కరోనా వైరస్‌ని బూచిగా చూపి తెలుగు మీడియాలో జర్నలిస్టులు, ఇతర సిబ్బందిపై ‘వేటు’ జరుగుతోంది. వాస్త‌వంగా చూస్తే చాలా సంస్థ‌లు గ‌త కొద్ది రోజులుగా మీడియాలో ఉద్యోగుల‌ను ఎలా తొల‌గించుకోవాలా ? అని వెయిట్ చేస్తున్నాయి. ఇప్పుడు క‌రోనా వాళ్ల‌కు బూచీగా దొర‌క‌డంతో వాళ్లు అందివ‌చ్చిందే అవ‌కాశంగా తీసుకుని ఎంతో మంది ఉద్యోగుల‌పై వేటు వేస్తున్నారు. ఇక చిన్నా చిత‌కా పేప‌ర్ల సంగ‌తి ప‌క్క‌న పెడితే పెద్ద ప‌త్రిక‌ల్లో ఈనాడు ఎవ‌రిని అయినా తీసేస్తే వాళ్ల‌కు కాస్త ఉన్నంత‌లో మంచి ప్యాకేజీ ఇచ్చే ఆలోచ‌న చేస్తోంద‌ట‌. సాక్షిలో ఇప్ప‌టి వ‌ర‌కు అయితే ఎవ్వ‌రిని తీసే ప్ర‌య‌త్నాలు ఇంకా ప్రారంభం కాలేదు. 

 

ఇక అవ‌కాశం ఉన్న‌ప్పుడు గ‌ట్టిగా దండుకోవ‌డం.. ఇబ్బంది వ‌చ్చిన‌ప్పుడు పూర్తిగా చేతులు ఎత్తేసి ఉద్యోగుల‌ను బ‌లి చేయ‌డంలో ఆంధ్ర‌జ్యోతి ముందు ఉంటుంద‌న్న విమ‌ర్శ‌లు ఇప్పుడు స‌ర్వ‌త్రా వినిపిస్తున్నాయి. ఇప్పుడు మీడియా వ‌ర్గాల్లో ఇదే పెద్ద హైలెట్ అంశంగా మారింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆంధ్ర‌జ్యోతిలో ప్ర‌తి డెస్కుల్లోనూ దాదాపు 40-50 శాతం మంది ఉద్యోగుల‌ను తొలగించేస్తున్నారు. ఇక ఎడిష‌న్ ఇన్‌చార్జ్‌లు ఇదే అవ‌కాశాన్ని వాడుకుంటూ త‌మ‌కు అనుకూలంగా ఉండే వారిని ఉంచుతూ... మిగిలిన వారి పేర్లు మేనేజ్‌మెంట్‌కు ఇచ్చి వారిని తొల‌గించేలా చ‌క్రం తిప్పుతున్నారు. 

 

పైగా తొల‌గించిన ఉద్యోగుల‌కు ఉద్యోగుల ప్రావిడెండ్ ఫండ్ నుంచి న‌యా పైసా ఇవ్వ‌ట్లేద‌ట ఈ రాధాకృష్ణ‌. ఇక తీసేస్తోన్న వారికి ఓ రెండు నెల‌లు మాత్రం మీ జీతంలో కేవ‌లం 25 శాతం ఇస్తామ‌ని చెప్పి పంపేస్తున్నార‌ట‌. దీనిని బ‌ట్టి తెల్లారి లేస్తే చాలు త‌న పేప‌ర్‌, ఛానెల్లో గురివింద గింజ‌సామెత‌లు చెపుతూ.. తాను స‌మాజ సంస్క‌ర్త‌ను అనేలా ఆర్కే రాత‌లు ఉంటాయి. అయితే ఇప్పుడు ఆర్కే తాను త‌న ఉద్యోగుల విష‌యంలో వ్య‌వ‌హ‌రిస్తోన్న దారుణాన్ని కూడా త‌న కొత్త ప‌లుకుల్లోనూ.. త‌న మీడియాలోనూ రాసుకుంటే బాగుంటుంద‌ని కూడా కొంద‌రు చ‌మ‌త్క‌రిస్తున్నారు.

 

అలా చేయ‌ని ప‌క్షంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఆర్కే ప‌త్రిక‌ల్లో వ‌చ్చిన‌వి అభూత క‌ల్ప‌న‌లు.. అస‌త్యాలు.. చెత్త ప‌లుకులే అని కూడా వాళ్ల సంస్థ‌ల్లో ప‌నిచేసే ఉద్యోగులే విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇక తీసేసిన వాళ్ల ప‌రిస్థితి ఇలా ఉంటే.. ఉన్న వాళ్ల‌కు కూడా 25 - 50 శాతం వ‌ర‌కు జీతాల కోత‌లు త‌ప్ప‌డం లేద‌ట‌. 
కార‌ణాలు ఏవైనా టీడీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు ఆయ‌నకు ఎన్నో కోట్ల రూపాయ‌ల మేళ్లు జ‌రిగాయ‌న్న‌ది అంద‌రికి తెలిసిన విష‌య‌మే. ఇప్పుడు అదే ఆర్కే కేవ‌లం 20 రోజుల లాక్‌డౌన్‌కే త‌న స్వార్థం కోసం ఇలా ఉద్యోగుల‌ను పీకేసి... వాళ్ల కుటుంబాలు రోడ్డున ప‌డేలా చేయ‌డం స‌రికాద‌ని అంటున్నారు మీడియా మేథావులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: