మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు గా తయారయింది మీడియా పరిస్థితి. ఇప్పటికే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ప్రింట్, ఎలక్ట్రానిక్ ఛానళ్లు, పేపర్లు మనుగడ సాగిస్తున్నాయి. అసలు మీడియాలో సంక్షోభాలు అనేవి కొత్తమీ కాదు. ఎప్పుడు ఒడిదుడుకులు ఎదుర్కొంటూనే ఉంటుంది మీడియా రంగం. జోస్యం చెప్పే చిలకే వల్లో పడ్డట్టుగా ఉద్యోగ భద్రత గురించి, జీతాల పెరుగుదల, తదితర అంశాల గురించి పెద్ద ఎత్తున కథనాలు ప్రచారం చేసే మీడియా సిబ్బంది అరకొర వేతనాలతో, ఉద్యోగ భద్రత లేక, తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతున్న సంఘటనలు మొదటి నుంచి చూస్తున్నవే. 

IHG


మీడియా రంగం అనేది పైకి కనిపిస్తున్నంత బ్రహ్మాండంగా అయితే ఏమీ ఉండదు అన్న సంగతి మీడియాలో పనిచేస్తున్న సిబ్బంది మొత్తానికి తెలుసు. ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ భారంగా పత్రికలను, చానళ్లను నడిపిస్తూ వస్తున్న మీడియా అధిపతులకు ఇప్పుడు కరోనా వైరస్  కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఏర్పడడం, రెవెన్యూ తగ్గిపోవడంతో ఆ ప్రభావం తీవ్ర స్థాయిలో మీడియా రంగం పై పడింది. ఇప్పటి వరకు ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా ఏదోలా నెట్టుకొస్తున్న మీడియా సంస్థలు, ఈ సారి మాత్రం కరోనా దెబ్బకు మొత్తం చేతులెత్తేశారు. 

 


ఇప్పుడు మీడియా సంస్థల్లో ఎంతమంది ఉద్యోగాలు ఉంటాయో.. ఉడతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే కొంత మందికి ఉద్యోగాలు ఊడిపోయేటట్టుగా ఉండగా, మరి కొందరి జీతాల్లో కోత విధిస్తున్నామంటూ పిడుగు లాంటి వార్తలు వారికి అందాయి. అసలు మీడియా కు ఈ స్థాయిలో గడ్డు పరిస్థితి రావడానికి కారణం ఏంటని పరిశీలిస్తే... ప్రతి మీడియా సంస్థ ఖచ్చితంగా వాణిజ్య ప్రకటనల మీదే ఆధారపడి ఉంటుంది. ప్రింట్ మీడియా అయినా, ఎలక్ట్రానిక్ మీడియా అయినా, వెబ్ మీడియా అయినా అన్నిటికీ అదే ప్రధాన ఆదాయ వనరు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని వాణిజ్య సంస్థలు మూతపడడంతో మీడియాకు యాడ్స్ నిలిచిపోయాయి. దీంతో తప్పని సరి ఈ పరిస్థితుల్లో మీడియా సంస్థలు తమ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులను తప్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

 

IHG


ఇక  ప్రింట్ మీడియా గురించి చెప్పుకుంటే.. ఎలక్ట్రానిక్, వెబ్ మీడియా విజృంభించిన తరువాత ప్రింట్ మీడియా పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. ప్రింటింగ్ కాస్ట్ పెరిగిపోవడం, పేపర్ పంపిణీ, జీతాలు ఇలా ఎన్నో ఇబ్బందులు పడుతున్న ఈ ప్రింట్ మీడియా ఇప్పటికే జిల్లా ఎడిషన్ లు తగ్గించాయి. అలా కూడా వర్కవుట్ కాకపోవడంతో సబ్ ఎడిటర్ లను చాలా మందిని తప్పించేసింది. ఇప్పుడు ఈ కరోనా కాటు కారణంగా 50 శాతం ఉద్యోగాల్లో కోత పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. సాక్షి లో 30 శాతం, ఆంధ్రజ్యోతిలో 50 శాతం ఉద్యోగులను తప్పించేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.

IHG


 కేవలం డెస్క్ లో మాత్రమే కాకుండా, మార్కెటింగ్, అడ్వటైజ్మెంట్ విభాగాల్లోనూ కోత విధించాలని చూస్తున్నాయి. ఇక సర్కులేషన్  పరంగా మొదటి స్థానంలో ఉన్న ఈనాడు ఎప్పటి నుంచో పొదుపు చర్యలు పాటిస్తూనే ఉంది. ఇప్పటికే భారీగా కోత ఉద్యోగాల్లో విధించింది. మండల స్థాయి కంటిబ్యూటర్లు సైతం ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వార్తలు తప్ప, మిగతా ఏ విషయాల గురించి వార్తలు పంపించాల్సిన అవసరం లేదంటూ ఆదేశాలు ఇచ్చింది. ఇక మిగతా మీడియా చానల్స్ లోనూ ఇదే రకమైన పరిస్థితి నెలకొంది. ప్రతి ఎలక్ట్రానిక్ మీడియా భారీగా ఉద్యోగులను తగ్గించుకునే పనిలో పడింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం ప్రభావం ఆరు నెలలకు పైగా ఉండే అవకాశం ఉండడంతో ఇప్పుడు అప్పుడే మీడియా కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: