ఎలక్షన్ కమీషన్ మాజీ కమీషనర్  నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసులో సత్తా లేదా ? ఇపుడిదే అంశపై చర్చలు జరుగుతున్నాయి. తనను రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా అర్ధాంతరంగా తొలగించటంపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై నిమ్మగడ్డ హై కోర్టులో కేసు వేశారు. సరే ఈయన కాకుండా మరో ఐదుగురు కూడా కేసులు వేసినా అవేమంతా చెప్పుకోతగ్గవి కావులేండి. అయితే సోమవారం కేసును పరిశీలించిన తర్వాత విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఎప్పుడైతే కేసు విచారణను కోర్టు వాయిదా వేసిందో వెంటనే నిమ్మగడ్డ వేసిన కేసులో పసలేదనే ప్రచారం మొదలైపోయింది.

 

ఐదేళ్ళ కాలపరిమితిని కుదించటం రాజ్యాంగ విరుద్ధమని నిమ్మగడ్డ వాదిస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా స్ధానికసంస్ధల ఎన్నికలను వాయిదా వేయటంతోనే ప్రభుత్వం తనపై కక్ష కట్టిందని నిమ్మగడ్డ తన పిటీషన్లో ఆరోపించారు. నిజానికి నిమ్మగడ్డ ఆరోపణల్లోనే పసలేదని ఎప్పుడో తేలిపోయింది. ఎందుకంటే వైరస్ తీవ్రంగా ఉందని ఎన్నికల వాయిదాను  నిమ్మగడ్డ ప్రకటించినపుడు రాష్ట్రంలో నెల్లూరులో ఒక్క కేసు తప్ప మరో కేసే లేదు.

 

పైగా ఎన్నికలను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకునే ముందు రాష్ట్రప్రభుత్వంతో మాట్లాడాలన్న కనీస ప్రొసీజర్ ను కూడా నిమ్మగడ్డ పాటించలేదు.  పైగా ప్రతిపక్షాలైన టిడిపి, సిపిఐ నేతలు మాట్లాడిన వెంటనే  ఎన్నికల వాయిదాను ప్రకటించేశారన్న విషయం బయటపడింది. అందుకనే చంద్రబాబునాయుడు చెప్పినట్లుగానే నిమ్మగడ్డ నడుచుకుంటున్నారనే ఆరోపణలకు బలం చేకూరింది.  సరే ఇక పదవీకాలాన్ని కుదించటం, అందుకు ఆర్డినెన్స్ తీసుకురావటం పూర్తిగా ప్రభుత్వానికున్న అధికారం ప్రకారమే జరిగింది.

 

ఇక్కడ గమనించాల్సిందేమంటే ప్రభుత్వ  అధికారాలను ఎవరు ప్రశ్నించేందుకు లేదు. ఒకవేళ ప్రభుత్వం తప్పుచేసిందని అనుకుంటే ఆ విషయం కోర్టు మాత్రమే తేల్చాలి. విచిత్రమేమిటంటే ఇటు నిమ్మగడ్డ అటు ప్రభుత్వం కూడా తమ చర్యలను తాము సమర్ధించుకుంటున్నాయి. నిమ్మగడ్డకు మద్దతుగా టిడిపి కూడా కోర్టులో కేసు వేసినా చేయగలిగేది కూడా ఏమీ లేదన్న విషయం అందరికీ తెలిసిందే.  జగన్మోహన్ రెడ్డి మీద గుడ్డి వ్యతిరేకతతోనే నిమ్మగడ్డ ఇష్యూని టిడిపి భుజనా వేసుకుంది. పైగా నిమ్మగడ్డను గబ్బు పట్టించింది కూడా చంద్రబాబే కదా.

 

మొత్తానికి నిమ్మగడ్డ వ్యవహారం బాగా వివాదస్పదమైంది. కేసులో పసలేకపోయినా మద్దతుగా చంద్రబాబు, బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, సిపిఐ కార్యదర్శి రామకృష్ణ, పచ్చమీడియా యావత్తు నిమ్మగడ్డకు నైతిక మద్దతుగా నిలబడ్డాయి. అంటే జగన్ ఒకవైపు మెజారిటి మీడియా, ప్రతిపక్షాలంతా ఒకవైపు నిలబడ్డాయన్న విషయం తెలిసిపోయింది. మరి సోమవారం కోర్టు విచారణలో విషయం తేలిపోతుందా లేకపోతే మళ్ళీ విచారణ పడుతుందా అన్నది చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: