క‌రోనా ఎఫెక్ట్‌తో న‌భూతో..న భ‌విష్య‌త్ అన్న‌రీతిలో భార‌త్ బంద్ కొన‌సాగుతోంది. లాక్‌డౌన్ పాటించాల‌ని ప్ర‌ధానిమోదీ ఇచ్చిన పిలుపున‌కు దేశంలోని 137కోట్ల జ‌నాలు అద్భుతంగా పాటిస్తున్నారు. ప్ర‌తీ ఊరు..వాడ‌వాడ‌నా కరోనా క‌ర్ఫ్యూ కొన‌సాగుతోంది. వ్య‌వ‌స్థ‌ల‌న్నీ స్తంభించిపోయాయి. నిత్య‌వ‌సరాల‌కు..అత్య‌వ‌సరాల‌కు త‌ప్పా మ‌నుషులు రోడ్డెక్క‌డం లేదు.క‌రోనాపై ఇంటి నుంచే అద్భుత పోరాటం సాగిస్తున్నారు. క‌రోనా అనుమానితం అన్న మాట విన్న వైద్య విభాగాలు అక్క‌డ వాలిపోతున్నాయి. క‌ష్ట‌కాలంలో స్వ‌చ్ఛంద సంస్థ‌లు త‌మ క‌ర్త‌వ్యాన్ని నెర‌వేరుస్తున్నాయి. ఉరుములేని పిడిగులా వ‌చ్చిప‌డిన క‌రోనా పెను తుఫానును ఎదుర్కొనేందుకు భార‌తీయ స‌మాజం త‌న అన్ని శ‌క్తుల‌ను కూడగ‌ట్టుకుని కంటికి క‌నిపించ‌ని క‌రోనా మ‌హ‌మ్మారిపై వీర పోరాటం చేస్తోంది. 

 

చాప‌కింద నీరులా...పాకి దొంగ‌దెబ్బ‌తీస్తూ...రోజురోజుకు త‌న బ‌లాన్ని పెంచుకుంటూ పోతున్న క‌రోనా ర‌క్క‌సిని దేశ ప్ర‌జ‌లు అంతే మొండిగా ఎదుర్కొంటున్నారు. క‌రోనాను అంతం చేసేందుకు అంద‌రూ కంక‌ణ‌బ‌ద్దుల‌య్యారు. వ్యాపారాల్లేవు... దుకాణాల్లేవ్‌..బ‌డులు లేవు..ప‌రీక్ష‌లు అంత‌క‌న్నా లేవు... ఉపాధి మాట లేదు..ఉద్యోగం పోతుందన్న రందీ లేదు..ఉన్న‌ద‌ల్లా ఒక్క‌టే ల‌క్ష్యం ప్రాణం కాపాడుకోవ‌డం...క‌రోనా వైరస్ నుంచి కుటుంబాలను ర‌క్షించుకోవ‌డం..స‌మాజాన్ని పెను ప్ర‌మాదం నుంచి త‌ప్పించడం..ఇదే భార‌త‌వ‌ని ముందున్న అతిపెద్ద గోల్ ఇప్పుడు. ప్ర‌ధాని మోదీ ఇచ్చిన లాక్‌డౌన్ పిలుపున‌కు దేశ ప్ర‌జ‌ల నుంచి ప్ర‌పంచ‌మే విస్తుపోయేలా త‌మ ఐక్య‌త‌ను చాటారు... చాటుతున్నారు. 

 

ప్ర‌పంచంలోనే అతిపెద్ద ప్ర‌జాస్వామిక దేశం భార‌త్‌.. వైశ్య‌ల్యంలో ఏడ‌వ‌స్థానంలో ఉంది. జ‌నాభాలో 137కోట్ల జ‌నాభాతో రెండోస్థానంలో ఉంది. ఇలాంటి దేశంలో ఒక్క‌రోజు బంద్ కొన‌సాగించ‌డం అంటేనే మాటలు కాదు..కానీ ప్ర‌ధానిమోదీ, ఆయా రాష్ట్రాల ప్ర‌భుత్వాలు క‌ట్టుదిట్టంగా లాక్‌డౌన్ అమ‌లుకు తీసుకుంటున్న చ‌ర్య‌లు..ప్ర‌జ‌ల్లో పెరిగిన అవగాహ‌న, ప్రాణ‌భ‌యం క‌లిపి భార‌త్‌లో న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న రీతిలో లాక్‌డౌన్ కొన‌సాగుతోంది. మే 3వ‌ర‌కు లాక్‌డౌన్ కొన‌సాగుతుంద‌న్న ప్ర‌ధాని మోదీ మాట‌ల‌పై కించిత్ కూడా నిర‌స‌న స్వ‌రం లేక‌పోవ‌డం నిజంగా గొప్ప విష‌య‌మేన‌ని చెప్పాలి. అగ్ర‌రాజ్యాలు సాధించ‌లేని, ముందు చూపు ధోర‌ణితో క‌రోనాను నిలువ‌రించిన ఘ‌న‌త భార‌త్ సొంత‌మ‌వుతోంది. ఈ గండం నుంచే బ‌య‌ట‌ప‌డితే ఇక దేశానికి అన్ని మంచి రోజులేన‌ని భావిద్దాం.. జై హింద్‌..!!

 

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: