కంటికి కనిపించని ఓ శత్రువుతో ప్రపంచం యుద్దం చేస్తోంది. కరోనా అనే వైరస్ కారణంగా ప్రపంచం అంతా భయంతో వణికిపోతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇప్పుడు ప్రపంచ జనాభా అంతా కోరుకునేది కరోనా మహమ్మారి నుంచి ఈ ప్రపంచాన్ని బయటపడేయమని. కరోనా వైరస్ అనేది ప్రపంచ మానవాళికి కొత్త కావచ్చు. కానీ ప్రతి వందేళ్లకు ఏదో ఒక అంటువ్యాధి రావడం... దాని కారణంగా వేలు, లక్షల మంది జనాలు మరణించడం ఇవన్నీ సర్వ సాధారణంగా జరిగిపోతున్నాయి. యాదృచ్ఛికమో, మరేంటో తెలియదు కానీ, 1720, 1820, 1920, 2020. సరిగ్గా వందేళ్లకు ఒకసారి ఇదే సంవత్సరం ఏదో ఒక మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తూ, జనాలను మట్టు పెడుతోంది. 1720 సంవత్సరంలో లక్షల మంది ప్రాణాలను ఈ వ్యాధి పొట్టన పెట్టుకుంది. సరిగ్గా 100 సంవత్సరాల తరువాత 1820 సంవత్సరంలో కలరా తీవ్రస్థాయిలో విజృంభించడంతో వేలు, లక్షలు మంది ప్రపంచ వ్యాప్తంగా మరణించారు. అలాగే మరో వందేళ్ల తరువాత అంటే 1920 సంవత్సరంలో స్పానిష్ ఫ్లూ అదే స్థాయిలో జనాలను పొట్టన పెట్టుకుంది. మళ్ళీ ఇప్పుడు 2020లో చైనా లో పుట్టిన కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ మానవాళిని భయపెడుతూ... ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు తీసుకోగా లక్షలాది మంది దీని బారిన పడి పోరాటం చేస్తున్నారు.

 

IHG

 

ప్లేగు వ్యాధి (1720)

 

సరిగ్గా నాలుగు వందల సంవత్సరాల క్రితం ప్లేగు వ్యాధి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. 1720 లో ఫ్రాన్స్ లోని మర్సెయల్స్ లో బయటపడిన ఈ వ్యాధి ఆ ఒక్క నగరంలోనే సుమారు 50వేల మంది ప్రాణాలు తీసుకుంది. దీని కారణంగా లక్షలాది మంది అనారోగ్యం పాలయ్యారు. ఆ తర్వాత ఈ వ్యాధి ప్రపంచమంతా విస్తరించింది. ఈ వ్యాధి ద్వారా వ్యాప్తి చెంది మానవులకు ఈగల ద్వారా వ్యాప్తి చెందింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది మరణానికి కారణమైన ఈ వైరస్ కారణంగా ఫ్రాన్స్ తీవ్రంగా నష్టపోయింది. లక్షలాది మంది ఈ ప్లేగు వ్యాధి తో మరణించారు.


కలరా వ్యాధి (1820 )

ప్లేగు వ్యాధి బీభత్సం సృష్టించిన సరిగ్గా వందేళ్ల తరువాత అంటే 1820 లో కలరా వ్యాధి అదే స్థాయిలో జనాల ప్రాణాలను తీసుకుంది. ఫిలిప్పైన్స్, థాయిలాండ్ ,ఇండోనేషియా దేశాల్లో ఈ కలరా వ్యాధి లక్షలాది మంది ప్రాణాలు పోవడానికి కారణం అయ్యింది.ఈ వ్యాధి వచ్చి ఇన్నేళ్లయినా, ఇప్పటికీ ఆఫ్రికా ఖండంలో ఏదో ఒక సందర్భంలో ఈ వ్యాధి బయటపడుతోంది. దీనికి అతిసార వ్యాధి అని కూడా పేరు ఉంది. ఈ వ్యాధి విబ్రియో కలరే అనే బాక్టీరియా కారణంగా వ్యాప్తి చెందుతుంది. ఇది అత్యంత వేగంగా ప్రాణాలు తీసే వ్యాధి. ఈ వ్యాధి సోకిన వెంటనే సరైన వైద్యం అందరూ పోతే వెంటనే ప్రాణాలు పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది.


స్పానిష్ ఫ్లూ (1920)

ప్లేగు, కలరా కంటే స్పానిష్ ఫ్లూ ప్రపంచవ్యాప్తంగా భారీ ప్రాణ నష్టాన్ని కలిగించింది. స్పానిష్ ఫ్లూ కారణంగా సుమారు 100 కోట్ల మంది ఈ వ్యాధి బారిన పడి, సుమారు కోటి మంది వరకు మరణించారు. అసలు ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా అతి భయంకరమైన వ్యాధిగా ఈ స్పానిష్ ఫ్లూ రికార్డులోకేక్కింది. ఫ్రాన్స్ లోని ఎటపుల్స్ లోని ప్రధాన యూకే ట్రూప్ స్టేజింగ్, హాస్పిటల్ క్యాంప్ ను స్పానిష్ ఫ్లూ కేంద్రంగా పరిశోధకులు పేర్కొన్నారు.

 

కరోనా వైరస్ (2020)

 

చైనా నా దేశం లోని వుహన్ నగరంలో పుట్టిన కరోనా అనే వైరస్ మహమ్మారి ఇప్పుడు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. చైనా నుంచి క్రమక్రమంగా ప్రపంచ దేశాలకు ఈ వైరస్ వ్యాప్తి చెంది మానవాళిని భయపెడుతోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే వేలాది మరణాలు చోటుచేసుకోగా, లక్షలాది మంది ఈ వైరస్ ప్రభావానికి గురయ్యారు. ఈ వైరస్ లక్షణాలు ఉన్న మనిషి ద్వారా ఇతరులకు కూడా వ్యాపించే అవకాశం ఉండడంతో ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్ ను పాటిస్తూ ఈ వైరస్ మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రపంచ దేశాలన్నీ ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ వైరస్ ను అంతం చేసే మందులేవీ అందుబాటులోకి రాకపోవడంతో ఈ వైరస్ ప్రభావానికి ఎంత ప్రాణ నష్టం జరుగుతుందో తెలియక ప్రపంచ దేశాలు అన్ని వణికిపోతున్నాయి. ఈ విధంగా ప్రతి వందేళ్లకు ఒకసారి ఏదో ఒక విపత్తు మానవాళిని భయాందోళనకు గురి చేస్తోంది.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: