దెబ్బడిపోయిందిరో ఈ కరోనా గిరోనా ఏంటో తెలియదు గాని మూలిగే నక్క మీద తాటికాయ పడిపోయినట్టుగా అయిపోయిందో ఈ పేపరోళ్ల పరిస్థితి. అసలు న్యూస్ ఛానెల్స్ ఎక్కువయిపోయి ఏ ఛానెల్ చూడాలో తెలియక ... ఏ బ్రేకింగ్ న్యూస్ నమ్మాలో తెలియక తికమక పడిపోతున్నారు జనాలు. చీమ చిటుక్కుమంటే చాలు దాన్ని వంద కోణాల్లో విశ్లేషణలు చేస్తూ చూపిస్తూ... అసలు నిజమ్ ఏంటో ఎవరికీ అర్ధం కాకుండా చూపించిందే  చూపిస్తుండగా ఈ పేపర్లు ఎవడిక్కావాలోయ్ అన్నట్టుగా జనాలు ఉన్నారు. ఇప్పటికే కొనేవాడు లేక, ప్రింటింగ్ ఖర్చులు, జీతాలు ఇలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటూ పేపర్లు మూసేయ్యలేక , నడపలేక సతమతం అయిపోతున్నారు. ఇప్పుడు పేపర్లు ప్రింట్ చేసినా వాటిని ఇళ్లకు చేరేసేవారు లేరు. చదివే వాడు కూడా అమ్మో ఈ పేపర్ల ద్వారా కరోనా వస్తుందేమో..? మాకొద్దురా బాబు ఈ పేపర్ అనేస్తున్నారు. పోనీ ఏదోలా చదివ్వడమంటే పేపర్ ఇళ్ల ముందు విసిరికొట్టేవాడు కూడా మేము రాము మొర్రో అనేస్తున్నారు. 

 

IHG

 

ఇప్పుడు ఏం చెయ్యాలిరా బాబు అని నెత్తి నూరు బాదేసుకుంటున్నారు. పేపర్లు ప్రింట్ అయ్యాక .. ప్యాకింగ్, రవాణా, సర్దడాలు, సైకిళ్ళు, బైకుల మీద వాటిని ఇంటి ఇంటికి చేరవేయడం ఇలా అనేక దశలు ఉన్నాయి. వాటన్నిటిని లెక్కలేసుకుంటున్న జనాలు ఈ కరోనా ఈ పేపర్ ద్వారా వచ్చేస్తుందేమో అని వణికిపోతూ... మాకొద్దు బాబోయ్ అనేస్తున్నారు. ఇప్పుడు పేపర్ల యాజమాన్యాలకు పరిస్థితి ఏంటో అర్ధం కావడంలేదు. అసలు పేపర్ బాయ్స్ కి పేపర్ ఏజెంట్లు చెల్లించే సొమ్ములు ఏ మాత్రం సరిపోవడంలేదు. ఎందుకంటే ఇప్పుడు సైకిళ్ళ మీద నుంచి బైక్ కి అప్డేట్ అయ్యారు పేపర్ బాయ్స్. పెట్రోల్ ఖర్చులు కూడా రాని పరిస్థితి ఉంది. ఈ దశలో ఇప్పుడు కరోనా బూచి చావు దెబ్బ కొట్టింది.  

 

IHG

 

ఈ దశలో కరోనా బూచి వదిలే వరకు ప్రింటింగ్ ఆపేస్తే పోలే అనే వాదనలు కూడా లేకపోలేదు. అయితే ఇప్పుడు పేపర్లు చదివే వాళ్ళు అంతంతమాత్రంగా ఉన్న దశలో ఓ పదిరోజులు పేపర్లు ప్రింటింగ్ ఆపేస్తే మళ్ళీ చదివే వాడి ఇంట్రెస్ట్ పోయి ,మొదటికే మోసం వస్తుందన్న భయం కూడా లేకపోలేదు. అందుకే ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలుకలా గిలగిలలాడుతున్నాయి పేపర్ల యాజమాన్యాలు. ఉత్తరాదిలో పేపర్లు ప్రింటింగ్ ఆపేద్దామనే ప్రతిపాదనను పత్రిక యాజమాన్యాలు తీసుకొచ్చి దీనిపైన కసరత్తు చేస్తున్నాయి. ఇప్పుడు దక్షిణాదిలోనూ ఇదే పరిస్థితి. ఏమైనా ఈ ఎలక్ట్రానిక్, వెబ్ మీడియా విజృంభించిన తరువాత పేపర్లకు గడ్డుకాలం వచ్చింది. ఇప్పుడు కరోనా కాలం వచ్చి పడింది. అయ్యో పాపం అనుకోవడం తప్ప ఇప్పుడు కరోనా బూచి నుంచి పేపర్లను గట్టెక్కించే అవకాశమే కనిపించడంలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: