ఇప్పుడు మ‌నం క‌రోనా వైర‌స్ ఎఫెక్ట్ జోన్‌ల ఉన్నామా?  లేక‌.. దాదాపు క‌రోనా కోర‌ల్లో చిక్కుకున్నామా? ఇప్పు డు ఈ ప్ర‌శ్న అంద‌రినీ వేధిస్తోంది. దీనికి రెండు కార‌ణాలు క‌నిపిస్తున్నాయి., మొన్న శ‌నివారం వ‌ర‌కు కూడా కేంద్ర ప్ర‌బుత్వం క‌రోనాను లైట్ తీసుకుంది. మ‌న పౌరుల్లో రెసిస్టెన్స్ ప‌వ‌ర్ ఎక్కువ‌ని, ఇక్క‌డ ఎండ‌లు ఎ క్కువ‌ని, సో.. క‌రోనా క్యాక‌రేగా హ‌మే! అంటే వేచి చూసింది!! అయితే, గ‌త వారం రోజుల్లో దేశ‌వ్యాప్తంగా పెళ్లి ళ్లు జోరందుకున్నాయి. కొత్త సినిమాలు విడుద‌ల‌య్యాయి. అదేస‌మ‌యంలో దేశ‌వ్యాప్తంగా 75 వేల మంది విదేశాల నుంచి మ‌న దేశానికి వ‌చ్చారు. అంటే.. గ‌త వార‌మే దేశంలో భారీ ఎత్తున క‌రోనా వ్యాప్తి జ‌రిగిపో యింది.

 

ఇదే విష‌యాన్ని అమెరికా స‌హా అంత‌ర్జాతీయ ప‌త్రిక‌లు చెబుతున్నాయి. ఉన్న‌ట్టుండి భారత్ 21 రోజులు లాక్‌డౌన్ ప్ర‌క‌టించ‌డంపై బుధ‌వారం అనేక ప‌త్రిక‌లు విశ్లేష‌ణ‌లు వెలువ‌రించాయి. వీటిలో కేంద్ర ప్ర‌భుత్వ ఉదాసీన‌త‌ను ఎండ‌గ‌ట్ట‌డంతోపాటు.. దేశ‌వ్యాప్తంగా ప్ర‌మాద ఘంటిక‌లు మోగుతున్నాయ‌ని, కేంద్ర ప్ర‌భుత్వం కొన్ని అంశాల‌ను దాచి పెడుతోంద‌ని కూడా ఈ మీడియా వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం. ఉన్న‌ట్టుంటి తీసు కున్న నిర్ణ‌యాల వెనుక బ‌ల‌మైన కార‌ణాలు ఉన్నాయ‌ని కూడా ఈ ప‌త్రిక‌లు రాయ‌డం విశేషం. 

 

ప్ర‌స్తుతం భార‌త్‌లో క‌రోనా పాజిటివ్ కేసులు 600లోపేన‌ని ప్ర‌భుత్వం చెబుతున్నా..వాస్త‌వానికి ఇవి నాలుగింత‌లు ఉం టాయ‌ని అంత‌ర్జాతీయ మీడియా పేర్కొంది. నిజానికి చైనాలో వైర‌స్ వ్యాప్తి పెరిగిన విష‌యం భార‌త్‌కు తెలిసిన త‌ర్వాత కూడా విదేశాల నుంచి వ‌చ్చిన వారిని క‌ట్ట‌డి చేయ‌డంలోను, క్వారంటైన్ విధించ‌డంలోను మోడీ ప్ర‌భుత్వం శ్ర‌ద్ధ చూప‌కుండా రాష్ట్రాల‌కే ఆ బాధ్య‌త‌లు వ‌దిలేసింద‌ని మీడియా విమ‌ర్శ‌లు గుప్పించింది. ఫ‌లితంగా క‌ర్ణాట‌క‌, కేర‌ళ వంటి రాష్ట్రాల్లో వైర‌స్ విస్తృతి దారుణంగా పెరిగిపోయి.. ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డుతున్నార‌ని అంత‌ర్జాతీయ మీడియా పేర్కొంది. 

 

మొత్తంగా మోదీ స‌ర్కారు ఆదిలో చూపిన ఉదాసీన‌త భార‌త్‌ను ఇబ్బందిక‌ర ప‌రిస్థితిలోకి నెట్టే ప్ర‌య‌త్నం చేసింద‌ని అంత‌ర్జాతీయ మీడియా వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం. అయితే, తాజాగా తీసుకున్న లాక్‌డౌన్ నిర్ణ‌యం వ‌ల్ల ప‌రిస్థితిని అదుపులోకి తెచ్చే వెసులుబాటు ఏర్ప‌డింద‌ని కితాబివ్వ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: