చింత చచ్చినా, పులుపు చావదు అని చాలామంది చాలా సార్లు చెప్పినా ఏంటో అర్ధం అయ్యి చవాలేదు. దీని అర్ధం .. పరమార్ధం ఇప్పడు మా చంద్రబాబు నాయుడుని సారి... సారి ! ఫార్టీ ఇయర్స్ చంద్రబాబు నాయుడుని సూత్తుంటే అర్ధం అయిపోతుంది. బాబు గారు మీరు ... మీ పాలన ఎలా ఉంటుందో ఎలా ఉండకూడదో మేము మాకు క్లారిటీ వచ్చేసింది. మీరు ఇక ఇంటికెళ్లి రెస్ట్ తీసుకోండి అంటూ చంద్రబాబు ని ఇంటికి ఏపీ జనాలు సాగనంపి ... ఆ జగన్ కు అధికారం కట్టబెట్టినా... ససేమీరా .. మీరు ఒప్పుకున్నా... ఒప్పుకోకపోయినా ఈ ఏపీకి ఇప్పటికి ఎప్పటికి నేనే కదా సీఎం ... నా తరువాత మా లోకేశం సీఎం. నేను అలా ఫిక్స్ అయిపోయానంతే ! అనుకుంటూ ఎప్పుడూ మీడియాలో కనిపించాలనే తాపత్రయం పాపం బాబు గారిలో బాగా పెరిగిపోయింది. ఈ ఎర్రి జనాలకే అర్ధం కావడంలేదు. జగన్ ఏపీ సీఎం అనుకుంటున్నారు పాపం. 

 

IHG

అసలు విపత్తులకే విపత్తు లాంటి చంద్రబాబు ని ఆ జగన్ ... ఈ ఏపీ జనాలు బాగా తక్కువ అంచనా వేస్తున్నట్టు కనిపిస్తున్నారు. అసలు ఇప్పుడు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ గురించి జనాలంతా కకలా, వికలం అయిపోతున్నారు. కానీ ఎవరైనా అసలు చంద్రబాబు సలహాలు అడిగారా ? ఈ జగన్ ఎలాగూ అడగడు. బాబు గారు మీరే దిక్కు అని కనీసం ఆ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అయినా అడగాలి కదా ...? అసలు ప్రపంచానికి ఇంత విపత్తు వచ్చింది కదా ...! ఒక్క దేశం వాళ్ళయినా బాబ్బాబు మీరే మాకు దిక్కు ... ఈ కరోనా నుంచి మీరే మమ్మల్ని బయటపడేయ్యాలని ఒక్కరు కూడా ఫోన్ చేయలేదు ... మా బాబు గారికి బాధగా ఉండదా అండి.  
 

IHG


ఢిల్లీ వీధుల్లో చక్రాలు, బొంగరాలు తిప్పిన బాబు గారి అంత మహానుభావుడిని మీరంతా మర్చిపోతారా ? దిస్ ఈజ్ వెరీ దారుణం కదా ...? అసలు చంద్రబాబు బాబు అంత పెపంచ మేధావి ఎక్కడైనా ఉన్నాడా...? ఆ జగన్ కి, ఈ మోదీ కి ఏం తెలుసు ...? అసలు ఈ దేశంలోనే బాబు గారి అంత రాజకీయ మేధావి ... సీనియర్ ఇంకెవరైనా ఉన్నారా ...? లేరు కదా ..? అసలు ఈ ఆంధ్ర జనాలు బాబు గారిని ఓడించి ఎంత తప్పు చేశారో కదా ! అయినా పెద్ద మనసు చేసుకుని ఇప్పటికీ సీఎం నేనే అనుకుంటూ బాబు గారు ఎంత కష్టపడుతున్నాడో కదా ! సలహాలు తీసుకోమన్నా .. ఎవరూ తీసుకోవడంలేదు. కనీసం ఆ లోకేశానికి సలహాలు ఇచ్చినా బాగుండేది. కానీ ఆయనకేమో లక్సల్ లక్సల్ జీతాలు ఇచ్చి ట్యూషన్ పెట్టించినా... ఆయనేమో మందలగిరి మాటలే మాట్లాడుతున్నాడు.

 

IHG's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=MINISTER' target='_blank' title='minister-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>minister</a> son <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=NARA LOKESH' target='_blank' title='nara lokesh-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>nara lokesh</a> wins big IT project for ...

 ఇప్పుడు ఈ కరోనా కోసం .. దాని నివారణ కోసం సలహాలు ఇద్దామంటే ఎవరూ వినిపించుకుని సావడంలేదు. ఇంతకీ బాబు గారు కరోనా కట్టడికి ఇచ్చే సలహా ఏంటంటే ..? వేడి వేడి నీళ్ళల్లో ఉప్పేసుకుని తాగేస్తే కరోనా గిరోనా జాన్తానై. ఇదే కదా పెపంచానికి చెబుదామంటే రాజకీయాలు చేస్తారా ..? రాజకీయాలు చేయడానికి ఇది నాట్ సమయం. 

మరింత సమాచారం తెలుసుకోండి: