క‌రోనా నియంత్ర‌ణ‌లో భార‌త్ గెలిచాయ‌ని ప్ర‌పంచంలోని చాలా దేశాలు అభినందిస్తున్నాయి. నిజానికి ఎంతోపెద్ద విశాల దేశం.. అదీ కూడా జ‌న‌సాంద్ర‌త ఎక్కువ‌గా ఉన్న భార‌త్‌ను లాక్‌డౌన్ పేరుతో ప్ర‌ధానిమోదీ చాలా వ‌ర‌కు ఏక‌తాటిపైకి తీసుకువ‌చ్చారు. క‌రోనాను ఎదుర్కొనేందుకు  చ‌ప్ప‌ట్లు కొట్ట‌డం, దీపాల వెలిగింపు ఐడియాల‌తో అవ‌గాహ‌న‌తో పాటు క‌రోనాపై పోరుకు కార్యోన్ముఖుల్ని చేశార‌నే చెప్పాలి. ప్ర‌జ‌ల్లో నెల‌కొన్న ప్రాణ‌భీతి...ప్ర‌భుత్వ క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లతో భార‌త్‌లో లాక్‌డౌన్ ఫుల్ స‌క్సెస్ అయంది. వ్యాధి నియంత్ర‌ణ‌లోనే ఉంద‌ని వైద్య నిపుణులు కూడా సూచిస్తున్నారు. అయితే ఇదంతా కాద‌న‌లేని నిజం..

 

కానీ భ‌విష్య‌త్ మాటేంటి..చైనాలో ఏం జ‌రుగుతోంది.. క‌రోనాపై ప‌ట్టు సాధించిన‌ట్టే సాధించి...చైనా మ‌ళ్లీ మ‌హ‌మ్మారి ప‌డ‌గ నీడ‌లోనే ఉన్న‌ట్లు క‌నిపిస్తున్న దృశ్యాల‌ను మ‌నం చూస్తున్నాం. భార‌త ప్ర‌భుత్వం ఇప్ప‌టి వ‌ర‌కు కూడా చైనా అనుస‌రించిన విధానాల‌నే అమ‌లు చేస్తూ వ‌స్తోంది. లాక్‌డౌన్‌తో పాటు కంటోన్మెట్ల ఏర్పాటు, సామాజిక దూరం పాటించ‌డం వంటి ప‌ద్ధ‌తులు చైనాలో అమ‌లు చేసిన‌వే. అయితే సైలెంట్ మోడ్‌లో ఉన్న మ‌హ‌మ్మారి చైనాను మెల్లిగా మ‌ళ్లీ క‌మ్మేస్తుంది. తాను ఇంకా చావ‌లేద‌న్న నిజాన్ని మెల్లిగా చాటిచెప్ప‌డం చైనాకు అర్థ‌మ‌య్యేలా చెబుతోంది. వాస్త‌వానికి గ‌త 20 రోజులు క్రితం నుంచి చైనాలో క్ర‌మంగా లాక్‌డౌన్ ఎత్తివేస్తూ వ‌స్తున్నారు. సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొంటున్నాయి. అయితే మ‌ళ్లీ కరోనా కేసులు న‌మోద‌వుతుండ‌టం అక్క‌డి ప్ర‌జ‌ల్లో ఆందోళ‌న క‌లిగిస్తోంది.

 

ఇప్పుడు భార‌త్‌లో క‌రోనా ఉధృత‌స్థాయిలో ఉంది.  ఆ త‌ర్వాత క్ర‌మంగా బ‌ల‌హీన‌ప‌డిపోతుంద‌న్న‌ది వైద్య‌నిపుణులు, కొంత‌మంది విశ్లేష‌కుల మాట‌. వాస్త‌వానికి అమెరికా కూడా ఈ అంచ‌నాతోనే కాస్త నిర్ల‌క్ష్యం ప్ర‌ద‌ర్శించింది. లాక్‌డౌన్‌ను కొన్ని రాష్ట్రాల్లో పాక్షికంగా అమ‌లు చేసిన ఫ‌లితంగా ఇప్పుడు భారీ మూల్యం చెల్లించుకుంటోంది. ఈ ప‌రిణామ నేప‌థ్యంలో భార‌త్‌లో ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ్డాయ‌ని లాక్‌డౌన్ ఎత్తివేస్తే మ‌ళ్లీ క‌రోనా వ్యాప్తి చెందుతుంద‌న్న అభిప్రాయాన్ని జ‌నాలు వ్య‌క్తం చేస్తున్నారు. ముఖ్యంగా విదేశీ విమాన స‌ర్వీసులను సుదీర్ఘ‌కాలం పాటు నిలిపివేసేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని కోరుతున్నారు. అలాగే ప్ర‌తీ వ్య‌క్తికి ఆరోగ్య ప‌రీక్ష‌లు..క‌రోనా టెస్టులు చేయ‌డం త‌ప్ప‌నిస‌రి చేయాల‌నే అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. క‌రోనా భ‌యాలు తొల‌గిపోవాలంటే ఈ చర్య‌ల‌కు ప్ర‌భుత్వం క‌చ్చితంగా ముందుకు రావాల‌ని కోరుతున్నారు.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: