కంచె చేను మేసిన చందంగా నేరాల‌ను, చ‌ట్ట వ్య‌తిరేఖ కార్య‌క‌లాపాల‌ను అరిక‌ట్టాల‌ని పోలీసు అధికారే అవినీతికి తెగ‌బ‌డ్డాడు... నేర‌స్తుల‌తో చేతులు క‌లిపి త‌న వృత్తికే క‌లంకం తెచ్చిన ఉదంతం పోలీస్ శాఖ‌లో క‌ల‌క‌లం రేపుతోంది. అవినీతి, అక్ర‌మాల‌కు సాక్షాదారాల‌తో రుజువ‌వ‌డంతో స‌ద‌రు పోలీస్ అధికారిపై కేసులు న‌మోదు చేసేందుకు ఉన్న‌తాధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. అండర్‌వరల్డ్‌ డాన్‌ రవిపూజారితో సంబంధాలు కలిగినట్టు నిర్ధారణ కావడంతో బెంగ‌ళూరుకు చెందిన ఏసీపీ వెంకటేశ్‌ ప్రసన్నపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.  పోలీసు అధికారిగా ఉన్న వెంకటేశ్ అండ‌ర్ వ‌ర‌ల్డ్ డాన్ తో చేతులు క‌లిపి,  ఉన్న‌తాధికా రుల‌ సంభాషణల‌ను  రికార్డు చేసుకుని రవిపూజారికి పంపినట్టు తెలుస్తోంది.  గ‌తంలోనూ ఏసీపీ వెంకటేశ్‌ పై పలు ఆరోపణలు రావడంతో వాటిపైనా విచా ర‌ణ  జరుపుతున్నారు.  ఈక్ర‌మంలోనే రవిపూజారి సెనెగల్‌లో ఉన్నట్టు నిర్ధారణ అయ్యాక రెడ్‌కార్నర్‌ నోటీస్‌ ద్వారా బెంగళూరుకు తీసుకొచ్చేందుకు ఏర్పాటు చేసిన కమిటీ నుంచి ఏసీపీ వెంకటేశ్‌ను దూరంగా ఉంచ‌డం గ‌మనార్హం.

అప్పుడు వెంక‌టేశ్ ఉన్నతాధికారుల తీరుపై ఆగ్రహం వ్య‌క్తం చేశారు.  పోలీసుల బృందం సెనెగల్‌కు చేరుకోగా రవి పూజారి నేరుగా ఏసీపీ వెంకటేశ్‌ ప్రసన్న ఎక్కడంటూ ఆరా తీయ‌డంతో పోలీసు బృందం ఒక్కసారిగా నిశ్చేష్టులయ్యారు.  ఇటీవల జరిపిన విచారణలో వెంకటేశ్‌తో తనకు సంబంధాలు ఉన్నాయని రవి పూజారి అంగీకరించారు. అంతేగాక గతంలో క్రైం బ్రాంచ్‌ ముఖ్యులుగా అలోక్‌ కుమార్‌ ఉన్న సమయంలో అంబిడెంట్‌ కేసు వెలుగులోకి వచ్చింది. విచారణాధికారిగా వ్యవహరిస్తున్న వెంకటేశ్‌ ప్రసన్న, కేసుతో సంబంధం ఉన్న జనార్ధన్‌రెడ్డి నివాసంపై దాడి చేసి అందుకు సంబంధించిన వీడియోలను లీక్‌ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో నిందితుడైన విజయ్‌తాతా నుంచి రూ.50 ల‌క్ష‌లు  డిమాండ్‌ చేసిన‌ట్లు అప్ప‌ట్లో ఆరోపణ‌లు వ‌చ్చాయి.  ఇలా పలు కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు ఏసీసీ వెంకటేశ్‌పై కేసుల న‌మోదుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఏదేమైనా బాధ్య‌తాయు త‌మైన వృత్తిలో ఉన్న ఒక పోలీస్ అధికారి నేర‌స్తుడితో చేతులు క‌లిపినట్లు ఆధారాల‌తో స‌హా నిరూపిత‌మ‌వ‌డం ఆ శాఖకు మాయ‌ని మ‌చ్చ‌గా మిగిలిపోయింది.   

మరింత సమాచారం తెలుసుకోండి: