రాస్తున్నానొక ప్రియ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు..

కాళన్న యాదికొస్తడు
నేను నా గొడ‌వ‌లో ఉన్నానా
ఎందుక‌ని మాంత్రిక ఛాయల్లో నేను రాయాలి
మ‌స్తు శోచాయించ‌కు నీవేం అనుకున్న‌వో అదే రాయు
ఔ మ‌ల్ల‌! స‌ర్ చూస్త‌డ హా చూస్త‌డు న‌చ్చిందా
నీ పాట‌కు వంద‌న‌మెడ్త‌డు
అన్న నీకు దండమే అంట‌డు
ఉద్య‌మంలో ఉరుకలెత్తి పాట రాసిండు సారు
ఎంత‌గా గుర్తో! ఆదిక‌వి ఎవ‌రు అన్న యాది నుంచి
ఆధునిక క‌వి తీరు వ‌ర‌కూ అంతా స‌ర్ జెప్త‌డు


పాట‌కు నేను ఏమ‌యినా పాదాల న‌డ‌వ‌డిని కూర్చానా అనుకున్నాను నేను మీ బిడ్డ‌ను ప‌ట్టెడ‌న్నెం అందుకున్న వేళేనా మీ ప్రేమ‌కు నేను బానిస‌ను అని ప్ర‌శ్నించాను..అవును!నేను తెలంగాణ బిడ్డ‌ను ఆంధ్రా బిడ్డ‌ను రెండు తెలుగు రాష్ట్రాల బిడ్డ‌ను..న‌న్ను పాట అనండి న‌న్ను మీ ఇంటి గుమ్మం వాకిట వెలుగు రేఖ అనండి ఏమ‌యినా అనండి స‌ర్!ఇప్పుడు మీ ముచ్చ‌ట జెప్తా! ఇనుకోం డ్రి!


ప్ర‌జ‌లంటే ప్రేమ ఉండాలి..లేదా ప్ర‌జ‌ల ప్రాణాల విలువ ఒక్క‌టి తెలిసి ఉండాలి. అందుకు వైద్య శాస్త్రం తెలియ‌న‌వ‌సరం లేదు..మం చి నాయ‌కుల‌కు కొన్ని మా త్ర‌మే ల‌క్ష‌ణాలు ఉంటాయి. అవి ప్ర‌త్యేకించి ఉంటాయి.. నేల‌ను కాపాడుకో వాలి ప్ర‌జ‌లు సుభిక్షంగా ఉం డాలి.. రాజ్యంలో ఆక‌లిని చూశాను క‌న్నీళ్ల‌ను చూశా ను. వీటి చెంత రాజు ఎలా ఉండాలి..నిబ్బ‌రానికీ, నిజాయితీకీ సంకేతించి ఉం డాలి..లేదా అందుకు తార్కాణంగా నిలిచిన ఘ‌ట‌న‌ల‌కు ప్రతినిధిగా ఉండాలి.. మీకు ఆక‌లిగా ఉంది.. మీ ఆక‌లి నేను తీరుస్తాను ఎవ్వ‌రూ ఎక్క‌డికీ వెళ్లొద్దు అన్న‌పూర్ణ క్యాంటీన్లు మీకు ప‌ట్టెడ‌న్నెం పెడ్తాయి..మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు..అని చెప్పారాయ‌న‌.


కొద్దిగా ఈ స‌ర్ నాకెందుకో కోపం తెప్పించారు
సాహిత్య సంబంధ విశేషాలు చెప్పి న‌న్ను న‌వ్వించారు కూడా
యే ఊరుకోండి నేనున్నా క‌దా! మీ ప్రాణం జ‌ర పైలం
మీ ప్రాంతం మీ భాష మీ యాస ఇవ‌న్నీ బాగుంటాయి
నేనున్నంత వ‌ర‌కూ..అందుకు మీరు పొందే అవ‌కాశాలు కూడా తోడ్పాటు అందిస్తాయిఅందుకు సాక్ష్యాలు ఎన్నో!


ఇవాళ నేలకు కొత్త ఆనందాల‌ను అందించిపోయాను..వీరుల గాథ‌లు వింటూ న‌డుచుకుంటూపోయాను. మీరు నా బిడ్డ‌లు మీరు నా తోటి సోద‌రులు మీకేం క‌ష్టం రానివ్వ‌ను అని ఆ రోజు ఆంధ్రుల‌కు భ‌రోసా ఇచ్చిన తీరు ఇప్ప‌టికీ అదే కొన‌సాగింపు న‌న్నెంతో ఆ నందింప‌జేస్తుంది. రాజు ఎలా ఉండాలి అనే నియ‌ మం ఒక‌టి ఆరాతీస్తాను.. కిశోర్ గారూ! మీరు ఏం అనుకోండి ఆ నేల సాధ్యం చే సి, త‌న రుణం తీర్చుకోమంటుంది..క‌నుక సాధ్య‌త‌ను ప్రేమించాలి.. రాజు అసా ధ్య‌త‌నూ అనిత‌ర సాధ్య‌త‌నూ కూడా ప్రేమించాలి.


మన‌సున్న రాజు ఇదే ప‌ని చేయ‌గ‌ల‌గాలి..కొంత సాహిత్యాన్నీ, కొన్ని క‌ళ‌ల‌ నూ, మూల ధ్వ‌నుల‌నూ భద్ర‌పరిచే రాజు మ‌న‌కో తో డు ఉంటే ప్ర‌తిరోజూ సా హిత్యం ప్ర‌తిరోజూ వికాసం సాధ్యం అయి తీరుతుంది. స‌ర్! ఇంత ఎలా చ‌దువు కున్నారు కృష్ణ‌మ్మ ప‌ర‌వ‌ళ్ల ఉ ర‌వ‌డిని ఎలా చెబుతారు.. ఆశ్చ‌ర్యం సీమ‌కు వ‌ చ్చే నీళ్లెన్ని పోయే నీళ్లెన్నీ ఇవ‌న్నీ స‌ర్ కు గ‌ణాంకాల‌తో స‌హా ఎలా తెల్సు అదీ చూడ‌కుండా చెబుతారో పొల్లు పోదు అక్ష‌రం మీద ఆన..అస్స‌లు మాట్లాడితే త‌ప్పు పోదు ఆ నేల మీద ఆన..


స‌ర్..ఈ ప్ర‌జ‌లు కొంచెం క్ర‌మ‌శిక్ష‌ణ త‌ప్పుతారు ఈ ప్ర‌జ‌లు అస్స‌లు మాటే విన‌ రు అని అనుకుంటాను..మీరు నా బిడ్డ‌లు.. అలా అ ని త‌ప్పు చేస్తే ఒప్ప‌ను.. క‌ష్టం వ‌స్తే జారుకోను..అనే నేత‌లు కావాలి.. తెలంగాణ ఉద్య‌మం నుంచి నేను చాలా నేర్చుకున్నాను..ఈ ప్రాంత నాయ‌కుల్లో బాధ్య‌త కావాలి/జ‌వాబుదారీత‌ నం కావాలి.. మీరున్న చోట చైత‌న్యం పుట్టించి కొత్త నినాదాలు ప‌లికించిన తీరు ఎంతగా ఆలోచింప‌జేస్తుందో! ప్ర‌జ‌ల‌కు క‌ష్టం అంటే క‌న్నీరు అంటే ఊర‌ట ఇచ్చే వాడే నాయ‌కుడు అని అంటే విని న‌వ్వుతాను ఇ ప్పుడూ అప్పుడూ మిమ్మ‌ ల్నే చూసి ఆ న‌వ్వును వెనుక్కు తీసుకుంటాను.. అవును! రోడ్డెక్కిన జ‌నం ఆ నాటి గ‌ళం ఇప్ప‌టికీ గు ర్తు.. ఉద్య‌మంలో కేసీఆర్ స‌ర్ ఇలా ఉన్నారు సీఎం అ యితే ఎలా ఉంటారు అనుకునేవాణ్ని..ఇప్పుడు ఇంకా బాగున్నారు.. నా అ న్న‌య్య‌ల‌నూ, అక్క‌ల‌నూ, త‌మ్ముళ్లనూ ఎంత బాగా చూసుకుంటున్నారో! 

 

ఒ క్క‌టి సర్! ఇలాంటి ద‌క్షత ఉంటే దేశానికి మీ నాయక‌త్వంలో కొద్ది శాతం అ యినా అందితే మేలు.. మీరే కాదు ఆ తార‌క్ కూడా ఇష్టం.. ఇంత బాగా ట్విట‌ర్ ద్వారానే స్పందిస్తున్నారే.. అవును! మ‌రో మాట క‌వితక్క అన్నా నాకెంతో ఇ ష్టం..ఇలా నాయ‌కులు నేల‌ను ప్రేమించాలి.. ప‌ల్లెను ప్రేమించి మూలాల‌ను ప దిలం చేసుకోవాలి..మీకు క‌ష్టం రాదు నేనున్నంత వ‌ర‌కూ అనేవాడు రావాలి ..తెలంగాణ చంద్రుడికి వంద‌నాలు చెల్లిస్తున్నాను.. స ర్! ఓ సాహిత్య విద్యార్థి గా ఎప్పుడూ ఆనందిస్తాను.. బాబోయ్ అంత ప‌ట్టేంటి భాష‌మీద.. ఎంత బాగా ఆ నుడిని న‌మ్ముకుని ప‌లు కుతారు.. అవును! మీరే కాదు అక్క‌డున్న‌వారం తా శ్ర‌మ వేదాల‌కు కొత్త రూపు ఏద‌యినా ఉంటే దాన్నే ప్రేమిస్తారు.. ఈ ఉత్త‌ రాంధ్ర బిడ్డ ఒంట‌రిగా న‌డ‌యాడి మీ మాట‌లు విన్నాడు.. కొన్నింట‌పై అప్ప‌ట్లో ఉన్న విముఖ‌త ఇప్పుడు లేదు..ల‌వ్యూ స‌ర్..


గొప్ప సాహిత్యం ఎలా ఉంటుంది

నేను క‌వాతు చేస్తున్న తీరులా ఉంటుంది

లేదా న‌న్ను క‌దిపి కుదిపి తీరులా ఉంటుంది

మంచి క‌విత్వం రాయండి..

మంచి పాట రాయండి

ఏమ‌యినా రాయండి జ‌న చేత‌న ప్ర‌యోజ‌నం కావాలి అని అంటారు

నేను న‌వ్వుతాను ఒక్క‌ద‌గ్గ‌రే విభేదం మంచి క‌విత్వం లేదు క‌దా!

మంచి పాట పుట్టిన నేల‌లో నేనూ ఉన్నాను..

ఆహా! ఈ సాహిత్యం ఈ జ‌న హితం కోరుకున్న‌దేదో ఇప్ప‌టికీ తెల్సుకుంటూ

పోతున్నాను..

 

ముందు ఈ శ్రీ‌కాకుళం బిడ్డ వంద‌నాలు చెల్లిస్తున్నాడు అందుకోండి..

నేన‌ప్పుడు ఎక్క‌డ ఉన్నాను

ధ‌ర్నాచౌక్ వీధుల్లో ఉన్నాను

అప్పుడు క‌విత‌క్క వ‌చ్చి మాట్లాడుతున్నారు

నేను వింటున్నాను

హ‌రీశ్ రావు స‌ర్ వ‌స్తున్నారు పోయి మాట‌లు వినాలె

వంట ఇంకా కాలేదు.. రూమ్ అక్క‌డే పోయినా విన్నా

నేలంటే ఇలా ఉండాల నీవు అనుకున్నావా నీ ప‌ని అయిపోతుంది

క‌న్నీళ్ల‌ను త‌ర్ప‌ణంగా పొందిన నేల దగ్గర నేనెంతో చిన్న‌వాణ్ని అనేక ఆలోచ‌న‌ల పరంప‌ర‌లో

 


- ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి

మరింత సమాచారం తెలుసుకోండి: