అబ్బబ్బ... ఎంతయినా మా బాబోరు బాబొరేరో ! మా బాబొరికి ఎదురెళ్తే బావురమనిపించాడంతే ! అసలు ఇందాకటి టీబీ (టీవీ)లో మా బాబు గోరు అసలు కరోనా వైరెస్సుని ఎలా తుస్సు తుస్సు మనిపించాలో చెప్పేసాడు. అసలు మా బాబొరికి పెండయిన అమెరికా పెసిడెంటు టంపు కాడినించి మోదీ, కేజివాల్ ఇలా అందరి గురించి సెప్పేసి, ఇరగదీసేసాడంతే. అసలు పెపంచకంలో మా బాబోరు అంత గొప్పోళ్ళు ఎవరైనా ఉన్నారా ...? అబ్బే లేరండి. ఎందుకంటే ఈ కరోనా వచ్చేసి ఇన్ని నెలలవుతుందా ఒక్కడు కూడా మందు కనిపెట్టలేకపోయాడంటే ...? సిగ్గేసేత్తాంది. అసలు పెపంచ మేధావైనా మా బాబొరి గురించి ఒక్కరైనా పట్టించుకున్నారా ..? అసలు ఆయన్ను పిలిచి మందు కనిపెట్టమంటే ఈ పాటికి ఎప్పుడో కనిపెట్టేసి ఉండేవాడు కదా ..? ఒక్కడక్కూడా బుర్రా బుద్ది లేదు.

 

IHG

ఇక ఇసియానికి వచ్చెత్తే... ఇందాక మీడియా గొట్టాల ముందు మా బాబోరు ఎంత సక్కగా వివరాలు సెప్పాడో కదా ? అసలు ఈ జగన్ కు ఏం తెలుసు అండి ..? ఎక్కడైనా వంగుని ఎవరిని ఎలా దారికి తెచ్చుకోవాలి బాగా తెలుసు కదా ! అయినా ఏపీలో ఇంత పెద్ద పెమాదం వత్తాదని మా బాబొరికి తెలియంది కాదు. అసలు వత్తే ఈ పెపంచకాన్ని రచ్చించమని మా బాబు గారి దగ్గరకే అందరూ పరిగెట్టుకు రావాలనే కదా ఇప్పటి దాకా సూత్తు ఊరుకుంది. అయినా అసలు కరోనాకి మందు ఎప్పుడో కనిపెట్టసాడు కదా ...? నోట్లో ఉప్పు నీళ్లు వేసుకుని ఊసెత్తే ... కరోనా గిరోనా అసలు దగ్గరకే రాదనే విషయాన్ని ఎప్పుడో మా బాబోరు చెప్పేసారు. అయినా ఈ జనాలు వినిపించుకుంటే కదా ..? 

 

IHG


అసలు ఈ కరోనా వచ్చి ఇంత మంది ఇబ్బందిపడుతుంటే ... సరుకులు ... ఓ వెయ్యి రూపాయలు ఇత్తరా అని కనీసం ముందు వాయిదాగా ఓ 5000  ఇవ్వాల్సిందే అని డిమాండ్ సేసాడు సూడండి అది... అది మా బోబోరు అంటే. ఆ జగన్ ఉద్యోగుల జీతాల్లో సగం కోసేసాడా ...? అదే మా బాబొరయితే మొత్తం కోసేద్దుడు కదా ! అయినా ఈ జగన్ కు ఏమీ సేతకాదండి...! అదే మా బాబు గారయితేనా ఈ కరోనా పేరు సెప్పి కరువంతా తీర్చేసుకుందురు కదా ..? పేపర్లలో మనిషికి పదివేలు ఖర్చేట్టామని చెప్పేసి తొమ్మిదేలు నొక్కెద్దుడు కదా ! చి చి ఆ జగన్ కు సంపాదించుకోవడమే రాదు ..! కరోనా సమయంలో మందు విచ్చలవిడిగా దొరికేస్తోందని చీ....ఫ్ కామెంట్లు చేసేస్తున్నాడు. అసలు ఆ జగన్ కు ఏం తెలుసు పబ్లిసిటీ సేసుకోవడం ..? మా బాబొరిని సూడండి ...! ఇప్పటికీ సీఎం తానే అన్నట్టుగా బిల్డప్ ఇత్తన్నాడు. అవసరం ఉన్నా లేకపోయినా మీడియా ను పిలేసేసి పబ్లిసిటీ చేసేసేసుకుంటున్నాడు. అసలు ఆ జగన్ కు ఏం తెలుసు ...? కరోనా లో కూడా పబ్లిసిటీ సేసుకునే కరకట్ట కరోనా మా బాబోరని .....!  

మరింత సమాచారం తెలుసుకోండి: