క‌రోనా ఎఫెక్ట్‌తో అన్ని రంగాల మాదిరిగానే ప్రింట్ మీడియాకు గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి, న‌మ‌స్తే తెలంగాణ‌, ఆంధ్ర‌భూమి, ఆంధ్ర‌ప్ర‌భ, వార్త, వెలుగు, ప్ర‌జాప‌క్షం, మ‌న తెలంగాణ‌, న‌వ‌తెలంగాణ ఇలా ప్ర‌తీ ప‌త్రిక యాజ‌మాన్యం క‌రోనా సునామీలో కొట్టుకుపోతున్నాయి. పేప‌ర్ మార్కెట్లోకి తీసుకురావ‌డానికి పురిటినొప్పులు ప‌డుతున్నాయనే చెప్పాలి. ఇక పైన చెప్పిన వాటిల్లో అయితే ఆంధ్ర‌జ్యోతి, ఈనాడు, న‌మ‌స్తే తెలంగాణ, సాక్షి మిన‌హా ప‌త్రిక‌ల‌న్నీ కూడా దాదాపు వాట్సాప్‌ల‌లో పేప‌ర్ల‌ను తిప్పేస్తున్నాయి. అయితే ఆ నాలుగు ప‌త్రిక‌లు కూడా అదే ప‌నిచేస్తున్నాయి.

 

 పేప‌ర్ ష‌ట్‌డౌన్ కాలేదు అని చెప్పుకోవ‌డానికి 1000 కాపీల‌కు మించ‌కుండా ప్రింట్ చేసి కొన్ని కార్యాల‌యాల్లో వేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. వాస్త‌వానికి ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో పేప‌ర్‌ను తాకాలంటేనే జ‌నం వామ్మో అంటున్నారు. అయితే డిజిట‌ల్ మీడియా ఇప్ప‌టికే ఊపందుకున్న వేళ‌..ప్రింట్ మీడియాకు ఆద‌ర‌ణ త‌గ్గుతున్న వేళ‌..క‌ష్ట న‌ష్టాల‌తో ఏదో రాజ‌కీయ పార్టీల అండ‌తో ఈడ్చుకు వ‌స్తున్న వేళ‌..మూలిగే న‌క్క‌పై తాటిపండు ప‌డ్డ చందంగా  క‌రోనా ప్రింట్ మీడియాపై విప‌రీతంగా ప్ర‌భావం చూపుతోంది. లాక్‌డౌన్ అమ‌ల్లోకి వ‌చ్చాకా రెండు రోజుల‌కే ప్ర‌ధాన ప‌త్రికల యాజ‌మాన్యాల‌కు ఫ్యూచ‌ర్ సీన్ క‌ళ్ల ముందు క‌ద‌లాడింది.

 

మూడు నెల‌ల పాటు న‌ష్టాలు త‌ట్టుకోవాలంటూ అన‌ధికార వ‌ర్గాల స‌మాచారంతో ఇక అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి. దీంతో న‌ష్టాల‌ను మూట‌గ‌ట్టుకునే ఉద్దేశం లేక కాస్ట్ క‌టింగ్‌కు చ‌ర్య‌లు మొద‌లుపెట్టింది. ఈ విష‌యంలో ఆంధ్ర‌జ్యోతి ముంద‌డుగు వేయ‌డం గ‌మ‌నార్హం. దీనికంటే ముందే ఆంధ్ర‌భూమి మొద‌ట్లోనే చేతులేత్తేసింది చాలా క్లారిటీగా. ఆంధ్ర‌జ్యోతిలో స‌బ్ ఎడిట‌ర్ల‌ను మ‌ళ్లీ పిలుస్తాం ఇక మీరు డ్యూటీకి రాకండి అంటూ మ‌ర్యాద‌గా సాగ‌నంపుతున్నారట‌. అదే స‌మ‌యంలో వెలుగు, న‌మ‌స్తే తెలంగాణ‌, సాక్షి ప‌త్రిక‌లు కూడా న‌డుస్తున్నాయి. ఈనాడు వ‌ర్క‌ఫ్రం హోం అంటున్న ఉద్యోగానికి ఎస‌రు పెట్టే ముచ్చ‌ట్లే ఎక్కువ‌గా ఉన్న‌ట్లు
ఆ సంస్థ ఉద్యోగులు ఒప్పేసుకుంటున్నారు. 

 

ఆంధ్ర‌జ్యోతిలో అయితే మార్చి నెల జీతం ప‌డుతుందా..? అన్న సందేహాలు నెల‌కొన్నాయి. వాస్త‌వానికి మెయిన్ స్ట్రీం ప‌త్రిక‌ల‌న్నీ కూడా భ‌య‌ప‌డాల్సినంత ప‌రిస్థితి లేకున్నా..కావాల‌నే ఇదోక సంధి మార్గంగా ఉప‌యోగించుకుంటున్నాయ‌నే వాద‌న మొద‌లైంది. రాజ‌కీయ పార్టీల అండ‌తో ఆర్థికంగా ఎంతో కొంత నిల‌దొక్కుకునే అవ‌కాశం ఉన్నా చేతులెత్తేయ‌డానికే ఇష్ట‌ప‌డుతుండ‌టం గ‌మ‌నార్హం. ఇన్నాళ్లు సంస్థ‌కోసం అహ‌ర్నిశ‌లు క‌ష్ట‌ప‌డ్డ జ‌ర్న‌లిస్టులు మాత్రం రోడ్డున ప‌డే ప‌రిస్థితి ఎదుర‌వుతోంది. సంస్థ‌లు కోటానుకోట్ల రూపాయాలు, ఆస్తులు  కూడ‌బెట్టుకుని చివ‌రికి అవ‌స‌రం తీరాక ఇలా రోడ్డున ప‌డేశాయ‌ని ప‌లువురు జ‌ర్న‌లిస్టులు ఆవేద‌న చెందుతున్నార‌ని స‌మాచారం.


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: