క‌రోనా క‌ట్ట‌డిలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ఎన్నిచ‌ర్య‌లు తీసుకోవాలో అన్ని తీసుకుంటున్నారు. క‌రోనా మ‌హ‌మ్మారి ఓవైపు త‌న ప్ర‌తాపాన్ని చూపుతూ జిల్లాల‌ను క‌మ్మేస్తున్న నేప‌థ్యంలో కూడా ఏపీ ప్ర‌భుత్వం తీసుకుంటున్న జాగ్ర‌త్త చ‌ర్య‌లు, వైద్య ఆరోగ్య శాఖ ముంద‌స్తు ప‌నులు ఫ‌లితాల‌నిస్తున్నాయి. క‌రోనా హాట్ స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాల్లో  ఆరోగ్య సిబ్బంది ఇంటింటి స‌ర్వే చేప‌డుతున్నారు. ప్ర‌జ‌లకు ఆరోగ్య ప‌రీక్ష‌లు చేప‌డుతూ అనుమానితుల‌ను వెంట‌నే క్వారంటైన్‌కు త‌ర‌లిస్తున్నారు.వారిక మెరుగైన వైద్యం అందేలా చూస్తున్నారు. 

 

మ‌రోవైపు పేద ప్ర‌జ‌ల‌కు ఉచితంగా రేష‌న్ అందించ‌డంతో పాటు ముంద‌స్తు పింఛ‌న్ల మంజూరు, కొంత‌మంది పేద వ‌ర్గాలకు న‌గ‌దు సాయం వంటివి చేప‌డుతోంది. అయితే ఇంత చేస్తున్నా ఎందుక‌నో ప్ర‌చారం చేసుకోవ‌డంలో వైసీపీ ప్ర‌భుత్వం వెనుకడిపో తోంద‌న్న అభిప్రాయం రాజ‌కీయ వ‌ర్గాల్లో వ్య‌క్త‌మ‌వుతోంది. మిగ‌తా రాష్ట్రాల క‌న్నా ఏపీ ప్ర‌భుత్వం ఓ రెడండుగులు ముందే ఉంటోంది . ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీసుకుంటున్న డేర్ అండ్ డాషింగ్ నిర్ణ‌యాల‌తో అధికారులు కూడా లాక్‌డౌన్‌ను స‌మ‌ర్థ‌వంతంగా అమ‌లు చేయ‌గ‌లుగు తున్నారు. అదే స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు అత్య‌వ‌స‌ర‌, నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌కు కొర‌త లేకుండా చూడ‌టంలో స‌ఫ‌లం కావ‌డం గ‌మ‌నార్హం. 

 

ఐదు రోజుల క్రితం వ‌ర‌కు రాష్ట్రంలో నాలుగుకు మించ‌కుండా ఉన్నా పాజిటివ్ కేసుల సంఖ్య త‌బ్లీగి జ‌మాత్ మూల‌ల‌తో రాష్ట్రంలో  ఒక్క‌సారిగా పెరిగిపోయాయి. అయినా వెర‌వ‌కుండా ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకుంటునే ఉన్నారు. ప్ర‌జ‌ల్లో మ‌నోధైర్యం క‌ల్పించే ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి.  రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకుంటున్న చర్య‌ల‌తో క‌రోనా అదుపులోకి వ‌స్తుంద‌న్న న‌మ్మ‌కం బ‌ల‌ప‌డింది. అందుకే ప్ర‌భుత్వం ఏం చెప్పినా వెంట‌నే ప్ర‌జ‌లు పాటిస్తున్నార‌ని రాజ‌కీయ పండితులు విశ్లేషిస్తున్నారు. అయితే ప్ర‌భుత్వంఈ విష‌యంలో విజ‌యం సాధిస్తున్నా..ప్ర‌భుత్వ విజ‌యంగా దాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌డంలో వెన‌క‌బాటు స్ప‌ష్టంగా క‌న‌బ‌డుతోంద‌ని రాజ‌కీయ పండితులు పేర్కొంటున్నారు. క‌రోనాపై జగన్ వ్యూహాత్మ‌కంగా ప‌నిచేస్తున్నారు.  ప్ర‌చారం లేక‌పోవ‌డం క‌రోనాపై సాధిస్తున్న ఘ‌న‌త‌ను సొంతం చేసుకోవ‌డంలో విఫ‌ల‌మ‌వుతున్నార‌నే అభిప్రాయం రాజ‌కీయ వ‌ర్గాల్లో వ్య‌క్త‌మ‌వుతోంది. 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: