ఛీ పాడు జీవితం ! ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఎవడు ఎప్పుడు చస్తాడో తెలియదు. అసలు ఈ ప్రపంచం ఉంటుందో లేదో తెలియదు. ఎవడి ఇంట్లో ఆడు ఉండాలి. ఆఫీసు లేదు.. యాపారమూ లేదు... అసలు రోడ్డు మీద జనమే లేరు. ఒక వేళ ఎవడైనా దైర్యం చేసి రోడ్డు మీదకు వచ్చినా ఆడి ఈపి ఇమానం మోతెక్కిపోవాల్సిందే. వంటి మీద లాటి ఇరిగిపోవాల్సిందే. ఛి ఛీ... పాడు జీవితం. రోజుల తరబడి ఇంట్లోనే మగ్గిపోతున్నాం. చల్లగాలి స్వేచ్ఛగా పీల్చడానికి కూడా అవకాశం లేకుండా చేసిపారేశారు.
పాతివోడికి పేనాలంటే భయమే. మూతికి గుడ్డకట్టుకుని ఉదయం సరుకులు కొనుక్కోవడానికి రోడ్డు మీదకు తయారయిపోతున్నారు. ఇక అప్పటి నుంచి ఇదే తంతు. ఏప్రిల్ వరకు ఇలా ఇళ్లల్లోనే మగ్గిపోవాలి. మానమొక్కరమేనా ..? రాష్ట్రం, దేశం, అనే ఏ తేడా లేదు. అన్నిసోట్లా ఇదే తంతు.

 

IHG
మొన్నా మధ్య టీవీలో చుసిన బిగ్ బాస్ షో లో కూడా ఇలాగే ..అచ్చం ఇప్పుడు జనాలందరూ ఇళ్లల్లో ఉంటున్నట్టే ఆళ్లూ యాక్టింగ్ సేసేసారు. బిగ్ బాస్ హౌస్ లో కొంతమందిని పెట్టేసి ... ఓ నెలపాటు వాళ్ళకి కావలసినవి అన్నీ అక్కడ పెట్టేసి .. ఆళ్లు యేసే తింగరి యేశాలు అన్నీ టీవీల్లో చూపించేసారు. ఓరిని ఒకే ఇంట్లో ఉంది బయటకి రాకుండా ఎలా ఉంటున్నార్రా బాబు అని ఆశ్చర్యపోయాం... ఇప్పుడు అందరం అనుభవించెత్తన్నం. వాళ్ళకి అలా యాక్టింగ్ చేసినందుకు ఆళ్ళకి పబ్లిసిటీ + డబ్బులు బాగానే వచ్చాయి. మరి మనకో ...? ఎందుకులెండి ఎన్ని బాధలని చెప్పుకుంటాం...?  అసలు మనకి కాలు కుదురు ఉండదు. ఎప్పుడూ ఎక్కడికో ఒక చోటకి వెల్తూనే ఉంటాం. ఇప్పుడు ఒక్కసారిగా ఇంట్లోనే ఉండమంటే..? కాళ్ళు కట్టేసినట్టు ఉంది. 

IHG

 

నోట్లో సుక్క పడి ఎన్ని రోజులయ్యిందో..? నాలుక పీకెత్తాంది... షివరింగ్ వొచ్చేత్తాంది. అసలు ఈ కరోనా అని ... లాక్ డౌన్ అని పతివోడి ఇంటికి తాళం వేసి పోలీసులను కాపలా పెట్టేసిన ఆ మోదీ. కరోనా వైరస్ మనదేశం లోకి వచ్చేసి విలయతాండవం చేస్తుంది. మీరు బుద్ధిమంతుల్లా ఇళ్లల్లో ఉండండి... లేకపోతే ఆ అమెరికా వోడు ... ఇటలీ వోళ్ళలా అయిపోతుంది మీ జీవితం అని ఆయనకే ఆయనో స్టేట్మెంట్ ఇచ్చి ఊరుకున్నాడు. కానీ ఇక్కడ మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి అని జనాలంతా గగ్గోలు పెట్టేస్తున్నారు. అయితే  మోదీ గారు సరదా కోసం ఏమీ చెప్పట్లేదు కదా భారతదేశం అంతా బాగుండాలనే చెబుతున్నాడు. అది వేరే విషయం అనుకోండి. కానీ ఆ మోదీ వారానికోసారి బయటకి వస్తున్నాడు. తాను చెప్పాల్సింది చెబుతూ వెళ్లిపోతున్నాడు. అచ్చం బిగ్ బాస్ షో లో జడ్జి వచ్చి ఏదో ఒక టాస్క్ ఇచ్చి వెళ్ళిపోతున్నట్టుగా మోదీ వచ్చే చెప్పాల్సింది చెప్పేసి వెళ్లిపోతున్నాడు. నిన్న కూడా రేపొద్దున్న మోదీ ఏదో చెప్పబోతున్నాడు ... అంటూ టీవీల్లో ఊదరగొట్టారు. అయ్యబాబోయ్ మళ్ళీ లాక్ డౌన్ రోజులు పెంచేస్తున్నాం అంటూ చెబుతాడా ..? అసలు ఏమి చెబుతాడో తెలియక  ఒకటే టెన్షన్. 

 

IHG's Speech: No Lockdown, But Janta Curfew | Latest Andhra ...

అనుకున్నట్టుగానే సరిగ్గా ఈ రోజు పొద్దున్న టీవీల్లో మోదీ వచ్చాడు. ఓరి బాబు మీరంతా బాగా నేను చెప్పిన మాట విన్నారు... మీరు అలాగే ఈ నెల 14 వరకు ఎవడి ఇంట్లో వాడు ఉందండ్రా నాయనా అని చెప్పాడు. అంతేనా మనమంతా ఒక్కటే ... దానికి గుర్తుగా మీరంతా ఆదివారం నాడు రాత్రి లైట్ లు అన్నీ ఆపేసి దీపాలెట్టాలి అంటూ ఓ సందేశం ఇచ్చేశాడు. ఓర్నీ ఇది చెప్పడానికేనా నిన్నటి నుంచి టెన్షన్ పెట్టింది ..? భలే వాడివి బాసు అనుకోవాల్సి వచ్చింది. ఏంటో అసలు ఈ పెపెంచకం ఎటువెళ్తుందో తెలిసి చావడం లేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: