ఒక్కసారి ఏడాది.. సరిగ్గా ఏడాది కాలచక్రంలో వెనక్కి వెళ్లి .. అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు మోడీపై ఎంతగా విరుచుకుపడ్డారో గుర్తు తెచ్చుకోండి.. మోడీని ఎంతగా తిట్టారు.. ఏపీ ద్రోహి అన్నారు. దేశ ద్రోహి అన్నారు. మోడీ, కేసీఆర్, జగన్ ముగ్గురు కుమ్మక్కై ఆంధ్రప్రదేశ్ ను నాశనం చేయాలని కంకణం కట్టుకున్నారన్నారు.. అంతేనా అక్కడితో ఆగారా.. మోడీ పర్సనల్ లైఫ్‌లోకి వెళ్లి మరీ తిట్టారు. మోడీ బాధ్యత లేకుండా భార్యను వదిలేశారన్నారు.. ఇంకా చాలా చాలా తిట్టారు.

 

 

సరిగ్గా ఒక్క ఏడాది తర్వాత.. అదే మోడీతో ఒక్క ఫోన్ కాల్ కోసం అదే చంద్రబాబు తహతహలాడిపోయారు. దేశంలో అందరి నాయకులతో మాట్లాడిన మోడీ తనతో ఎందుకు మాట్లాడలేదని తెగ బాధపడిపోయారు. కరోనా పరిస్థితుల్లో అందరు రాజకీయ నాయకులతో మోడీ మాట్లాడి సలహాలు తీసుకున్నారు. సాధారణంగా 40 ఏళ్ల సీనియార్టీ ఉన్న చంద్రబాబుతోనూ మోడీ మాట్లాడాలి ఉండాల్సింది. కానీ ఆయన మాట్లాడలేదు.

 

 

అలాంటి సమయంలో తనను విస్మరించినందుకు చంద్రబాబుకు కోపం రావాలి. తెలిసీ తనని అవమానించినందుకు రోషపడాలి. కానీ చంద్రబాబు ఈ విషయంలో పూర్తిగా ఆత్మగౌరవం వదిలేసినట్టు కనిపిస్తోంది. ఆయనే స్వయంగా ప్రధానమంత్రి ఆఫీసుకు ఫోన్ చేసి.. నేను మోడీగారితో మాట్లాడాలి.. ప్లీస్..ఎలాగైనా ఓ కాల్ ఎరేంజ్ చేయండి అని బతిమాలుకునే పరిస్థితికి ఎందుకు వచ్చారో.. ఆయనకే తెలియాలి.

 

 

ఎట్టకేలకు మోడీ చంద్రబాబును కరుణించారట. మంగళవారం ఉదయం 8 గంటలకు మోడీ ఫోన్ చేశారట.. ఆ విషయం కూడా చంద్రబాబే చెప్పారు. తన జన్మ ధన్యమైనంత ఆనందపడటం చూస్తే.. ఒకప్పుడు దేశంలో ప్రధానమంత్రులను నియమించిన చంద్రబాబు క్రమంగా ఎంతగా ప్రతిష్ట కోల్పోయారో.. ఆత్మాభిమానం కోల్పోయారో అర్థమవుతుందంటున్నారు విశ్లేషకులు. చంద్రబాబు రాజకీయంలో అపర చాణక్యుడు అని చెబుతారు. కానీ మరీ ఇంతగా స్వాభిమానం చంపుకునే చాణక్యుడా అని జనం ఆశ్చర్యపోతున్నారు.. హేమిటో..?

మరింత సమాచారం తెలుసుకోండి: