ప్రస్తుతం ప్రపంచ మానవాళి అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో చూస్తున్నాం. ఇప్పటికే లక్షలాది మంది ఈ వైరస్ బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా... అంతకంటే ఎక్కువ మంది ఈ వైరస్ సోకిందేమో అన్న అనుమానంతో క్వారంటెన్ లో ఉన్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడంతో మరణాలు కూడా రోజురోజుకు పెరుగుతూ వస్తుండటంతో, అందరిని ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతానికి ఈ వైరస్ మహమ్మారికి మందు ఏది కనిపెట్టకపోయినా, ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొన్ని రకాల మందుల ద్వారా దీనిని ఎదుర్కొనేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు. అయితే దీనికి పూర్తి స్థాయిలో విరుగుడు మందు ను కనిపెట్టే ప్రయత్నంలో అన్ని దేశాలు నిమగ్నం అయ్యాయి.

 

IHG

ఈ వైరస్ దాటికి ప్రపంచంలో అగ్రగామి దేశాలను అవుతున్నది అన్ని దేశాలు తీవ్ర ప్రభావానికి గురయ్యాయి. ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది. ఇప్పుడు ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు సామాజిక దూరం పాటించడం ఒకటే మార్గంగా కనిపిస్తుండడంతో ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నాయి. ఇక మనదేశంలోనూ ఈ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. ఇప్పటికే జనాలు రోడ్లమీదకు ఎవరూ రాకుండా, నిత్యం పోలీసులు పహారా కాస్తున్నారు.

 

IHG
ఇది ఇలా ఉంటే ... అసలు కరోనా వైరస్ ప్రస్తుతానికి భయాందోళనకు గురి చేస్తున్నా, ఇప్పుడు కాకపోతే మరి కొద్ది రోజుల్లోనైనా దీనిని మనం జయించే అవకాశం లేకపోలేదు.  దీనికి విరుగుడు మందుని కనిపెట్టే పనిలో ప్రపంచ దేశాలు నిమగ్నమయ్యాయి. అయితే అసలు ఈ కరోనా ప్రభావం తరువాత జనజీవనం ఏ విధంగా ఉంటుంది ..? ప్రభుత్వ వైఖరిలో ఏ విధమైన మార్పు వస్తుంది..? అసలు ప్రభుత్వాలు ఎలా పనిచేస్తాయి ? ప్రజలు కోలుకోవడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది ? ఇలా అనేక ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అసలు ప్రపంచ మానవాళికి ఇటువంటివి విపత్తులు ఎదుర్కోవడం కొత్తేమీ కాదు. ఇప్పటికే మనం పోలియో, కలరా, స్పానిష్ ఫ్లూ, ఇలా ఎన్నో మహమ్మారులను ధైర్యంగా ఎదుర్కొన్నాము. అదేవిధంగా కరోనా ను కూడా మరికొద్ది రోజుల్లో ఎదుర్కొనే అవకాశం లేకపోలదు. ఇదే మా ప్రపంచ దేశాలకు నమ్మకం ఉంది. కాకపోతే తక్కువ ప్రాణ నష్టంతో ఈ ఆపద నుండి బయట పడేందుకు ఇప్పుడు ఈ విధమైన కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు. ఇంకా ఎంత సమయంలో ఈ వైరస్ ను ఎదుర్కుంటాము అనేది ఖచ్చితంగా చెప్పలేకపోయినప్పటికీ, తప్పకుండా జయిస్తామనే ధీమా అందరిలోనూ కనిపిస్తోంది. అయితే ఇప్పుడున్న జనాలు ఎవరు గతంలో ఇటువంటి విపత్తును చూసి ఉండకపోవడంతో ఇంతగా ఆందోళన చెందుతున్నారు.

 


కరోనా తరువాత జీవితం ఎలా ఉండబోతోంది ?

 

కరోనా వైరస్ మహమ్మారి ని ఒకవేళ జయిస్తే, ఆ తరువాత పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది చాలా మందిలో తలెత్తుతున్న ప్రశ్న. ఇప్పటికే ఈ విషయంపై రకరకాల కథనాలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఎవరికి తోచిన విధంగా వారు ఈ విషయంపై రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వైరస్ ప్రభావం ముగిసిన తర్వాత జనాల్లో ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతుంది. ప్రస్తుతం లాక్ డౌన్ సమయంలో ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారో అవే  జాగ్రత్తలను ముందు ముందు చాలా వరకు పాటించే అవకాశం ఉంటుంది. ఇక సోషల్ డిస్టెన్స్ విషయానికి వస్తే, ప్రపంచ దేశాల్లో ఎలా ఉన్నా, మన దేశంలో పెద్దగా అది పాటించే అవకాశం తక్కువ. ఎందుకంటే మన దేశంలో ప్రజా రవాణా విషయంలో గాని, పట్టణాల్లో గాని ఉండే అరకొర సౌకర్యాల కారణంగా ఈ సోషల్ డిస్టెన్స్ ముందు ముందు కొనసాగించడం అనుమానమే. కాకపోతే ఈ విషయంలో జనాల్లో జాగ్రత్త పెరిగే అవకాశం ఉంది. ఇక ఎవరైనా కనిపిస్తే షాక్ హ్యాండ్ ఇచ్చే పద్ధతి కూడా తగ్గే అవకాశం లేకపోలేదు.

 

రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టే పద్ధతిని ఎక్కువ మంది జనాలు కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. అలాగే జనాలు అందరిలోనూ మునుపటి వలే కాకుండా అన్ని విషయాల్లోనూ జాగ్రత్తలు పెరుగుతాయి. అలాగే ప్రభుత్వాలు కూడా మునుపటి వలె దుబారా ఖర్చులు చేయకుండా, ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు వహిస్తూ, ప్రజా ఆరోగ్యం పై ఎక్కువ దృష్టి పెట్టి నిధుల కేటాయింపు చేసే అవకాశం కూడా ముందు ముందు ఉండే అవకాశం లేకపోలేదు. ఏది ఏమైనా ఈ వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అందరిలోనూ శుభ్రత, ఆరోగ్యం వంటి విషయాలపై శ్రద్ధ బాగా పెరిగి మునుపటి విధంగా విచ్చలవిడితనం తగ్గే అవకాశం అయితే లేకపోలేదు.మొత్తంగా చూస్తే కరోనా వైరస్ ప్రపంచానికి పెద్ద గుణపాఠం చెప్పడంతో పాటు ముందు ముందు ఇటువంటి విపత్తులు రాకుండా ఏ విధమైన వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని ప్రపంచ మానవాళికి తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: