కొంతమందిలో మార్పు వస్తుంది అని ఆశించడం అంటే ఇసుక నుంచి తైలం తీసినట్టే. ప్రపంచం అతలాకుతలం అవుతున్నా తమ పంథా తమదే అన్నట్టుగా వ్యవహరిస్తూ, ఉన్న పరువుని కూడా స్వయంగా వారికి వారే తీసేసుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా రాజకీయాలు చేయవచ్చు కానీ విపత్తుల సమయంలో పార్టీలకు అతీతంగా వ్యవహరించి ప్రజల బాగోగుల గురించి పట్టించుకోవాలి. ఎవరు ఎన్ని రాజకీయాలు చేసినా అంతిమంగా ప్రజలకు మంచి జరగడమే కావలి అన్నట్టుగా రాజకీయ నాయకులు వ్యవహరించాలి. కానీ అవేమి తమకు పట్టవు... కేవలం భూగోళం తలకిందులవుతున్నా తమ రాజకీయం తమదే అన్నట్టుగా కొంతమంది వ్యవహరిస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తుల్లో మొదటి స్థానంలో ఉంటారు మన చంద్రబాబు గారు. 

 

IHG

కరోనా విలయతాండవం చేస్తున్న తరుణంలో ఈరోజు అకస్మాత్తుగా వైసీపీ అధినేత జగన్ పై కరోనా బాణాలు వేసేందుకు నిర్వహించినా  మీడియా సమావేశంలో చంద్రబాబు కరోనా వైరస్ విషయంలో ఏకంగా ప్రపంచాని కే సందేశాన్ని ఇచ్చాడు. అమెరికా అధ్యక్షుడి నుంచి భారతదేశ ప్రధాని వరకు ఎవరినీ వదిలి పెట్టకుండా అందరి పేర్లను ప్రస్తావించాడు. అసలు ఈ కరోనా అనేది ఎందుకు పుట్టిందో..? ఏ జాగ్రత్తలు తీసుకుంటే పోతుందో..? అన్న విషయాల దగ్గర నుంచి మొదలు పెట్టిన చంద్రబాబు ప్రతి ఒక్కరికి ఇమ్యూనిటీ పవర్ పెరగాలని చెబుతూనే... తిప్పితిప్పి వైసీపీ అధినేత జగన్ పై ఈ కరోనా బాణాలను చంద్రబాబు ఎక్కుపెట్టి వంకర టింకరగా వదిలారు. ఈ కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమర్థవంతంగా పని చేస్తున్నారని, ఒక్క ఏపీ ముఖ్యమంత్రి జగన్ మాత్రమే సరిగా పనిచేయడం లేదన్నట్టుగా చంద్రబాబు కొన్ని డైలాగులను వదిలాడు.

 

IHG

 అసలు దేశవ్యాప్తంగా ఈ ప్రభావం వైరస్ ప్రభావం ఎక్కువయ్యి కేసులు రోజు రోజుకి పెరుగుతున్నా, వాటి సంగతి ప్రస్తావించకుండా, కేవలం ఏపీలో మాత్రమే కరోనా తో ప్రజలు బాధపడుతున్నారని, అసలు దీనికి కారణం జగన్ అన్నట్టుగా  చంద్రబాబు మాట్లాడారు. ఒకవైపు ఏపీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న దశలో ప్రభుత్వానికి, ప్రజలకు తగు సూచనలు చేయాల్సింది పోయి యధావిధిగా విమర్శల బాణాలను చంద్రబాబు ఎక్కుపెట్టారు. దేశవ్యాప్తంగా ఆకస్మాత్తుగా లాక్ డౌన్ విధించడంతో వలస కూలీలు, అన్ని రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాలకు చెందిన వారు చిక్కుకుపోయారు. వారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ ముందు చంద్రబాబు కొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. 

 

IHG

లాక్ డౌన్ కారణంగా ప్రజలంతా ఇంటి వద్దే ఉంటున్నాడని, ఆర్థికంగా ప్రజలందరినీ ఏపీ ప్రభుత్వమే ఆదుకోవాలని బాబు కాస్త గట్టిగానే డిమాండ్ చేశారు. వాస్తవంగా అన్ని రాష్ట్రాల కంటే ముందుగా ఏపీలో లాక్ డౌన్ కారణంగా ఇబ్బందిపడుతున్న ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఏపీ సీఎం జగన్ రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసరాలు పంపిణీ చేశారు. అలాగే కేంద్రం 500 రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించక ముందే ఏపీలో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 1000  రూపాయలు అందిస్తాం అని ప్రకటించడమే కాకుండా, దాని నేరుగా ప్రజలకు అందించారు. అయితే దీనిపై చంద్రబాబు యధావిధిగా విమర్శలు మొదలు పెట్టాడు. అసలు వెయ్యి రూపాయలు సొమ్మును వైసీపీ నాయకులు ప్రజలకు అందించడం ఏంటి అంటూ మొదలుపెట్టాడు.

 

IHG

 అక్కడితో ఆగకుండా ఢిల్లీలో ప్రతి కుటుంబానికి క్రేజీవాల్ ప్రభుత్వం 5,000 చొప్పున అందిస్తున్నారని, ఏపీలో కూడా అదేవిధంగా అందించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అయితే ఏపీ ఆర్థిక పరిస్థితి ఏమిటి అనేది చంద్రబాబుకు తెలియంది కాదు. అసలు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి తమ పార్టీ నాయకులకు దోచిపెట్టారని విమర్శలు చంద్రబాబు తీసుకు రావడం ద్వారా ఏపీకి ఈ పరిస్థితి ఏర్పడిందన్న విషయాన్ని కూడా చంద్రబాబు మరిచిపోయి, ఏపీలో ప్రతి కుటుంబానికి మొదటి విడతగా 5000 అందించాలని డిమాండ్ చేశాడు. అయితే అలా ఇవ్వడం ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాని పని అని ఇప్పుడు ఇస్తున్న వెయ్యి కూడా భారమైనా ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బందులు పడకూడదు అనే ఉద్దేశంతో జగన్ ఈ సొమ్ముని ఇస్తున్నారు. ఇవన్నీ బాబుకు తెలియనివి కాదు. అయితే ఏదో రకంగా వైసీపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడమే పనిగా చంద్రబాబు వ్యవహరిస్తున్నాడు. 

 

IHG

అక్కడితో ఆగకుండా ఉద్యోగస్తుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగే విధంగా చంద్రబాబు మాట్లాడారు. అసలు కరోనా వస్తే ఉద్యోగుల జీతాల్లో కోతల అవసరం ఎందుకు వచ్చింది ..? ఇదంతా ప్రభుత్వం చేతగాని తనం అన్నట్టుగా చంద్రబాబు మాట్లాడారు. అయితే ఉద్యోగుల జీతాల్లో కోత కేవలం ఏపీ ప్రభుత్వం మాత్రమే విధించలేదు. పక్కన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కోతలు విధించింది. ఇవన్నీ మర్చిపోయి కేవలం రాజకీయ కక్షలు తీర్చుకునే విధంగా చంద్రబాబు మాట్లాడడం, అది కూడా కరోనా వైరస్ ప్రభావం ఈ స్థాయిలో ఉన్న సమయంలో ఈ విధంగా రాజకీయాలు చేయడం చంద్రబాబు పరపతిని, రాజకీయ అనుభవాన్ని మరింత పలుచన చేస్తున్నాయి.  

    

మరింత సమాచారం తెలుసుకోండి: