కరోనా వైరస్ దెబ్బకు  ప్రంపంచం ఎంతగా వణికిపోతోందో అందరూ చూసిందే. ఇపుడు ప్రపంచ దేశాల్లో వైరస్ ప్రభావం ఒక విధంగా ఉంటే అగ్రరాజ్యం అమెరికాలో తీవ్రత మాత్రం మరో రకంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా వైరస్ కేసులు సుమారు 17 లక్షలకు చేరుకుంది. అలాగే 1.10 లక్షల మరణాలు రికార్డయ్యింది. ఇదే విషయంలో అమెరికాను తీసుకుంటే బాధితుల సంఖ్య సుమారు 6 లక్షలకు చేరుకుంటే మరణాలు 22 వేల దిశగా పరుగెడుతోంది.

 

అగ్రరాజ్యంలో ప్రస్తుత వైరస్ ముప్పు లాంటిది గతంలో ఎన్నడూ ఏ రూపంలో కూడా ఎదుర్కోలేదన్నది వాస్తవం. న్యూయార్క్, న్యూజెర్సీ, కాలిఫోర్నియా, టెక్సాస్, లాస్ ఏంజిలీస్, వాషింగ్టన్ లాంటి అనేక రాష్ట్రాల్లో  బాధితుల సంఖ్య, మరణాల సంఖ్య ప్రతిరోజు పెరిగిపోతోంది. ప్రధానంగా న్యూయార్క్, న్యూజెర్సీలో పరిస్దితిలు మరింత దుర్భరంగా తయారైపోయింది.

 

ఈ పరిస్ధితులన్నింటినీ పరిశీలించిన ప్రపంచప్రముఖ దినపత్రికల్లో ఒకటైన న్యూయార్క్ టైమ్స్ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.  తన కథనంలో ట్రంప్ వైఖరిని ను దుమ్ము దులిపేసింది. ట్రంప్ నిర్లక్ష్యం,  మొండి వైఖరి వల్లే అమెరికాలో వైరస్ పెరిగిపోయిందంటూ తీవ్రమైన ఆరోపణలు చేసింది. వైరస్ ప్రభావాన్ని జనవరిలోనే నిపుణులు ట్రంప్ ను హెచ్చరించినా పట్టించుకోలేదని చెప్పింది. వైరస్ తీవ్రత పెరిగిపోవటానికి ప్రధాన కారణంగా లాక్ డౌన్ అమలు చేయకపోవటమే అంటూ వాయించేసింది.

 

వైరస్ వ్యాప్తి జరగకుండా ముందుగానే లాక్ డౌన్ ప్రకటించమని నిపుణులు ఎంత చెప్పినా ట్రంప్ వినని వైనాన్ని ఎత్తిచూపింది.  ఆర్ధిక వ్యవహారాలకు ప్రాధాన్యత ఇచ్చిన ట్రంప్ మనుషుల ప్రాణాలకు విలువ ఇవ్వకపోవటం ఏమిటని నిలదీసింది.  చైనాలో వైరస్ తీవ్రత పెరిగిన పోయిన సమయంలో కూడా  చైనాతో పాటు యూరోపు దేశాల నుండి కూడా అమెరికాకు యధేచ్చగా విమానాల రాకపోకలు జరిగిన విషయాన్ని న్యూయార్క్ టైమ్స్ గుర్తుచేసింది.

 

గడచిన నెలలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రతను ఎత్తిచూపుతూ దీనికంతటికీ  అధ్యక్షుడు ట్రంప్ వైఖరే  కారణమంటూ దుమ్ము దులిపేసింది. సరే న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని ట్రంప్ ఎందుకు అంగీకరిస్తాడు ? కాబట్టి సహజంగానే తీవ్రంగా ఖండించాడు. పేపర్లో వచ్చిన కథనమంతా ఉత్త చెత్తగా కొట్టిపారేశాడు. అమెరికా ప్రస్తుత పరిస్ధితికి చాలామంది ట్రంప్ వైఖరే కారణమని అనుకుంటున్న మాటనే న్యూయార్క్ టైమ్స్ కూడా కథనం ఇచ్చినట్లుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: