చిన్నా పెద్దా తేడా లేదు.. ఆడ‌, మ‌గ బేధంలేదు.. జాతి, కులం, మతం,  ప్రాంతం వ్య‌త్సాసంలేదు.. అగ్ర రాజ్య‌మైనా, అట్ట‌డుగులో ఉన్న దేశ‌మైనా లెక్కే లేదు.  అంద‌రినీ ఒకేలా క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి పట్టి పీడిస్తోంది.  ప్ర‌పంచం మొత్తం క‌రోనా వైర‌స్ క‌రాళ నృత్యం చేస్తున్న‌ది. ఈ వైర‌స్ ధాటికి మాన‌వ స‌మాజానికి సంబంధించిన అనేక రంగాలు అత‌లాకుత‌లం అవుతున్నాయి. ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌న్నీ కుప్ప‌కూలుతున్నాయి. ఎక్క‌డో చైనాలోని వూహాన్ న‌గ‌రంలో పురుడు పోసుకున్న‌ ఈ వైర‌స్ నేడు 199 దేశాల‌కు విస్త‌రించి, మార‌ణ‌హోమం సృష్టిస్తున్న‌ది.  అయితే క‌రోనా వైర‌స్ పుట్టుక‌, వ్యాప్తిపై ప‌లు ఆస‌క్తిక‌ర అంశాలు తెర‌పైకి వ‌స్తున్నాయి.  ప్రపంచంలోనే తిరుగులేని ఆర్థిక శ‌క్తిగా ఎద‌గాల‌నే దుర్బుద్ధితోనే చైనా ఉద్దేశ్య‌పూర్వ‌కంగానే ఈ వైర‌స్‌ను సృష్టిం చి, వ్యాప్తి చేసింద‌నే అనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.

క‌రోనా బూచి చూపి చైనా 20 బిలియ‌న్ డాల‌ర్ల ఆధాయం సంపాదించుకుంద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.  వాస్త‌వంగా చైనా క‌మ్యూనిస్టు దేశం. క‌మ్యూనిస్టులు పెట్టుదారుల‌ను,  విదేశీ పెట్టుబ‌డుల‌ను అంగీక‌రించ‌రు. ర‌ష్యా ఆ పాల‌సీతో వెళ్ల‌డం వ‌ల్ల‌నే నేడు ముక్క‌లు ముక్క‌లైంది. చైనా మాత్రం ర‌ష్యాలాగ వి డిపోకుండా ఉండ‌టం కోసం, ఆధాయం సంపాదించ‌డం కోసం ఒక ఎత్తు వేసింది. అదే విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డుల‌ను ఆహ్వానించ‌డం. దీంతో అ మెరికాతో సహా.. ప్ర‌పంచంలోని అన్ని దేశాలు, బ‌డాబ‌డా కంపెనీలు చైనాలో పెట్టుబ‌డులు పెట్టాయి. వంద‌కు డెబ్భై శాతం విదేశీ పెట్టుబ‌డులు కాగా, కేవ‌లం ముప్ఫై శాతం మాత్ర‌మే చైనా పెట్టుబ‌డులు పెట్టింది. 

చైనాలో త‌యార‌య్యే ఉత్ప‌త్తుల‌కు యురోపియ‌న్ మార్కెట్ ప‌డిపోవ‌డంతోపాటు దేశీయంగా త‌యార‌య్యే విదేశీ కంపెనీల‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా మంచి మార్కెట్ ఉంది. దీంతో ఆయా విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డుల‌ను హ‌స్త‌గ‌తం చేసుకోవాల‌నే కుట్ర‌తోనే  చైనా క‌రోనా వైర‌స్‌ను ఉప‌యోగించి ఉంటుంద‌నే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఎందుకంటే క‌రోనాను కంట్రోల్  చేయ‌లేమ‌ని, ఈ వైర‌స్ తో బిలియ‌న్ ల కొద్ది ప్ర‌జ‌లు ప్రాణాలు కోల్పోతారేమోన‌ని చైనా అధ్య‌క్షుడు జింపిం గ్ ప్ర‌క‌టించ‌డం, అదే స‌మ‌యంలో వూహాన్ న‌గ‌రాన్ని లాక్‌డౌన్ చేయ‌డం లాంటి వి వ్యూహాత్మ‌కంగా  జ‌రిగిన‌వేన‌ని భావిస్తున్నా రు.  ఈ ప్ర‌క‌ట‌న‌తో పెద్ద ఎత్తున అక్క‌డున్న సంస్థ‌లు పెట్టుబ‌డులు మానుకొని, విదేశాల‌కు త‌ర‌లి వెళ్లిపోయాయి. అయితే అక్క‌డ ప్రాణాలు కోల్పోయిన లెక్క చూసుకుంటే విచిత్రంగా ఉంది.  81, 054 కేసులు ఉన్నాయ‌ని చెబుతున్న చైనా.. అందులో చ‌నిపోయినటువంటి వారి సంఖ్య కేవ‌లం మూ డున్న‌ర వేలు ఉంద‌ని చూప‌డంపై అనుమానాలు క‌లుగ‌క మాన‌వు.

దీంతో యూరోపియ‌న్ కంపెనీల‌న్నీ క‌రోనా ఎఫెక్ట్ తో వాళ్ల షేర్లంటినీ త‌క్కువ ధ‌ర‌కు అమ్ముకున్నాయి. వంద రూపాయ‌ల షేర్‌ను కేవ‌లం ప‌ది రూ పాయ‌ల‌కే విక్ర‌యించుకున్నారు. ఈ లెక్క‌న చైనాలో వేరే ప్రైవేట్ కంపెనీలు లేక‌పోవ‌డంతో ప్ర‌భుత్వమే అన్ని కంపెనీల షేర్లు కొనుగోలు చేసింది. దీంతో ప్ర‌భుత్వానికి 20 బిల‌య‌న్ డాల‌ర్ల సొమ్ము ఈ మ‌ధ్య‌లో సంపాదించింది. ఈలోపే క‌రోనా త‌గ్గిపోవ‌డంపై అనేక అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.  

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: