బతికి ఉంటే బలుసాకు తినవచ్చు. ఆ దిక్కుమాలిన విదేశాలు ఎందుకు..? కష్టమైన నష్టమైనా ఇక్కడే బెటర్. ఎంతైనా భారతదేశం భారత దేశమే. దూరపు కొండలు నునుపు. ఇలా ఎన్నో ఎన్నెన్నో మాటలు ఇప్పుడు జనాలు మాట్లాడేస్తున్నారు. ఒకపుడు తమ పిల్లలు, బంధువులు, స్నేహితులు విదేశాల్లో చదువుతున్నారన్నా, ఉద్యోగాలు చేస్తున్నారన్న, ఎంతో గొప్పగా ఉండేది. అక్కడ వారికి ఎలా ఉన్నా ఇక్కడ మాత్రం వారి గురించి గొప్పగా చెప్పుకుంటారు. అసలు అమెరికాలో, యూరప్, ఇలాంటి దేశాల్లో ఎంతో మంది భారతీయులు సెటిల్ అయిపోయారు. అదే తమ దేశం అన్నట్టుగా వారు ఫీల్ అవుతుంటారు. అమెరికా వంటి పెద్ద దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారంటే గొప్పగా చెప్పుకునేవారు. ఇక పెళ్లి సంబంధాల విషయంలో అయితే అమెరికా, లండన్, ఇలా పెద్ద పెద్ద దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారికే మొదటి ప్రాధాన్యం ఇస్తూ పెళ్లిళ్లు చేసేవారు. పలుకుబడి, హోదా, సంపాదన, ఇలా దేనికి లోటు లేకపోవడంతో భారతదేశం నుంచి విదేశాలకు వెళ్లి సెటిల్ అవుతున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. 

IHG


ఇంత వరకు బాగానే ఉన్నా, ఇప్పుడు కరోనా వైరస్ మహమ్మారి మొత్తం తారుమారు చేసేసింది. అమెరికా వంటి దేశాల్లో ఇప్పుడు కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తుండడం, అక్కడ పరిస్థితి రోజు రోజుకి ఆందోళనకరంగా ఉండడం, మంచినీళ్ళకి, భోజనానికి కిలోమీటర్ల లైన్ లు ఉండడం అక్కడి పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఇప్పుడు ఫారిన్ అంటేనే ఆమ్మో అనే పరిస్థితిని తీసుకొచ్చింది.  ఇప్పుడు కరోనా దెబ్బకు డాలర్ రేటు పడిపోవడంతో విదేశం అంటేనే మొఖం మొత్తేసింది. అసలు ఇప్పటి వరకు విదేశీ మోజు పెరగడానికి కారణం. నాణ్యమైన విద్య, జీవనం, సంపాదన, మంచి భవిష్యత్తు. వీటి కారణంగానే విదేశీ మోజు ఎక్కువగా ఉండేది.

 


 తమ పిల్లలను చదివించే స్థోమత లేకపోయినా అప్పో సొప్పో చేసి మరీ విదేశాల్లో చదివించేవారిని మనం చాలామందినే చూసాము. తమ జీవితాలు ఎలాగు ఎదుగూబొదుగూ లేకుండా పోయాయి.మన పిల్లల భవిష్యత్తుకి అయినా బంగారు బాట వేయాలనే ఉద్దేశంతో చాలామంది తల్లితండ్రులు ఉండేవారు. కానీ ఇప్పుడు మొత్తం అటువంటి ఆలోచనలన్నీ చెరిగిపోయాయి. ఇప్పుడు అగ్ర రాజ్యాలుగా చెలామణి అవుతున్న దేశాల్లో కరోనా మరణ మృదంగం సృష్టిస్తుండడంతో పాటు, విదేశాల్లో లాక్ డౌన్ కారణంగా తెలుగువారు తినడానికి తిండి లేక, బతకడమే ఇబ్బందికరంగా ఉంది అన్నట్టుగా అనేక ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. కరోనాతో ఎక్కడ చచ్చిపోతారోనన్న భయం అక్కడ ఉన్నవారిని వెంటాడుతోంది. 


ఒకప్పుడు ఎంతో సురక్షితమైన అమెరికా, యూరప్ దేశాలు ఇప్పుడు కరోనాతో సురక్షితం కాదన్న భావన తల్లిదండ్రుల్లో వచ్చేసింది. భారత్ లో కరోనా నియంత్రణ లో ఉండడం తో మన దేశమే సురక్షితం అన్న ఆలోచన అందరిలోనూ కనిపిస్తోంది. ఇంతటి విపత్తు చుసిన తరువాత తల్లిదండ్రుల ఆలోచనల్లో భారీగా మార్పు కనిపిస్తోంది. దీనికి తోడు కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం ఏర్పడడంతో విదేశాల్లోనూ నిరుద్యోగ సమస్యలు తలెత్తబోతున్నాయి. మరో ఒకటి రెండు సంవత్సరాలు ఈ ప్రభావం కనిపిస్తుంది. దీంతో ఇప్పుడు విదేశం అనగానే అందరిలోనూ యావగింపు కలుగుతోంది. ఎందుకొచ్చిన తంటాలు మనదేశంలోనే ఏదో ఒకటి చేసుకుంటే బాగుంటుంది కానీ ఇలా నిత్యం భయం భయంగా బతుకి వెళ్లదీయడం, అది కూడా దేశం కానీ దేశంలో ఎందుకు పాట్లు అన్న వైరాగ్యం ఇప్పుడు విదేశీ మోజులో ఉన్న వారందరిలోనూ కనిపిస్తోంది. 

  

మరింత సమాచారం తెలుసుకోండి: