ఆయన కంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గొప్పతనాన్ని గొప్పగా చెబుతూ... అదే సమయంలో ఏపీ సీఎం జగన్ ను తక్కువ చేసి చూపించాలని ప్రయత్నించిన తెలుగు తమ్ముళ్ళు ఆ కంగారులో పొరపాటున నిజాలు బయట పెట్టేసారు. ఆ తరువాత జరిగిన నష్టాన్ని గుర్తించి ఇప్పుడు తీరిగ్గా నాలుక కరుచుకుంటున్నారు. చంద్రబాబు అంత అపర చాణిక్యుడు కానీ, అంతా రాజకీయ మేధావి గాని, ముందుచూపు ఉన్న వ్యక్తి గాని అసలు ఎవరూ లేరు అన్నది తెలుగుదేశం పార్టీ నాయకుల అభిప్రాయం. కేవలం చంద్రబాబు ఒక్కడి వల్లే తెలుగుదేశం పార్టీ ఇంకా బతికే ఉందని, ఎంత ఒడిదుడుకుల్లో ఉన్నా, పార్టీని పైకి లేపగల సమర్థుడు చంద్రబాబు అని ఆ పార్టీ నాయకులు భావిస్తూ ఉంటారు. 

 

IHG
ఇక చంద్రబాబు కూడా అదే రకంగా అభిప్రాయపడుతుంటారు. తనకంటే ఉత్తమ పాలకుడు, సీనియర్ రాజకీయ నాయకుడు లేరని, తనకు ప్రధాన మంత్రి పదవి వచ్చినా తిరస్కరించిన గొప్ప మనిషి ఆయన అంటూ గొప్ప చెప్పుకున్నారు. ఎప్పుడో జరిగిన సంఘటనలు కూడా ఇప్పుడు గొప్పగా చెప్పుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రపంచ దేశాల్లో చంద్రబాబు అనే పేరు చెబితే తెలియని వారు ఉండరు అని, అటువంటి గొప్ప వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నుకోకపోవడం ఏపీ ప్రజలు చేసిన ఘోర తప్పిదమని కూడా పదేపదే చెబుతూ ఉంటారు. ఈ సంగతి ఇలా ఉంటే, జగన్ ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏపీ పూర్తిగా అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందని, ఏపీ ఆదాయం కూడా గణనీయంగా తగ్గిపోయిందని, ఒక్క పైసా నిధులు కూడా రాలేదని టిడిపి అదే పనిగా ప్రచారం చేస్తోంది. 

 

IHG


అసలు జగన్ కు సంపదను సృష్టించడం రాదని, ఆయన ఎక్కడికి వెళ్ళినా, పెట్టుబడి తీసుకురాలేరని అనేక సందర్భాల్లో చంద్రబాబు సైతం విమర్శలు చేశారు. జగన్ వచ్చాక కొత్త పరిశ్రమలు రాకపోగా, ఉన్న పరిశ్రమలు మూతపడ్డాయని, అన్ని వైపుల నుంచి ఆదాయం పడిపోయిందని, జగన్ కు పరిపాలన చేతకాదని అసమర్థుడని, ఇలా ఎన్నో విమర్శలు తరచుగా చేస్తూనే ఉంటారు. జగన్ పరిపాలనలో ఉద్యోగులకు కనీసం జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేకపోవడం సిగ్గుచేటు అని విమర్శలు చేస్తూ వస్తున్నారు. తాజాగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు narendra KUMAR' target='_blank' title='ధూళిపాళ్ల నరేంద్ర-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ధూళిపాళ్ల నరేంద్ర జగన్ ను ఇరుకున పెట్టే విధంగా రాసిన లేఖ ఇప్పుడు తెలుగుదేశం పార్టీని చిక్కుల్లో పడేలా చేసింది. 

 

IHG

తెలుగుదేశం హయాంలో 2018 - 19 ఆర్థిక సంవత్సరానికి వచ్చింది లక్ష 57 వేల కోట్లు అయితే జగన్ హయాంలో 2019 20 ఆర్థిక సంవత్సరానికి లక్ష 87 వేల కోట్ల రూపాయలు నిధులు వచ్చాయని  ధూళిపాళ్ల తన లేఖలో నిజాలు చెప్పేసారు. అయితే ఇదే విషయాన్ని వైసిపి హైలెట్ చేస్తోంది. ఏపీ సీఎం జగన్ కు పరిపాలన చేతకాదని, ఆదాయం పెంచే అంత సామర్ధ్యం లేదని విమర్శలు చేశారని, ఇప్పుడు మీరు విడుదల చేసిన లేఖలో ఏపీ ఆదాయం 30 వేల కోట్లు ఎలా పెరిగిందని, పది నెలల్లో ఇంత సాధించడం అంటే గొప్ప విషయమే కదా అంటూ తెలుగుదేశం పార్టీపై వైసీపీ విమర్శలు చేస్తోంది. జగన్ ప్రభుత్వాన్ని ఉద్యోగులు, ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాలని ప్రయత్నించిన తెలుగు తమ్ముళ్ళు కంగారులో నిజాలు బయటపెట్టి వైసీపీ ఇమేజ్ పెరిగేలా చేయడంతో పాటు చంద్రబాబు ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: