఆయన ఆత్మహత్య చేసుకున్న తర్వాత కూడా మీడియా వారి కుటుంబాన్ని వదిలి పెట్టలేదు. 

 

IHG


ఇంకా ఏదో హైలెట్ చేయాలనే ఉద్దేశంతో మీడియా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ప్రజల వ్యక్తిగత, కుటుంబ విషయాల్లోకి వెళ్లడం, వ్యక్తుల్ని నిందించడం ద్వారా ఏం సాదించాలనుకుంటున్నాయో సదరు మీడియా ఛానెల్స్ కి కూడా అర్థం కావడం లేదు. మారుతీ రావు దుర్మార్గుడు.. దుష్టుడు .. కర్కోటకుడు అని మీడియా అతిగా ప్రచారం చేస్తున్నాయి. ఇప్పుడు మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడు అయ్యో పాపం అంటూ మీడియా సానుభూతి కథనాలు వండి వారుస్తున్నాయి. మారుతీరావు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు ? ఆయనది హత్యా ..? ఆత్మహత్యా ? ఎందుకు చనిపోయాడు అంటూ పదే కథనాలు ప్రచారం చేస్తున్నాయి. ఈ మీడియాకు మారుతీరావు ఎందుకు చనిపోయాడో తెలియనట్టుంది ? చంపింది.. చనిపోయేలా చేసింది ఈ మీడియానే అని. 

మరింత సమాచారం తెలుసుకోండి: