ధారావి... ఈ ప్రాంతానికి కొత్తగా పరిచయం అవసరం ఉండదు బహుశా. ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద మురికివాడల్లో (స్లమ్) ఒకటి, ఏషియాలోనే నెంబర్ 1 అనిపించుకున్న స్లమ్ ఇదే.  ముంబాయ్ లో ఉన్న ఈ స్లమ్ ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వణికించేస్తోంది. ఎందుకంటే కోరానా వైరస్ వ్యాప్తితో  మహారాష్ట్ర ప్రభుత్వం నానా అవస్తలు పడుతోంది. అగ్రరాజ్యం అమెరికాలో న్యూయార్క్ లో ఎన్ని కేసులున్నాయో ఇండియా మొత్తం మీద మహారాష్ట్ర కేసుల విషయంలో అలాగే దూసుకుపోతోంది.

 

దేశంలో రికార్డయిన  మొత్తం పదివేల కేసుల్లో మహారాష్ట్రలోనే సుమారు 2 వేల కేసులు నమోదయ్యాయి. ఇందులో కూడా దాదాపు 115 మంది వైరస్ కారణంగానే మరణించారు. నమోదైన 2 వేల కేసుల్లో ధారావి స్లమ్ లోనే సుమారు 70 కేసులు బయటపడ్డాయి. వీళ్ళల్లో కూడా ఓ ఐదుమంది మరణించారు. నిజానికి మహారాష్ట్రలో మొదటి నుండి కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంది. మొదట్లో ఓ మాదిరి పెరుగుదల ఉన్న ఈ రాష్ట్రంలో ఢిల్లీలోని మర్కజ్ మసీదు ప్రార్ధనల పుణ్యమా అని ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరిగిపోయింది.

 

సరే ఈ కేసులను ఏదోలా మ్యానేజ్ చేస్తున్నారులే అనుకుంటే హఠాత్తుగా ధారావిలో కేసులు బయటపడటం మొదలైంది. అంటే ధారావిలో కరోనా వైరస్ సోకటం చాలా ఆలస్యంగా మొదలైందనే చెప్పాలి. ఇక్కడ గనుక వైరస్ సోకటం మొదలైతే ఆపటం కష్టమని ప్రభుత్వాలు భయపడుతునే ఉన్నాయి. ఎందుకంటే ఈ స్లమ్ లో సుమారు 15 లక్షల మంది ఉంటున్నారు. కొత్తవాళ్ళు ఈ స్లమ్ లోకి అడుగుపెడితే బయటపడే దారి కూడా వెతుక్కోలేరు. అలాంటి ఈ స్లమ్ లో  ఇద్దరికి వైరస్  అంటుకుందంటే ఆపటం కష్టమే. అందుకనే ప్రభుత్వం ధారావిపై ప్రత్యేక దృష్టి పెట్టినా ఉపయోగం లేకపోయింది.

 

ఇక్కడ జనాల్లో ఎవరికో వైరస్ సోకటమే కాకుండా మరికొందరికి కూడా అంటించింది.  మెల్లిగా ఒకరి నుండి ఒకరికి పాకుతు ఇప్పటికి సుమారు 70 మందికి సోకింది. చివరకు  ఈ కేసులు ఎక్కడిదాకా వెళుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. అందుకనే రెండు కేసులు బయటపడగానే మొత్తం ధారావిని బయట ప్రపంచంతో సంబంధాలను ప్రభుత్వం కట్ చేసేసింది. ధారావికి బయటప్రపంచంతో రాకపోకలు కట్ అయినా అప్పటికే వైరస్ సోకటంతో ఒకరి నుండి మరొకరికి పాకుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: