పాటకు కొత్త అర్థాలేవీ ఆపాదించ‌డం కుద‌ర‌ని ప‌ని
ఉన్న అర్థ సంపాతాల్లో స్ఫూర్తిని అందుకోవ‌డం ఒక విధి
చాలా కాలం వెన్నాడే పాట‌ల‌కు సంద‌ర్భ శుద్ధి ఉందో లేదో
కానీ ఈ పాట‌కు ఆ ల‌యకు ఆ గుణం ఉంది
క‌నుక రామ్ మిరియాల కంపోజ‌ర్ గా సింగ‌ర్ గా న‌చ్చేడు
రైట‌ర్ గానూ న‌చ్చేడు.. ఆయ‌న గోదావ‌రి తీరం నుంచి
భాగ్య న‌గ‌రి వ‌ర‌కూ.. ప్ర‌యాణించేడు.. ఆయ‌న‌తో పాటు
స్వ‌ర లాహిరి కూడా! అలాంటి స్ర‌వంతికి వంద‌నాలు చెల్లిస్తూ
రాస్తున్నానొక మార్నింగ్ రాగా

 

ఫ‌స్ట్ కాజ్ : ఒక విష వ‌ల‌యం చుట్టూ ఉన్న చోట వెల్లువెత్తిన పాటకు ప్ర‌తినిధిగా నిలిచిన రామ్ మిరియాల గురించి ఇంకా ఇంకొంద‌రి గురించి.. రాస్తూ రాస్తూ.. ఆ చౌర‌స్తా బ్యాండ్ ఏం చెబుతుందో వివ‌రిస్తా.. విస్త‌రిస్తా..

 

 

మాన‌వ జాతి మ‌నుగ‌డ‌లో ఇప్పుడున్నంత విషాదం ఇంత‌కుమునుపు లేదు అనుకోవ‌డమే త‌ప్పు! నువ్వే లోకం అనుకోవడం ఒప్పు! త‌ప్పొప్పుల తీరులో లోకం పోక‌డ‌ల్లో వ‌చ్చిన ప్ర‌తి మార్పూ ప‌ల్లె నుంచి న‌గ‌రం వ‌ర‌కూ పాదాల స‌ డిని ఏదో ఒక‌టి చేసి మార్చిపోతున్నాయి.. బ‌య‌ట పోలీసు నీ కోసం.. ఇంట్లో త‌ల్లీ తండ్రీ నీ కోసం.. ఇంకా ఇంకొంద‌రు నీ కోసం పాట‌లోనో తేనె ఊట‌లోనో నీ బ తుకు లేదా బందూకుల్లోనో బంద్ ల్లోనో నీ బ‌తుకు .. ఎలా ప్ర‌శ్న అయిపోతే నీవు జ‌వాబుగా మార‌గ‌లవు.. నిర్మానుష్య‌పు దారులా ఇవి! లేదా నీవే నిర్మా ణంను నిర్వాణంగా మార్చిన సంద‌ర్భ‌మా ఇది.. ఏమో ! నీకు నీవు ర‌క్ష! నీకు ఆ పాట ర‌క్ష! అలా విన్నానొక పాట.. చేయి చేయి క‌ల‌పకు అంటూ ఒక విధ్వం సాన్ని ఒక విల‌యాన్నీ హెచ్చ‌రిస్తూ సూత్రీక‌రిస్తూ సంకేతిస్తూ రాసిన పాట.. రాసిన వాడు రామ్ మిరియాల..ఆ త‌రువాత ఆ వైర‌స్ గురించి వ్యాప్తిలో ఉన్న పాట‌లేవీ న‌చ్చ‌నంత పాట... ఇప్పుడు చౌర‌స్తాకు కొత్త ఆనందాలు మిగిల్చిన పాట..లేదా జీవిత కాల జ్ఞాప‌కం పాట..

 

య‌శ్వంత్ నాగ్ ఎవరు
పోనీ రామ్
ఇంకా ఇంకొంద‌రు
ఒక్క పాట రామ్ రాశాడు
ఒక ర్యాప్ య‌శ్వంత్ పాడాడు
ఇప్పుడీ ట్రూప్ న‌యా జ‌మానాకో
కొత్త ఊపు ఇస్తోంది..
పాట‌గా క‌ద‌లిన సంద‌ర్భం
ఊరెళ్లిపోతే ఏమౌతుంది ఆనంద్ చెబుతాడు
ఆనంద్ తో పాటు ఇంకొంద‌రు ఆ హుక్ లైన్ తో ట్రావెల్ అవుతారు
ఏద‌యినా అలాంటి చోట న‌ల్ల‌మ‌ల అందాలా లేదా పాపికొండ‌ల అందాలా

 

ఏమౌతున్నాయి ప‌ల్లె లో లేని సోయ‌గం ఏదో ఒక‌టి ఈ బండ‌రాయి లాంటి న‌గ‌రం ఇచ్చిపోతోందా లేదా బండ‌రాళ్లే క‌రిగిపోయిన సంద‌ర్భంలో ఈ ప‌ల్లె ఒక రాయ‌ని చ‌రిత‌ను నిన్న‌టి గ‌తాన్ని ఇచ్చిపోతోందా! ఏ ఊరెళ్తారు.. ఏ తీరుంద‌ ని.. మీతో మీరూ మీలో మీరూ ఎలా ఉన్నారు వీటి నుంచి క‌డ‌దాకా మోసేంత క‌న్నీటి ఊట నుంచి ఏ ఊరెళ్దాం మామా అంటే ఏం చెబుతాం అక్కడ పున్నాగ పూలే లేవు.. కురిసేటి ఎన్నెలా లేదు.. క‌వి రాజై లేదు రాజుకు అంత సీన్ అం త‌క‌న్నా లేదు గుణ విశేష‌ణ సంబంధాలు ఏవీ లేవు.. వీటితో పాటు కొంత నిగ్ర‌ హం ఉంది అది న‌గరం నుంచి ప‌ల్లె వ‌ర‌కూ వ్యాప్తి కావాలి..లేదా ఏమ‌యినా త‌ ట్టుకోగ‌ల నిబ్బ‌రం ఉంటే ఉంటుంది అది మాత్ర‌మే పాట‌ల్లో ప‌ల్ల‌వించాలి చౌరస్తా గ్యాంగ్ ల‌చ్చుమ‌మ్మ‌తో ల‌డాయి పెడుతోంది..ఆ గ్యాంగ్ గోదావ‌రి ఇసుక తిన్నె ల‌ల్లో రాసి పోసిన న‌క్ష‌త్ర వార ఫ‌లాల తీరు ఏదీ న‌మ్మ‌కంగా లేవ‌ని చెబుతోంది.. అలాంటిచోట రామ్ మిరియాల ఇంకా ఇంకొందరు..

 

ఊరు పేరు ఒక విషాదం సంబంధం
అమ్మాయి ఒక విషాద సంబంధం
లేకుంటే నిషాదం అని అనుకుంటే అది కూడా
మాయ వైర‌స్ అన్న‌ది మాయ కాదు కాని
ఉన్న‌చోట ఉండ‌నీయ‌ని మాయ.. ఉంచ‌నీయ‌ని మాయ
పొగ మేఘాల‌తో వ‌చ్చే మాయ.. ధూళి మేఘావృతాల సంజెల ఆవృతం ఈ మాయ

 

క‌నుక ఈ గ్యాంగ్ తో మాట్లాడితే క‌నుక ఈ గ్యాంగ్ నుంచి ఏద‌యినా రాబ‌డితే గుబురు గెడ్డం తో కొన్ని గొంతుకల మాయ‌లు మా ర్మికం అని తోస్తాయి..చే తులెత్తి మొక్కేంత ప్ర‌తిభ.. భాగ్య‌న‌గ‌రి వీధుల‌కు ప‌రిచ‌యం అవుతున్న ప్ర‌తి భ.. ఇలాంటి ప్ర‌తిభ‌కు ఇ లాంటి చోట ఒక గుర్తింపు పొందే వేళ‌కు వందనాలు చెల్లించాలి.. ఇప్పుడు వీధి మాట్లాడుతుంది..రామ్ అండ్ గ్యాంగ్-చుట్టూ పెనవే సుకున్న విషాదం జీవిత‌కాలం కాద‌న్న స‌త్యం మాట్లాడుతుంది.. ఎర్ర కండువా మాట్లాడుతుంది.. ఇలాంటి చోటు ఒక‌టి ఆ హైద్రా బాద్ చౌర‌స్తా వెతికిందా అంటే ఔన‌నే చెప్పాలి.. అలాంటి చౌర‌స్తాలో నీవున్నావా అంటే ఔన‌నన్న‌ది ఓ నిర్థార‌ ణ‌గా అర‌వాలి.. క‌రోనా టైమ్స్.. క‌రోనా ట్యూన్స్ ఏంటో ఇవ‌న్నీ న‌వ్వుకుంటాను కానీ న‌వ్వుకు ఏడుపుల‌కు మ‌ధ్య నేనుంటాను..క‌విత్వం వ‌ద్దురా నా యనా! అదొక ద‌రిద్రం అంటూనే న‌వ్వుతాను..పాట ఎంతగా ప‌ల్ల‌వించిందో క‌దూ! అని చెప్పి న‌వ్వుతాను.. 

 

ఒక న‌వ్వు వ్యంగ్యం ఒక న‌వ్వు ప్ర‌శంసాపూర్వ‌కం ఒక విషా దం జీవితాంతం ఒక విషాదం వెన్నెలకు మాత్ర‌మే ప‌రిచ‌యం.. ఇవి వెన్నెల పో యిన రాత్రిళ్లు.. ఇవి రాళ్ల‌ను క‌రిగించిన వెన్నెల‌లు.. లేదా కాంతులను ధారా ద‌త్తం చేసిన రేయి కౌగిళ్లు.. లేదా కొన్ని చీక‌ట్ల కొన‌సాగింపులు.. ఇవి! మ‌న‌వి! మ‌ళ్లీ క‌రోనా పాట మ‌రో సారి వినండి .. రావొద్ద‌న్న జ‌బ్బు జీవితాల‌ను శాసిస్తోం ది.. రామ్ మిరియాల గొంతు కూడా అలా నే శాసిస్తోంది.. ఎలా ఉండాలో చెబు తోంది.. ఎలా ఉండ‌కూడదు అని కూడా నిర్దేశితం చేస్తుంది.. ఇలాంటి గొంతుక‌ లు ఇక్క‌డివి అక్క‌డివి.. గోదావ‌రి ప‌ల్లెవి ఈ పిఠాపురం లేదా ఆ తెలంగానం లే దా ఆ రెండూ క‌లిసిన సంద‌ర్భం అంతా క‌లిపి ఈ గొంతుక‌లకు కొత్త ఉత్సాహం ఏదో ఇచ్చి ఉంటారు..

 

ఇన్ని పాట‌లు వ‌చ్చాయి/ ఇన్ని శ‌బ్ద నాదాల వెల్లువలో కొట్టుకుపోయిన‌వి ముందు తేలిన‌వి వెనుక ముంచిన‌వి..ఎన్ని ఉన్నా యో! పాట‌లో కొట్టుకుపో వ‌డం అంటే ఎల్లువ‌లో ఎల్లువ‌లా క‌రిగిపోవ‌డం అని అర్థం /పాట‌లో కొట్టుకుపో యాక తీరాలు ఏవీ క‌నిపించ కపోవ డం..లేదా తీరానికి నీకూ మ‌ధ్య సంధి కు ద‌ర‌క‌పోవ‌డం.. ఇది న‌ది అంటే స్వ‌రం ఒప్పుకుంటుందా.. స‌ముద్రం అంటే స్వ‌ రం ముంచి పోతుందా.. అన్న ప్ర‌శ్న‌ల‌తో ఈ రోజు ఈ చౌర‌స్తా బ్యాండ్ ను ప‌రిచ‌ యం చేస్తున్నా..రాస్తున్నానొక మార్నింగ్ రాగా

 

ఇప్పుడు చెప్పిన విధంగానే
అర్థ స్ఫూర్తి వెత‌కండి
దేవుడు దెయ్యం వంటివి
ఈ వైరాల‌జీ నిషేధిస్తుంది
విజ్ఞానం వివేకం ఒక‌టి పెంపొందిస్తే
ఆ వివేకానికి కొన‌సాగింపుగా ఈ పాట
ఇంపుగానే పాట శ్ర‌వ‌ణ‌పేయం అని అంటారే అదే ఇది
లోకం నీవు..నీవే లోకం.. ఈ లోకాలు సంబంధిత దుఃఖాలు
దుఃఖం అనంత‌ర చింత‌న‌లు ఇవ‌న్నీ వ‌దిలిపోతే బాగుండు
అందాక మాయ.. స్వాతీ మాయ.. జ్యోతీ మాయ అంతా మాయ
ఆ పోరీ ఈ పోరీ ఆ వైర‌స్ ఈ సైర‌న్ అంతా మాయ..
ఇలాంటి చోట నేనున్నాను..రామ్ మిరియాల‌కు అభినంద‌న‌లు చెల్లిస్తూ
డియ‌ర్ చౌర‌స్తా నీకో కృత‌జ్ఞ‌త నీకో ధ‌న్య‌వాద

 

- ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి

 

https://www.youtube.com/watch?v=A_yacia8vrs

మరింత సమాచారం తెలుసుకోండి: