మానవ మేథస్సు ఎంత గొప్పదైనా సరే దానికీ కొన్ని పరిమితులుంటాయి. వయస్సులో ఉన్నప్పుడు టెలిఫోన్ డైరెక్టరీ మొత్తం గుర్తు పెట్టుకున్నా.. వయస్సు మీద పడ్డాక సొంత మొబైల్ నెంబర్ కూడా ఒక్కోసారి గుర్తుకొచ్చి చావదు. దానికి ఎవరినీ తప్పుబట్టలేం. వయస్సుతో వచ్చే సమస్యే అది. కాకపోతే.. దాన్ని మనం గుర్తించాలి. ఆ మరపును అధిగమించేందుకు ప్రయత్నించాలి.

 

 

కానీ చంద్రబాబు విషయంలో అది లోపిస్తోందేమో అనిపిస్తోంది. తాజా పరిణామాలు చూస్తే అదే నిజమనిపిస్తోంది. ఎందుకంటే.. ఏపీ మాజీ సీఎం ప్రస్తుత ప్రతిపక్షనేత అయిన చంద్రబాబు పాపం.. ఇప్పుడు హైదరాబాద్ లో చిక్కుకుపోయారు. నా మనసంతా ఆంధ్రాలోనే ఉంది.. కానీ ఏం చేయను చెప్పండి లాక్ డౌన్ పుణ్యమా అని హైదరాబాద్ లో చిక్కుబడిపోయేను.. ఇక్కడ ఉన్నా.. నా మనసంతా ఆంధ్రానే అంటూ ఆయన ఆ మధ్య ఓ ప్రెస్ మీట్లో తెగబాధపడిపోయారు.

 

 

పాపం.. ఆయన బాధను ఏమాత్రం అనుమానించాల్సిన అవసరమే లేదు. ఆంధ్రా ప్రతిపక్షనేతగా ఆయన బాధను అర్థం చేసుకోగలం. అందులోనూ ఆయన ఆంధ్రప్రదేశ్ కు మాజీ ముఖ్యమంత్రి కూడానాయె. పాపం.. నిన్న మొన్నటి వరకూ అదే ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం రోజుకు 18 గంటలకుపైగా పని చేసిన మనిషి కూడా. విచిత్రం ఏంటంటే.. ఆయన హైదరాబాద్‌లో ఉంటూ కూడా తన పార్టీ తెలంగాణలోనూ ఉందన్న సంగతి పూర్తిగా మర్చిపోయారు.

 

 

అదెలాగంటారా.. పాపం.. ఆయన ఇటీవల రెండు రోజులకోసారి ఏపీ సీఎం జగన్ కు ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తున్నారు. ప్రెస్ మీట్లు పెట్టి అలా చేయండి.. ఇలా చేయండి.. అని సలహాలు ఇస్తున్నారు. కానీ.. తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడైన నారా చంద్రబాబునాయుడు గారు.. తన పార్టీ తెలంగాణలో కూడా ఉందన్న సంగతి ఎలా మర్చిపోయారబ్బా.. కనీసం కేసీఆరూ ఇలా చేయవోయ్.. అని ఒక్క మాటా అనరేం.. కేసీఆర్.. ఇదిగో నీ కంటే సీనియర్ని ఇలా కరోనాకు కట్టిపడేయ్ అని ఉత్తరం ముక్కయినా రాయరేం.. ఇప్పుడు చెప్పండి. చంద్రబాబుకు మతిమరుపు ఉందా.. లేదా..?

 

మరింత సమాచారం తెలుసుకోండి: