ఆహా నాని అన్న వచ్చేసాడు ... సౌండ్ పెంచు ...! ఏంటో చెబుతున్నాడు... అది నాని అన్న డైలాగు అంటే... ఒరేయ్ కొడాలి నాని మాట్లాడుతున్నాడ్రా టీవీలో అంటూ సౌండ్ పెంచి మరీ జనాలు టీవీల్లో, సెల్ ఫోన్ లో యూట్యూబ్ ఓపెన్ చేసి మరీ ప్రసంగం మొత్తం ఆసక్తిగా విన్నారు. మళ్ళీ మళ్ళీ యూట్యూబ్ లో ఓపెన్ చేసి చూస్తున్నారు. కొడాలి నాని అంటే తెలుగు రాష్ట్రాల్లో అంత  క్రేజ్ ఉంది. ఆయన పంచ్ డైలాగులకు అంతమంది అభిమానులు ఉన్నారు.  జగన్ మంత్రివర్గం లో ఉన్న ఏ మంత్రికి లేనంత క్రేజ్ కొడాలి నాని సొంతం. ఏ విషయాన్ని అయినా సూటిగా, సుత్తి లేకుండా చెప్పగలగడం కొడాలి నాని సొంతం. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబుని టార్గెట్ చేసుకుంటూ కొడాలి నాని విసిరే పంచ్ డైలాగులకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా, అధికారంలో ఉండగా చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేసుకుని విమర్శలు చేయడంలో నాని ముందు ఉంటారు. 

IHG


వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అనవసర రాద్ధాంతం చేస్తూ, సీఎం జగన్, ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి విమర్శలు చేస్తున్న చంద్రబాబు,లోకేష్, మిగతా టీడీపీ నాయకులను టార్గెట్ చేసుకుంటూ కొడాలి నాని పేల్చే డైలాగులకు ఏపీ ప్రజలందరి నుంచి మంచి రెస్పాన్స్ ఉంటుంది. సోషల్ మీడియాలోనూ నిత్యం నాని పంచ్ డైలాగులు  హల్ చల్ చేస్తూ ఉంటాయి. అయితే కొద్ది రోజులుగా వైసీపీ ప్రభుత్వంపైనా, జగన్ పైనా పెద్ద ఎత్తున విమర్శలు టీడీపీ నాయకులు చేస్తున్నా నాని ఎక్కడా రియాక్ట్ కాలేదు. పూర్తిగా సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు. దీంతో కమ్మ సామజిక వర్గానికి చెందిన నాని టీడీపీలో ఉన్న కమ్మ సామజిక వర్గ నేతలనే టార్గెట్ చేసుకుంటున్నారని, ఆ విధంగా జగన్ నాని తో విమర్శలు చేయిస్తున్నారని వాదనలు విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఇక నాని మళ్ళీ విమర్శలు చేసే అవకాశం లేదనే ప్రచారం జరుగుతోంది.  

 


కానీ ఆ ప్రచారం అంతా ఉత్తిదే అన్నట్టుగా మళ్ళీ ఈ రోజు కొడాలి నాని లైన్ లో కి వచ్చారు. మీడియా సమావేశంలో యధావిధిగా చంద్రబాబు, లోకేష్, మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్, దేవినేని ఉమా ఇలా అందరి పైనా నాని పంచ్ డైలాగులు పేల్చారు. ఇప్పుడు ఈ కరోనా పరిస్థితుల్లో చంద్రబాబు ఉండి ఉంటే... గౌనులు వేసుకుని కరోనా నెగిటివ్ పేషంట్లను మంచాలపై పడుకోబెట్టి పాజిటివ్ వచ్చినట్టుగా నాటకాలాడి వారిని నిమురుతున్నట్టుగా ఫోజులు ఇచ్చి ఉండేవారని, మిగతా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు సలహాలు ఇస్తున్నట్టుగా ఫోటోలకు ఫోజులు ఇచ్చి ఉండేవాడని,  దానికి ఆయన పచ్చ మీడియా విపరీతమైన ప్రచారం కల్పించేది అంటూ నాని ఎద్దేవా చేశారు. దేవినేని ఉమాను ఉద్దేశించి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు నాని. 

 

IHG

ఇక కమ్మ సామజిక వర్గాన్ని నాని తిట్టబోరు అనే ప్రచారాన్ని కొట్టిపారేసేలా నాని ఇప్పుడు అదే సామాజికవర్గానికి చెందిన టీడీపీ నాయకులందరినీ తనదైన శైలిలో విరుచుకుపడడంతో మళ్ళీ నాని లైన్ లోకి వచ్చేసాడు. ఇక కాస్కోండి తమ్ముళ్లూ అంటూ సోషల్ మీడియాలో వైసీపీ అభిమానులు పోస్ట్ లు పెడుతున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న టీడీపీ నాయకులు ఇప్పుడు నాని లైన్ లోకి రావడంతో దాదాపు షాక్ తింటున్నారు. ఇక టీడీపీ చేసే రాజకీయ విమర్శలకు నాని పంచ్ డైలాగులు రేపటి నుంచి మీడియాలో హైలెట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: