క‌రోనా విల‌య తాండ‌వంతో విరుచుకుప‌డుతోంది. సెక‌ను చొప్పున శ‌వాల కుప్ప‌లు ప‌డుతున్నాయ్‌...కాంతి వేగంతో మాన‌వాళిని క‌బ‌ళిస్తోంది. చ‌డీచ‌ప్పుడు లేకుండా మ‌ట్టుబెట్టేస్తోంది. క‌రోనా వినాశానికి ప్ర‌పంచ‌మంతా క‌న్నీరు పెడుతోంది. ఏదేశంలో చూసినా చావు కేక‌లే...ఆదుకోండి అన్న ఆర్త‌నాదాలే...క‌రోనా దెబ్బ‌కు ప్ర‌పంచ‌మే ప్రాణాల‌ను అర‌చేతిలో పెట్టుకుని బ‌తుకుతోంది. నిముషాల వ్య‌వ‌ధిలోనే వంద‌ల ప్రాణాల‌ను బ‌లికోరుతోంది. సెక‌ను స‌మ‌యంలోనే వంద‌లాదిమందికి విస్త‌రిస్తోంది.క‌రోనా ముందు మాన‌వాళి గ‌జ‌గ‌జ వ‌ణికిపోతోంది. మొత్తంగా ప్ర‌పంచం వ్యాప్తంగా క‌రోనా కేసులు 20ల‌క్ష‌ల‌కు అత్యంత చేరువ‌లో ఉండ‌టం గ‌మ‌నార్హం. మ‌ర‌ణాల రేటు శాతం కూడా రోజురోజుకు పెరుగుతూ మాన‌వాళికి కంటి మీద కునుకులేకుండా చేస్తోంది.

IHG

క‌రోనా ప్రాణాల‌ను తీయ‌డ‌మే బ‌తికున్న వాళ్ల‌ను కూడా చాత‌గానివాళ్లుగా మారుస్తోంది. క‌రువు కాట‌కాల‌ను సృష్టిస్తోంది. ఐరాపాలోని కొన్ని  దేశాల్లో కోట్ల కొలాది ఆస్తులున్న వారు కూడా కాసిన్ని మంచినీళ్ల కోసం బ‌తిమిలాడుతున్నారు...కాస్త బ్రెడ్డు ముక్క‌కోసం ఆశ‌ప‌డుతున్నారు. మ‌నుష్య‌ల మధ్య వ్యాధి ల‌క్ష‌ణాల‌ను అంత‌రం పెంచితే భ‌యం సొంత వారిని కూడా ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌డం లేదు. మాస్కుల‌తో  ముసుగేసుకుని బ‌తుకీడుస్తున్నారు.ఎన్నాళ్లీ బ‌తుకు..ఎన్నేళ్లు ఈ న‌ర‌కం..ఎప్పుడు వీడుతుంది మ‌న‌ల్ని ఈ క‌ష్టం.. అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు దొర‌క‌డం ఇప్ప‌ట్లో క‌ష్ట‌మే.  క‌రోనా మాన‌వాళిలో ల‌క్ష‌ల కొద్దీ మార్పులు తెచ్చింది. బ‌తుకుంటే బ‌లుసాకు  తినైనా బ‌త‌క‌వ‌చ్చు అన్న‌ది ఇప్పుడు స‌గ‌టు మాన‌వుడి ఆలోచ‌న‌. అంత‌కు మించిన పెద్ద ఆలోచ‌న‌లు లేవు ఇప్పుడు ఎవ‌రిలో.

IHG

ప్ర‌పంచ జ‌నాలు పాటించాల్సిన ఎన్నో విష‌యాల‌ను క‌రోనా క‌ఠినంగా నేర్పుతోంద‌నే చెప్పాలి. ప‌రిశుభ్ర‌త‌కు ఇవ్వాల్సిన ప్రాధాన్యాన్ని, వైద్య ప‌రిశోధ‌న‌ల‌పై పెర‌గాల్సిన కృషిని, ఆరోగ్యంపై దృష్టి పెట్టాల‌ని, అన‌వ‌స‌ర‌మైతే త‌ప్పా మ‌రో మ‌నిషిని తాక‌రాద‌ని ఇలా చాలా విష‌యాల‌ను బోధిస్తోంది. 20ల‌క్ష‌ల పాజిటివ్ కేసుల న‌మోదుకు ఆయా దేశాలు తీసుకున్న త‌ప్పుడు నిర్ణ‌యాలే ఎక్కువ వ్యాధి వ్యాప్తి చెంద‌డానికి కార‌ణ‌మ‌య్యాయ‌నే వాద‌న వినిపిస్తోంది. ఏం కాదులే అని నిర్ల‌క్ష్యం చేస్తే ఏం చేస్తానో ఇప్పుడు క‌రోనా అంద‌రికీ అర్థ‌మ‌య్యేలా చెబుతోంది. బ‌తికి బ‌ట్ట‌క‌ట్టినా భ‌విష్య‌త్‌లో ఏ మ‌హ‌మ్మారి పేరు విన్న ఎంత జాగ్ర‌త్త‌గా ఉండాలో కూడా కాస్త గ‌ట్టిగానే అర్థ‌మ‌య్యేలా, గుర్తుకు ఉండేలా మాన‌వాళికి బుద్ధి చెబుతోంది.

IHG's what ...

 ప్ర‌ధానిమోదీ చెప్పిన‌ట్లుగా క‌రోనాక‌న్నా ఈ ప్ర‌పంచానికి పెద్ద శ‌త్రువు ఎవ‌రూ లేరు. ఆమాట కోస్తే స‌మ‌స్త జీవ‌రాశికి కూడా. కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుతో ఈ ప్ర‌పంచం జ‌నం  అంతులేని ర‌ణం సాగిస్తోంది. పోరాటం ఆపితే.. కాస్త నిర్ల‌క్ష్యం చేస్తే  ఏం చేస్తానో అమెరికాలో చేసి చూపుతోంది ఈ మ‌హ‌మ్మారి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 19,47,860 మంది క‌రోనా బారిన ప‌డ్డారు. 1,21,793మంది మృత్యువాత ప‌డ్డారు. అమెరికాలో ఇప్పటివరకు 5,85,402 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క మంగళవారం రోజే 1526 కేసులు నమోదు కావడం గమనార్హం.  

IHG

అమెరికాలో ఇప్పటివరకు 23711 మంది చ‌నిపోయారు. ఒక్క మంగళవారం రోజే 71 మంది చనిపోయారు. ఇక స్పెయిన్ విషయానికి వస్తే 1,72,541 మంది వ్యాధి బారినపడగా 18,056మంది మృత్యువాత ప‌డ్డారు.  ఇటలీలో 159,516 కేసులు న‌మోదుకాగా 20,465 మంది చ‌నిపోయారు.  అలాగే ఫ్రాన్స్ లో 1,36, 779 మంది వైర‌స్ బారిన ప‌డ‌గా ఇప్పటివరకు 14,865 మంది చనిపోయారు. అలాగే బ్రిటన్లో 93, 873 మంది కరోనా బారిన ప‌డ‌గా 12,107 మంది చ‌నిపోయారు. ఇక ఇండియా విషయానికి వస్తే 10వేల మందికి పైగా  వైర‌స్ బారిన ప‌డ‌గా 350 మంది చనిపోయినట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. 

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: