సోషల్ మీడియా హవా గత కొద్ది సంవత్సరాలుగా బాగా పెరుగుతూ వస్తోంది. ప్రతి ఒక్కరు ఏదైనా సమాచారం తెలుసుకునేందుకు, తమకు తెలిసింది చెప్పేందుకు సోషల్ మీడియా వేదికగా చేసుకుంటున్నారు. సోషల్ మీడియా హవా పెరిగిన తరువాత ప్రతి ఒక్కరూ తమ సొంత మీడియాగా సోషల్ మీడియా ను భావిస్తున్నారు. సోషల్ మీడియా కు ఆదరణ పెరిగిన తర్వాత, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కు ఆదరణ బాగా తగ్గిందననే చెప్పాలి. ఎవరి సొంత అభిప్రాయం వారు పంచుకునే అవకాశం సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ మీద దొరుకుతుండడంతో ఎవరు ఇష్టం వచ్చినట్లుగా వారు రకరకాల పోస్టింగ్ లు పెడుతూ వైరల్ చేస్తున్నారు. ఫేస్బుక్, ఇన్స్టిగ్రామ్, ట్విట్టర్, వాట్సాప్, ఇలా రక రకాల సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్లలో పోస్టింగ్స్ పెట్టుకుంటున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా, సోషల్ మీడియాలో వచ్చే వార్తల్లో నిజం కంటే అసత్యాలు ఎక్కువ స్థాయిలో ప్రచారం అవుతుండడంతో... ఏది వాస్తవమో, ఏది అవాస్తవమో తెలియకుండా పోతోంది. 

 

జరిగింది... జరుగుతున్నది... జరగబోయేది ఒకటైతే, సోషల్ మీడియాలో మాత్రం జరిగింది జరగనట్టుగా, జరగనిది జరిగినట్టుగా, ఇలా రకరకాలుగా అవాస్తవాలను ప్రచారం చేస్తూ మానసిక ఆనందం పొందుతున్నారు. ఇక రాజకీయ పార్టీల విషయానికి వస్తే ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. సోషల్ మీడియాలో ఎవరి పార్టీ గురించి వారు గొప్పగా చెప్పుకునే క్రమంలో ఇతర పార్టీలపై అసత్య కథనాలు, తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను మరింత గందరగోళం లోకి నెడుతున్నారు. ప్రస్తుతం ఏపీలోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి ఉదృతంగా ఉంది. ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని దేశాలు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. వాస్తవంగా చెప్పుకుంటే ఇది మానవాళికి ఎదురైన పెను విపత్తు. ఈ పెను విపత్తు నుంచి బయటపడేందుకు ప్రస్తుత మార్గం సామాజిక దూరం పాటించడం ఒక్కటే మార్గంగా కనిపిస్తోంది. 

 

ఇక ఈ వైరస్ మహమ్మారి విషయంలో ప్రజలకు ధైర్యం చెబుతూ... సరైన సలహాలు, సూచనలు ఇచ్చేలా అన్ని ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. అయితే సోషల్ మీడియాలో మాత్రం ప్రజలను భయాందోళనకు గురి చేసే విధంగా అనేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. హాలీవుడ్ సినిమాలోని క్లిప్పింగ్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ... ఫలానా దేశంలో కరోనా వైరస్ బారినపడి రోడ్లపైనే జనాలు మరణిస్తున్నారని, వారి శవాలు గుట్టల్లా పేరుకుపోయాయని, త్వరలోనే భూమి అంతం కాబోతోందని, ఈ వైరస్ ను కట్టడి చేయడం ఎవరి తరం కాదని, ఇలా ఎన్నో రకాల పుకార్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అక్కడితో ఆగకుండా.. కుల, మతాల మధ్య చిచ్చుపెట్టే విధంగా ఎప్పుడో, ఎక్కడో జరిగిన సంఘటనలు వీడియోలను ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, ఫలానా మతం వారి వల్లే ఎక్కువ గా ఈ వైరస్ వ్యాప్తి చెందుతోందంటూ... మతవిద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పోస్టింగ్స్ పెడుతూ, జనాలను మరింత రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారు.

 

IHG

 ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ సూచనలు చేసిందని, మద్యం షాపులు తెరిచేస్తున్నారని.. ఇదిగో దానికి సంబంధించిన జీవో కాపీలు అంటూ సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెడుతున్నారు. ఇంకా కరోనా కు సంబంధించి అనేక రకాలైన వార్తలను, అసత్యాలను చేస్తూ సోషల్ మీడియాలో కొంతమంది వ్యవహరిస్తున్న తీరుపై ప్రభుత్వాలు కూడా సీరియస్ గానే దృష్టి పెట్టాయి. సోషల్ మీడియాలో అసత్య కథనాలు పోస్ట్ చేస్తూ తప్పుడు ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ ప్రకటించడమే కాకుండా, అటువంటి పోస్టింగ్స్ పెడుతున్న వారిని ఎప్పటికప్పుడు గుర్తించే పనిలో అన్ని రాష్ట్రాలు నిమగ్నమయ్యాయి. 

 

IHG's enough: Govt to charge those who spread fake <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=NEWS' target='_blank' title='news-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>news</a> on ...

ఇక తెలంగాణలో సీఎం కేసీఆర్ తప్పుడు కథనాలు ప్రచారం చేసే వారికి కరోనా వైరస్ రావాలని తాను కోరుకుంటున్నా అంటూ శాపనార్థాలు కూడా పెట్టేశారు. అక్కడితో ఆగకుండా factcheck పేరుతో ఒక వెబ్సైట్ ను కూడా తెరిచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తప్పుడు సమాచారాన్ని కట్టడి చేస్తున్నారు. అలాగే ఎవరైనా తప్పుడు పోస్టింగ్ పెడుతూ, జనాలను గందరగోళానికి గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ పదే పదే హెచ్చరిస్తూనే కొంత మందిని అరెస్టులు కూడా చేయించింది. ఇలా సోషల్ మీడియాలో తప్పుడు కథనాల ద్వారా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా, గందరగోళానికి గురికాకుండా అన్ని రాష్ట్రాలు ఇప్పుడు కఠిన నిబంధనలు రూపొందిస్తున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠిన నిబంధనలు విధించినా సోషల్ మీడియాలో మాత్రం రకరకాల అసత్య కథనాలు వైరల్ అవుతునే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: