దాయాది దేశం పాకిస్థాన్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి క‌రాళ‌నృత్యం చేస్తోంది. ఇప్ప‌టికే దాదాపుగా 16వేల మందికి పైగా విస్త‌రించింది. రోజూ కొన్ని వంద‌ల పాజిటివ్ కేసులు న‌మోదవుతున్నాయి. వాస్త‌వానికి భార‌త్‌లో క‌న్నా పాకిస్థాన్‌లో వైర‌స్ ఆల‌స్యంగా అడుగుపెట్టింది. కానీ పొరుగుదేశంలో వేగంగా విస్త‌రిస్తోంది.  కేవ‌లం ప‌దిరోజుల్లోనే పాకిస్థాన్‌లో ప‌రిస్థితులు మారిపోవ‌డం గ‌మ‌నార్హం. అయితే ప‌రిస్థితిని గ‌మ‌నించిన అక్క‌డి ప్ర‌భుత్వం లాక్‌డౌన్‌ను అమ‌ల్లోకి తెచ్చినా త‌మ స‌హ‌జ ధోర‌ణిని ప్రద‌ర్శిస్తూ  నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించ‌డం విశేషం. దీంతో ప్ర‌భుత్వం చేతులెత్తేసే ప‌రిస్థితులు క‌న‌బ‌డుతున్నాయి. 

 

అస‌లే ఆర్థిక ప‌రిస్థితి అంతంత‌మాత్రంగా ఉన్న పాకిస్థాన్‌కు క‌రోనా ఉరుములేని పిడుగులా ప‌రిణ‌మించింది.  అయితే ఒక్క చైనా మినహా ఇప్పుడు ఆసియా ఖండంలో మిత్ర‌దేశాలు లేవ‌నే చెప్పాలి. ఆదేశం ఉగ్ర‌వాదుల‌కు చోటు క‌ల్పిస్తోంద‌ని, ఉగ్ర‌వాదాన్ని ప్రొత్స‌హిస్తోంద‌ని భార‌త్ అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై పేర్కొన‌డంతో పాటు ఆధారాలు కూడా చూప‌గ‌లిగింది. దీంతో పాకిస్థాన్ దొంగ బుద్ధులు తెలుసుకున్న దేశాలు ద‌గ్గ‌రికి రానివ్వ‌డం లేదు. చేసిన అప్పుల‌కు క‌నీసం వ‌డ్డీ చెల్లించ‌లేని ప‌రిస్థితిలో ఉన్న పాకిస్థాన్‌కు కొత్త‌గా అప్పు పుట్టేలా  లేదు. క‌రోనా ముందు వ‌ర‌కైతే ఏదో ఒక దేశం ఇచ్చేదేమో కానీ ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో అన్నిదేశాలు సెల్ప్ డిఫెన్స్‌లోనే ఉన్నాయి.

 

ప్ర‌పంచ బ్యాంకు మాత్రం కొద్దిగా క‌రుణించింది. భార‌త్‌తో పాటు కొన్ని దేశాల‌కు స‌హ‌యం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే పాకిస్థాన్‌కు ద‌క్కింది కేవ‌లం రూ.250కోట్లే కావ‌డం గ‌మ‌నార్హం. అప్పుల కోసం అర్రులు చాచుకుని కూర్చున్న ఆ దేశానికి ఇప్పుడు ఆ మొత్తం హార‌తి క‌ర్పూరంలా క‌రిగిపోతుంద‌ని స‌మాచారం. గ‌త మూడు నాలుగు రోజులుగా చాలా ప్రాంతాల్లో ఆక‌లికేక‌లు విన‌బ‌డుతున్నాయి. ఇక వైద్య స‌దుపాయాల గురించి ఎంత త‌క్కువ మాట్లాడుకుంటే అంత మంచింది. అయితే త‌న చిర‌కాల స్నేహ‌దేశమైన డ్రాగ‌న్ కంట్రీ ఇండియాపై ఉన్న ప‌గ‌ను పెంచిపోషించేందుకు పాకిస్థాన్‌కు ఓ హాస్పిట‌ల్ నిర్మిస్తోంది. అయితే ఇది లాహోర్‌లో ఏర్పాటు చేశారు. వెయ్యి ప‌డ‌క‌ల‌తో క‌రోనా పేష‌ట్ల‌కు ప్ర‌త్యేక హాస్పిట‌ల్ ఏర్పాటు చేశారు. 

 

అయితే పాకిస్థాన్‌లో న‌మోద‌వుతున్న కేసుల‌కు ఉన్న వైద్య స‌దుపాయాల‌కు సంబంధం లేకుండా ఉంద‌ని వైద్య వ‌ర్గాలు ఆందోళ‌న చెందుతున్నాయ‌ట. అంత‌ర్జాతీయ సమాజం ఆదుకోకుంటే మాత్రం పాకిస్థాన్‌ను క‌రో్నా మ‌ట్టుబెట్ట‌డం ఖాయ‌మ‌ని ఆదేశ ప్ర‌జ‌లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇదిలా ఉండ‌గా మాజీ క్రికెట‌ర్ షోయాబ్ అక్త‌ర్ భార‌త్ వెంటిలేట‌ర్ల‌ను అంద‌జేయాల‌ని మూడు రోజులుగా వేడుకుంటున్న విష‌యం తెలిసిందే. ఏకంగా చేతులెత్తి మొక్కుతా అంటూ ఆయ‌న వీడియో సందేశం ఇప్పుడు అక్క‌డ నెల‌కొన్న ప‌రిస్థితుల‌కు అద్దం ప‌డుతున్నాయి.

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: