తెలంగాణాలో కరోనా వైరస్ నేపధ్యంలో ప్రభుత్వానికి మీడియా యాజమాన్యానికి మధ్య యుద్ధం మొదలయ్యేట్లే ఉంది. మీడియా సమావేశంలో కేసియార్ మాట్లాడుతూ పేరు పెట్టకుండానే పచ్చమీడియాను నోటికొచ్చినట్లు తిట్టిన విషయం అందరికీ తెలిసిందే. పైగా సదరు మీడియాకు కరోనా వైరస్ సోకాలని శాపనార్ధాలు కూడా పెట్టాడు. పిచ్చి, వెకిలి రాతలు రాస్తే బొందపెడతానని వార్నింగ్ ఇచ్చాడు. బహుశా ఏ ముఖ్యమంత్రి కూడా మీడియాను ఇంతగా వార్నింగులు ఇచ్చి ఉండడేమో ? సరే కేసియార్ వార్నింగులకు సదరు మీడియా అధిపతి కూడా స్పందించాడు.

 

తన ఎడిటోరియల్ కాలంలో కేసియార్ వైఖరిని తీవ్రంగా తూర్పారబట్టాడు. దాంతో కేసియార్ ఆరోపణలన్నింటినీ సదరు యాజమాన్యం తప్పని ఖండించినట్లయ్యింది.  పైగా ప్రభుత్వం ఫెయిలైనపుడు మీడియానే వాస్తవాలను పౌర సమాజానికి చూపిస్తుందంటూ తాను కూడా వార్నింగ్ ఇచ్చాడు. అంటే కేసియార్ బెదిరింపులకు బెదిరేది లేదన్నట్లుగా ఉన్నాయి రాతలు. దాంతో ఇపుడు వీళ్ళిద్దరి మధ్య మొదలైన వార్ ఎంతదాక వెళుతుందనేది ఆసక్తిగా మారింది.

 

నిజానికి తెలంగాణాలో చాలా కాలంగా మీడియా అసలు కేసియార్ పనితీరు గురించి కానీ కుంటుంబం గురించి కానీ లేదా ప్రభుత్వం గురించి కూడా పెద్దగా ఫోకస్ పెట్టటమే లేదు.  కుటుంబమంటే కొడుకు మంత్రి, కూతురు మాజీ ఎంపి, కాబోయే ఎంఎల్సీ, మేనల్లుడు మరో మంత్రి. మరో దగ్గర బంధువు రాజ్యసభ ఎంపి కాబట్టి వార్తలు రాయాలంటే బోలెండత అవకాశం ఉంది. అయినా ఎవరు వాళ్ళపై వార్తలు రాయటం లేదనే చెప్పాలి.

 

కేసియార్ కు భయపడే మేజర్ మీడియాలో ఎవరూ వార్తలు, కథనాలు రాయటానికి భయపడుతున్నారు. ఇటువంట సమయంలో కరోనా వైరస్ విషయంగా గాంధి ఆసుపత్రిలో డాక్టర్లపై కొందరు దాడి చేశారు.  పచ్చమీడియా ఘటన వరకు రాసుంటే సరిపోయేది. కానీ డాక్టర్లకు రక్షణేది అంటూ విడిగా ఓ కథనాన్ని ఇచ్చింది. దాన్నే కేసియార్ తప్పుపడుతు రెచ్చిపోయాడు. సరే ఇద్దరిలో ఎవరిది తప్పన్న విషయాన్ని పక్కనపెడితే ఇపుడు ఇద్దరూ ఒకిరిని మరొకరు చాలెంజ్ చేసుకున్నారన్న విషయం వాస్తవం.

 

మరి ఇపుడు ఏమవుతుంది ? అన్న విషయమే అందరిలోను ఆసక్తిగా మారింది. ఇదే మీడియా తెలంగాణాలో కక్కిరుమనకపోయినా ఏపిలో జగన్మోహన్ రెడ్డి విషయంలో మాత్రం రెచ్చిపోతోంది. చిన్న విషయాలను కూడా భూతద్దంలో చూపిస్తోంది. చంద్రబాబునాయుడు ఇంట్రస్టును కాపాడటమే  ధ్యేయంగా పనిచేస్తున్న ఈ మీడియా విషయంలో కేసియార్ గట్టిగా ఉంటాడనే అందరు అనుకుంటున్నారు. చూద్దాం కరోనా వైరస్ నేపధ్యంలో మొదలైన వీళ్ళ సవాళ్ళు ఎంతదాకా వెళుతుందో ?

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: