భార‌త్‌లో క‌రోనా విస్త‌రిస్తున్న తీరు పాల‌కుల‌కు, ప్ర‌జానీకానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మాన‌వాళిని మ‌ట్టుబెట్ట‌డా నికే ఈ వైర‌స్ పుట్టిందా అన్నంత‌గా విజృంభిస్తోంది కరోనా వైర‌స్‌. భార‌త్‌లో క‌రోనా కేసులు న‌మోదవుతున్న తీరు డేంజ‌ర్ బెల్స్‌నే మోగిస్తున్నాయి. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు  6,700 కోవిడ్ పాజిటివ్‌ కేసులు న‌మోద‌య్యాయి. అలాగే ఒక్క గురువారం రోజునే రికార్డుస్థాయిలో 781 కొత్త కేసులు ఉండ‌టం గ‌మ‌నార్హం. నమోదవుతున్న కేసులను బట్టి చూస్తే క‌రోనా  సామూహిక వ్యాప్తి దశలోకి  ప్రవేశించినట్టేన‌ని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. 

 

కరోనా వైరస్‌ నివారణకు వ్యక్తిగత దూరం పాటించడం, మాస్క్‌లు ధరించడం, అత్యవసరమైతే తప్ప ఇంట్లో నుంచి బయటకు రాకపోవడం మంచిదని అధికారులు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక రాష్ట్రాల‌వారీగా చేస్తే గురువారం ఒక్క‌రోజే అత్యధికంగా మహారాష్ట్రలో 229 కేసులు నిర్ధారణ కావ‌డం ప‌రిస్థితి తీవ్ర‌త‌కు అద్దం ప‌డుతోంది. ఇప్పటి వరకూ ఏ రాష్ట్రంలోనూ ఒకే రోజు ఇంత పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నిర్ధారణ కాలేదు. దీని తర్వాతి స్థానాల్లో తమిళనాడు (96), రాజస్థాన్ (80), గుజరాత్ (76), ఢిల్లీ (51) ఉన్నాయి. గత వారం రోజులుగా 500 నుంచి 600 మధ్య కొత్త కేసులు నిర్ధారణ అవుతూ వ‌స్తున్నాయి.  మృతుల సంఖ్య కూడా గురువారం అధికంగా ఉంది. దేశవ్యాప్తంగా 32 మంది ప్రాణాలు కోల్పోయారు.  

 

ఒక్క మహారాష్ట్రలోనే 15 మంది ప్రాణాలు విడిచారు. ఇప్ప‌టి వ‌ర‌కు మహారాష్ట్రలో కోవిడ్ మరణాల సంఖ్య 97కు చేరుకుంది.  భ‌యాన‌క ప‌రిస్థితిని క‌ళ్ల‌ముందు క‌ద‌లాడేలా చేస్తోంది. ఇక‌ మధ్యప్రదేశ్‌లో 33, గుజరాత్ 18, ఢిల్లీ, తెలంగాణ 12, పంజాబ్ 10, తమిళనాడు 8, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ 6, పశ్చిమ్ బెంగాల్ 5, ఉత్తరప్రదేశ్ 4, రాజస్థాన్ 3,కేరళ, హర్యానా 2, మిగతా రాష్ట్రాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు. మొత్తం 636 మంది బాధితులు కోలుకున్నారు. తెలంగాణలో గురువారం కొత్తగా మరో 18 మందికి వైరస్ నిర్ధారణ కాగా, ఒకరు చనిపోయారు. దీంతో తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 471కి చేరుకుంది. అలాగే మృతుల సంఖ్య 12 దాటింది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: