ప్ర‌జ‌ల‌కు-ప్ర‌భుత్వానికి, ప్ర‌జ‌ల‌కు-నాయ‌కుల‌కు, ప్ర‌భుత్వాల‌కు-స‌మాజానికి వార‌ధిగా ఉంటూ.. త‌న మూడోనేత్రంతో ప‌రిస్థితుల ను ప‌రిశీలిస్తూ..ప్ర‌జ‌ల‌కు అనుక్ష‌ణం.. సేవ‌లందిస్తున్న జ‌ర్న‌లిస్టుల జీవితాలు.. నేడు క‌రోనా క‌న్నా ఘోరంగా భ‌యం గొలుపుతు న్నాయి. క‌రోనా ఎఫెక్ట్ ఎలా ఉంది? ప‌్ర‌బుత్వం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంది?  లాక్‌డౌన్ కొన‌సాగిస్తారా?  మ‌న ఏరియాలో లాక్‌డౌన్ రిలాక్సేష‌న్ స‌మ‌యం ఎప్ప‌టి నుంచి ఎప్ప‌టి వ‌ర‌కు?  ప్ర‌భుత్వం మ‌న‌కు ఏం చేస్తోంది? క‌రోనా పోరులో ఎవ‌రెవ‌రు ఉన్నారు?  పోలీసులు అతి చేస్తున్నారు ఎవ‌రికి చెప్పాలి? ఇలాంటి అనేక ప్ర‌శ్న‌ల‌కు ఏకైక స‌మాధానం మీడియా. ప్ర‌తి ఒక్క‌రూ మీడియా ద్వారానే అనేక విష‌యాలు తెలుసుకుంటున్నారు.

 

మ‌రి ఆ మీడియాలో నిరంత‌రం ప‌నిచేస్తూ.. ఈ క‌ష్ట క‌రోనా కాలంలోనూ ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తున్న జ‌ర్న‌లిస్టుల జీవితాలు ఎలా ఉన్నాయి?  ఈ క‌ష్ట కాలంలో ప్ర‌జ‌లకు మేలు చేసే అనేక కార్య‌క్ర‌మాలు రూపొందిస్తున్న, స‌మాచారాన్ని సేక‌రిస్తున్న జ‌ర్న‌లిస్టు లు హ్యాపీగానే ఉన్నారా? అంటే వారు రెండు ర‌కాల స‌మస్య‌ల‌తో అల్లాడిపోతున్నారు. ఒక‌ర‌కంగా చెప్పాలంటే.. క‌రోనా కాటు సాధార‌ణ ప్ర‌జ‌ల‌ను భౌతికంగా భ‌య‌పెడుతుంటే.. జ‌ర్న‌లిస్టుల‌ను వృత్తిరీత్యా, భౌతిక రీత్యా కూడా క‌కావిక‌లం చేస్తోంది. వారు ఫీల్డ్‌లో తిరుగుతుంటే.. క‌నీసం మాస్కులు ఇచ్చేవారు, శానిటైజ‌ర్ ఇచ్చేవారు కూడా క‌రువ‌య్యారు. ఇక‌, అడుగడుగునా పోలీసులు ఆంక్ష‌లు పెడుతున్నా.. స‌ర్దుకుపోతున్నారు.

 

అయితే, ఇప్పుడు పైన చెప్పుకొన్న‌ట్టు రెండు ప్ర‌ధాన స‌మ‌స్య‌లు జ‌ర్న‌లిస్టుల జీవితాను చివురుటాకులు చేశాయి. వీటిలో కీల‌క మైంది. మీడియా సంస్థ‌లు పాత్రికేయుల‌ను లాక్‌డౌన్ పేరుతో భారీ ఎత్తున తొల‌గించేశాయి. దీంతో వారంతా వీధిన ప‌డ్డారు. తెలుగు మీడియాలో సైతం మ‌హామ‌హా మీడియా సంస్థ‌లు సైతం నిర్దాక్షిణ్యంగా వీరిని తీసేస్తుండ‌డంతో చాలా మంది జ‌ర్న‌లిస్టుల కుటుంబాలు రోడ్డున ప‌డుతున్నాయి. ఇక‌, ఉన్న కొద్దిపాటి పాత్రికేయుల కు సంబంధించిన జీతాల్లో ప్ర‌తి సంస్థా 25 శాతం చొప్పున వేత‌నాల్లో కోత పెట్టింది. 

 

అదే స‌మ‌యంలో డిజిట‌ల్ మీడియాలో ప‌నిచేస్తున్న పాత్రికేయుల‌ను పూర్తిగా ఇంటికి పంపించారు. ఆఫీసుల్లోనూ క‌నీసం క‌రోనా జాగ్ర‌త్త‌లు పాటించ‌డం లేదు. మాస్కులు మీరు కొనుక్కోలేరా? అనే స‌మాధానాలే సంస్థ‌ల నుంచి వ‌స్తున్నాయి. ఇలా జ‌ర్న‌లిస్టుల జీవితాలు అరిటాకుపై నీటి బొట్లు మాదిరిగా మారిపోయాయ‌నే విష‌యం స‌ర్వ‌త్రా క‌ల‌క‌లం రేపుతోంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: