డొంక తిరుగుడు లేదు..స‌న్నాయి నొక్కులు అస‌లే లేవు..ముక్కుసూటిగా ఒక్క‌టే మాట చెప్పిండు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌. ఖ‌జానాలోని నిధుల‌ను కాపాడుకుంటూనే క‌రోనా గండం నుంచి గ‌ట్టేందుకు ఉద్యోగుల జీతాల్లో భారీ కోత‌లు విధిస్తున్న‌ట్లు సోమ‌వారం సాయంత్రం ప్ర‌క‌ట‌న చేశారు. ఈ వార్త ఉద్యోగుల్లో కొద్దిగా అస‌హ‌నాన్ని, అసంతృప్తిని క‌లిగించిన ఈ ప‌రిస్థితుల్లో త‌ప్ప‌నిస‌రియే. కేసీఆర్ స్థానంలో మ‌రో నేత ముఖ్య‌మంత్రిగా ఉంటే ఈ నిర్ణ‌యం చెప్ప‌టానికి పురిటి నొప్పులు ప‌డేవారేమో. నిర్ణ‌యాల వెనుక ఓ మంచి నేప‌థ్యం, అంత‌కుమించిన క్లారిటీ, అమ‌లులో క‌చ్చిత‌త్వం, కావాల్సిన అధికారం, బోలెడంత ప్ర‌జాబ‌లం, తెలంగాణ ప్ర‌జ‌ల నుంచి పూర్తి స‌హ‌కారం ఉన్న కేసీఆర్‌కు ఈ నిర్ణ‌యం ప్ర‌క‌టించ‌డానికి భ‌యం ద‌రిదాపుల్లో క‌న‌బ‌డ‌లేదు. 

 

కొన్ని నిర్ణ‌యాలు ప్ర‌క‌టించాలంటే అనేక రాజ‌కీయ అంశాల‌ను, ప‌రిణామాల‌ను లెక్క‌లేసుకుంటారు. కానీ తెగువ‌, మ‌నోధైర్యం గ‌ట్టిగా ఉన్న‌ కేసీఆర్‌కు వాట‌న్నింటితో ప‌నిలేదు. నిర్ణ‌యం అయిపోయింది..ఇక పాటించాల్సిందే. ఆర్టీసీ కార్మికుల విష‌యంలో ఇదీ స్ప‌ష్ట‌మైంది. దేశ‌మంతా కేసీఆర్‌ను కాస్త తిట్టినా...చివ‌రికి ఆయ‌న పంత‌మే నెగ్గింది. యూనియ‌న్ల పీచ‌మ‌నిచార‌నే చెప్పాలి. మ‌ళ్లీ కార్మికుల‌ను పిలిచి మ‌రీ విందు ఇచ్చి వారు అనుకున్నంత జీతాలు పెంచి పంపించారు. ఇలా చేయ‌డం దేశంలో మ‌రోనేత‌కు సాధ్యం కాదు. రాజ‌కీయ నేత‌ల్లో కేసీఆర్ వేరు. నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో కేసీఆర్ ప్ర‌ద‌ర్శించే దూకుడు మాములుగా ఉండ‌దు. వేగంగా మారుతున్న ప‌రిణామాల‌కు అనుగుణంగా సార్ ముందుకు క‌దులుతాడు..ఇప్పుడు జీతాల కోత విష‌యంలోనూ అదే జ‌రిగింది. 

 

రాష్ట్రం చాలా క్లిష్ట‌ప‌రిస్థితిలో ఉంది. రాష్ట్ర ఖ‌జ‌నాలో నిధులు నిండుకున్నాయి. అలా అని పూర్తిగా మ‌నం లేకుంటా లేం. ప్ర‌జ‌ల ప్రాణాల‌ను కాపాడుకునేందుకు వైద్యానికి ఎంత ఖ‌ర్చైనా పెడుతాం. అందులో వేరేం ఏ సందేహం లేదు. ఇప్పుడు అచ్చిప‌చ్చిగా పెట్టే ఖ‌ర్చును కూడా కొద్దిగా త‌గ్గించుకుంటున్నాం అంటూ ఆదివార‌మే  ఉన్న‌తాధికారుల‌కు హింట్ ఇచ్చేశారు. అయితే పూర్తి నిర్ణ‌యం మాత్రం వెల్ల‌డించ‌లేదు. ప్రెస్‌మీట్‌లోనూ అదే చేశారు. కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యానికి ప్ర‌జ‌ల్లో, ఉద్యోగుల్లో, విప‌క్షాల్లో ఎక్క‌డా వ్య‌తిరేక రాదు. వ‌స్తే వారే బ‌ద‌నామ్ అవుతారు అందులో ఎలాంటి సందేహం లేదు. రేపో మాపో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి కూడా ప్ర‌క‌ట‌న చేయాల్సిందే. త‌ప్ప‌దు..కేసీఆర్ మార్గంలో ముఖ్య‌మంత్రులంద‌రూ న‌డ‌వాల్సిందే. ఇప్పుడు భ‌య‌పడుతుండే వారికి పొరుగు రాష్ట్రాన్ని అనుస‌రించి మ‌నం కూడా అలా అనుస‌రిద్దాం అంటూ ఉద్యోగుల‌కు స‌ర్దిచెప్పేందుకు వారికి అవ‌కాశం క‌ల్పించాడ‌నే చెప్పాలి. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: