కరోనా వైరస్ ను ప్రపంచదేశాలకన్నింటికీ అంటించిన చైనా పై మొదటి చావుదెబ్బ పడబోతోందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం చెప్పుకోవాలి. ఎలాగంటే కరోనా వైరస్ దెబ్బకు చైనాలో ఉన్న అమెరికా, జపాన్ పరిశ్రమలన్నీ తరలిపోతున్నాయి.  వివిధ కారణాలతో చైనాలో ఉన్న పరిశ్రమలను తిరిగి తమ దేశాలకు తిరిగి పిలిపించేయాలంటు  అమెరికా, జపాన్ ప్రభుత్వాలు నిర్ణయించాయి.

 

కరోనా వైరస్ చైనాను ఒక విధంగా దెబ్బ కొడితే పరిశ్రమలు తరలింపు విషయం మరో రకంగా చావుదెబ్బ కొడుతోందనే చెప్పాలి. ఈ పరిణామాలను చైనా ప్రభుత్వం ఏమాత్రం ఊహించలేదనే అనుకోవాలి. నిజానికి చైనా పారిశ్రామికంగా ప్రపంచంలోనే అత్యంత ప్రధాన దేశంగా పాపులర్ అయ్యిందంటే అందుకు ఆ దేశంలోని పరిశ్రమలే ప్రధాన కారణం. అయితే చైనా పారిశ్రామికంగా ఇంత వేగంగా ఎలా అభివృద్ధి జరిగిందంటే అందుకు జపాన్, అమెరికాలే ముఖ్య కారణమని చెప్పాలి.

 

చైనాలోని వూహాన్ నగరం కూడా పరిశ్రమలకు ప్రధాన కేంద్రంగా చాలా తొందరగా ఎదిగింది. ఐటి, ఉత్పత్తి, సేవలు, పర్యాటకం, ఆటోమొబైల్ రంగాల్లో వూహాన్ చాలా తొందరగా డెవలప్ అయ్యిందంటే అందుకు అమెరికా, జపాన్ దేశాలే కారణం.  హఠాత్తుగా చైనాలోని జపాన్, అమెరికా పరిశ్రమలు వెనక్కు తెప్పించేయాలన్న నిర్ణయానికి ప్రధాన కారణాలు మాత్రం స్పష్టంగా బయటకు రాలేదు. ఈ విషయంలో అమెరికా కన్నా జపాన్ స్పీడుగా ఉంది.

 

చైనాలోని తమ పరిశ్రమలను వెనక్కు పిలిపించేయటానికి జపాన్  ప్రధానమంత్రి అబె నిర్ణయించారు. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేయటానికి ముందస్తుగా రూ. 15 వేల కోట్లు కేటాయించినట్లు అబె చెప్పారు. తిరిగి దేశానికి వచ్చేసే విషయంలో ఆయా పరిశ్రమల ప్రధాన కార్యాలయాలకు ఆదేశాలు కూడా ఇచ్చినట్లు ప్రధానమంత్రి చెప్పారు. అంటే వీలైనంత తొందరలోనే చైనాలోని జపాన్ పరిశ్రమలు వెనక్కు వెళ్ళిపోవటం ఖాయమనే అర్ధమైపోతోంది.

 

ఇదే దారిలో అమెరికా కూడా అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. జపాన్ లాగ ముందస్తు ఏర్పాట్లు చేయటానికి నిధులు కేటాయించింది లేంది మాత్రం తెలియటం లేదు. ఒకవేళ పై రెండు దేశాలకు చెందిన పరిశ్రమలు గనుక తరలి వెళ్ళిపోతే చైనాలోని పారిశ్రామిక రంగం పేక మేడల్లాగ కుప్ప కూలిపోవటం ఖాయమనే చెప్పాలి. చైనాలో వూహాన్ తో పాటు బీజింగ్, షాంఘై తదితర నగరాలు కూడా పారిశ్రామిక నగరాలుగా బాగా పాపులరయ్యాయి. అక్కడున్న జపాన్, అమెరికా పరిశ్రమలు కూడా వెనక్కు వెళ్ళిపోతే చైనా పారిశ్రామిక రంగమే కాదు ఆర్ధికరంగం కూడా బాగా దెబ్బతింటునటంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: