భార‌త ప్ర‌భుత్వం అంచ‌నాలు త‌ల‌కిందుల‌య్యాయి. భార‌త్‌కు  ఏం ఫ‌ర్వాలేదు..మ‌న ద‌గ్గ‌ర ఉష్ణోగ్ర‌త‌లు ఎక్కువ‌గా..అందులోనూ వ‌చ్చేది స‌మ్మ‌ర్‌..ఇక క‌రోనా మ‌న ద‌రిదాపుల్లోకి కూడా రాదు..అంటూ ఆరోగ్య నిపుణులు, ప్ర‌ధానిమోదీతో స‌హ అంద‌రూ ఢంకా భ‌జాయించారు. అయితే వారంద‌రి అంచ‌నాలు తారుమార‌య్యాయి. మ‌న దేశంలోనే కాదు..ఉష్ణోగ్ర‌త‌లు అధికంగా ఉండే అర‌బ్ దేశాల్లోనూ క‌రోనా త‌న హ‌వా కొన‌సాగిస్తోంది. క‌రోనాను త‌క్కువ అంచ‌నా వేసిన దేశాల‌న్నీ కూడా ఇప్పుడు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నాయి. అమెరికా ప‌రిస్థితియే ఇందుకు నిద‌ర్శ‌నం. ఇక ఇట‌లీలో అయితే ప‌రిస్థితి భ‌యాన‌కంగా త‌యారైంది.

 

ఇక భార‌త్ విష‌యానికి ముందు నిర్ల‌క్ష్యం వ‌హించినా వ్యాధి తీవ్ర‌త‌ను గుర్తించిన ప్ర‌ధాని మోదీ వెంట‌నే లాక్‌డౌన్‌కు పిలుపునిచ్చారు. ఈ జాగ్ర‌త్తే క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టింది. అయితే మ‌ర్క‌జ్ ఘ‌ట‌న‌కు ముందు వ‌ర‌కు కూడా భార‌త్‌లో వైర‌స్ అదుపులోనే ఉన్న‌ట్లుగా అన్ని దేశాల ప్ర‌జ‌లు ప్ర‌శంస‌లు కురిపించారు. స్వ‌యంగా డ‌బ్ల్యూహెచ్‌వో సైతం భార‌త్ ఐక్య‌త‌ను, ప్ర‌జ‌ల క్ర‌మ‌శిక్ష‌ణను, వైద్యం అందుతున్న తీరును కొనియాడింది. అయితే వైర‌స్ సైలెంట్ మోడ్‌లోనే విస్త‌రిస్తున్న విష‌యం  ఏప్రిల్ 2త‌ర్వాత గాని తెలియ‌రాలేదు. ఇప్పుడు రోజూ వంద‌లాదిమందికి పాజిటివ్‌గా నిర్ధార‌ణ అవుతోంది.

 

అదే స‌మ‌యంలో మ‌ర‌ణాల సంఖ్య ప‌దుల సంఖ్య‌లో చోటుచేసుకుంటోంది. క‌రోనాను త‌రిమేశం అనుకున్న భార‌త్‌కు వైర‌స్ ఊహించ‌ని షాక్‌లిస్తోంది. ఈశాన్యం భార‌త్‌లో అంత‌గా ప్ర‌భావితం కాని రాష్ట్రాలు ఇప్పుడు క్ర‌మంగా క‌రోనా కోర‌ల్లో చిక్కుకుండ‌టం దేనికి సంకేతం. భార‌త్ అప్ర‌మ‌త్తం కావాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను క‌రోనా పాజిటివ్ కేసులు ఎత్తి చూపుతున్నాయి. జాగ్ర‌త్త‌ప‌డ‌ట‌మే కాదు..లాక్‌డౌన్ కంటిన్యూ చేయాల‌న్న వాద‌న‌కు ఈ సంఘ‌ట‌న‌లు బ‌లం చేకూరుస్తున్నాయి. ఎవ‌రు ఔన‌న్నా కాద‌న్నా మ‌రికొద్దిరోజులు భార‌త్‌లో క‌రోనా హ‌వా కొన‌సాగుతుంద‌ని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఎంతో క‌ఠోర శ్ర‌మ త‌ర్వాత గాని ఈ మ‌హ‌మ్మారి అదుపులోకి వ‌చ్చేలా లేద‌ని తెలుస్తూనే ఉంది.

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: