కొంద‌రు ఆడాళ్ల నుంచి పొందిన ఏకాంతం
కొంద‌రు ఏమీ ఇవ్వ‌క‌పోయినా ఇచ్చినంత స్వేచ్ఛ‌ను
ఆస్వాదించ‌డం.. జీవితాల‌కు పరుషం ఏమ‌యినా ఉంటే
అది నిర్గ‌మ‌గా మార‌డం.. లేదా సాంధ్య తీరాల‌కు
కొత్త దారిని నిర్వ‌చించి చూప‌డం
యోగం అంటే ద‌క్క‌డం అన్న మాట త‌ప్పుగా తోచింది
యోగం అంటే కోల్పోవ‌డం
స్త్రీని కోల్పోయాక దుఃఖం ద‌క్క‌డం యోగం
సుఖ యోగం సుఖ ప్రావ‌స్థ అన్న‌వి త‌ప్పులు
ప‌నికి మాలిన రాత‌లు వీటి గురించి మాట్లాడి
ఉన్న చోట విస్త‌ర‌ణ‌కు నోచుకోని కొన్ని సైద్ధాంతిక‌ల‌ను
తాత్విక‌త‌ల‌ను అర్థం చేసుకోకుండా ఉంటాయి
క‌నుక ద‌రిద్రం అంటే ఏక‌మ్ లేదు అనేక‌మ్ లో ఉంది
అనేకాన్ని కుదించిన వాడిలో ఉంది
ఆ రాయిలో దాగుండిపోయిన నిస్వ‌రంలో ఉంది లేదా నిద్రాణంలో ఉంది

 

ఒక్క‌డే పురుషుడు
ఐతే రాముడంత లేదా ఇంకొక‌రికి అంద‌నంత
అనేకంగా ఈ స్త్రీలు
మ‌హళ్ల‌లో .. మ‌హా ద్వీపాల‌లో
జాగ్ర‌త్త ఆమె విడిచిపోయిన వెలుగు
ఆమె వెంట న‌డ‌చిన చీక‌టి వీటి నిష్ప‌త్తి
ఎంత ఉన్నా నీవు నిష్ఫ‌లం అయినాకే
వాటి విలువ తెలియ‌వ‌స్తుంది

 

పురుషః... అనంతం
ఏక‌మ్ .. అనంతం
ఏక‌మ్ పురుషః వీటిని అనంత‌ర అనంతాలు అని అనండి
అనేక రూపాల్లో ఈ మ‌గువ‌ల కోరిక‌ల్లో చిక్కుకున్న జ్ఞానంలో
వెలుగు పొడ సూప‌క పోయినా ఏం కాదు అన్న నిజం ఒక‌టి తేలాక
ఈ చీక‌టి బాగుంది అని నిర్థార‌ణ‌ను పొందాక ఎప్పుడ‌యినా ఈ ఏకం
ఉత్పాతం కావొచ్చు పురుషః అన్నాను క‌దా క‌నుక వెన్నంటే
కార‌ణం ఒక‌టి నిబ్బ‌రంగా చెప్పొచ్చు,.. కానీ చెప్ప‌ను..
ముందున్న కాలంలోబోలెడు మంది మ‌గువ‌లను ప‌రిచ‌యం చేశాక ఏక‌మ్ ఏంట‌న్న‌ది చెప్పి పోతాను..

 


............దీన‌ర్థం నుంచి దీని తాత్ప‌ర్యం నుంచి రావాల్సినంత పేరు మోసుకుపోవాల్సినంత పేరు ఇంకా రావాల‌ని కోరుకోవ‌డం లేదు.ఒక‌టి ఒక‌టిగానే ఉంటూ ఆత్మ విమ‌ర్శ‌కు శుద్ధ‌త‌ను ఆపాదించ‌క ఏదో చేయ‌డం ఏదో అవ్వ‌డం నీ దేహంలో రాల్చిన స్వేద జ‌లాల సంక‌లితాల‌ను ఏమ‌యినా ఒక చోట చేర్చ‌డం ఇవ‌న్నీ ఏక‌మ్ కాదు అనేక‌మ్ గా నే తోచి విరిచి న‌న్నో నీడలా మార్చేయి.. శ‌రీరాన్ని కోరుకోవ‌డంతో ప్రేమ విభేదం అన్న‌వి మొద‌ల‌వుతాయి అప్పుడు తార‌సిల్లిన ఈ దేహ రూపాన్ని నేను తాక‌డం త‌న‌లో లీన‌మ‌వ్వ‌డం అన్న‌ది అన్నీ ఏక‌మ్ ఎలా అవుతాయి.. ఏక‌మ్ అంటే ఒక్క‌టి కావ‌డం లేదా ఒక్క‌టిగా ఉండండి.. అని చెప్పిపోవ‌డం..

 


కొన్ని మ‌రిచిపోవాల‌ని చేసిన ప్ర‌య‌త్నాల్లో నిరాశ‌ల‌ను హాయిగా ప్రేమించాలి...ఒక్క‌సారి కూడా హృద‌యానికి ఇలాంటి ప‌రిభాష‌ను అల‌వ‌ర్చ‌కుంటే ఇక‌పై మ‌నం రాసేవి చేసేవి ఆ అమ్మాయి వ‌ర‌కూ చేర‌కుంటే బాగుంటుంది. బాగున్న‌వ‌న్నీ ఏక‌మ్ లో ఉండ‌వు.. ఉన్న‌వన్నీ ఏక‌మ్ తో ఉండ‌వు.. బాగుండ‌డం అంటే ఇప్పుడు త‌న అందం నుంచి దేహం నుంచి పొందిన‌వి ఏక‌రువు పెట్టి న‌లుగు రిలో క‌విత్వం రాయ‌డం. లేదా క‌విత్వం నుంచి ఏద‌యినా పిండుకుని లేదా జుర్రుకుని ఆ తేనెల ప‌దాల‌ను త‌న‌కు కానుక‌గా ఇచ్చి మిగిలిన కాలం చాల‌దు ఈ చేదునూ ఆ తీపిని భ‌రించేందుకు అని చెప్పిపోవ‌డం. హాయిగా ప్రేమ అంటే ఏం లేదు హాయిగా చావుతో స‌మానంగా ఉండ‌డం. మీరు ఇలాంటి చావుల‌ను ఆహ్వానిస్తే కొత్త కొత్తవ‌న్నీ ప‌రిచ‌యం అవుతాయి.

 

ఊపిరికి ఇదివ‌ర‌కటి ప‌రిచ‌యం అయిన ప్రేమ‌ను దేహం నుంచి వెలివేయ‌డం కుద‌ర‌ని ప‌ని.. చ‌దివేవి అర్థ‌గ‌తాలు చూసేవి రూప‌గతాలు ఏమ‌యినా చెడిందో రాత్రి మిగ‌ల్చిన కొన్ని కోరిక‌ల‌కు ఉద‌యం చెల్లింపులు కుద‌ర‌ని ప‌ని..గ‌దిలో ఒంట‌రిగా ఉన్న చోట ఊహాపాతాల ఉలిక్కిపాటు అనేకం. స్త్రీ అనేకం.. కాదు అక్క‌డి నుంచి పిలిచిన లేదా సంభోదించిన శబ్ద నాద త‌రంగం.. దేహం నుంచి పొందిన‌వి ఇక‌పై ఉలిక్కిపాటులో పొందిన‌వి ఏమ‌యినా నిక్షిప్తం కావాలి.. జ్ఞాపకం నుంచి జ్ఞాప‌కం వ‌ర‌కూ నిక్షిప్తం కావాలి..

 

నేను ఆమెను చూశాక
క‌లిశాక ఇదివ‌ర‌కు ఆమె న‌వ్వుల‌తో పోల్చాక
విడిపోయిన కాలాలకు కోరిక‌లు తోడు ఇచ్చి పోయాక
ఇప్పుడు ఆమె నా ద‌గ్గ‌ర ఏదో దాయాల‌ని చూస్తోంది
ప్రేమ స్వాభిమానాల‌ను త‌న‌కు కానుక‌లుగా తీసుకుని
బ‌దులుగా ఏమ‌యినా మౌనాల‌ను ఇచ్చి వీటిని కోరిక‌ల‌కూ
ఊహ‌ల‌కూ తోడుగా చేయండని ఆదేశిస్తూ పోతే
నేను మాత్రం ఇంకా ఆ కోరిక‌లా క‌రిగిపోయాను లేదా దేహంపై
మౌనంలా వాలిపోయాను.. కనుక లిఖిత రూప మౌనం
వెల్ల‌డిలో ఉన్నంత మోహం ఇంకా కావాలి.. లేదా ఇదే స‌రిపోతుంద‌న్న స్పృహ ఒక‌టి కావాలి

 

ఒంట‌రిగా గ‌దుల్లో ఉండే ఆడాళ్ల‌కు ఏమ‌యినా కొన్ని ఊహ‌లు తోడు తెచ్చిన సాహిత్యం ఎక్క‌డా లేదు..లేక‌పోవ‌డం హాయి..క‌విత్వం..క‌థ అన్న‌వి ఈ స్పృహతో లేక‌పోవ‌డం హాయి..రేయి నుంచి పొంద‌డం అన్న‌ది ఏద‌యినా ఉంటే ఒక్క‌సారి తాక‌ట్టుగా మార్చిన దేహాన్ని వెన‌క్కు తీసుకునేంత స్వేచ్ఛ‌ను పొంద‌డం మ‌గువకు కావాల్సిన అవ‌స‌రం.. ద‌క్కాల్సిన హ‌క్కు..

 

స్వేచ్ఛ హ‌క్కు
అన్న‌వి విభిన్నంగా ఉంటాయి
హ‌క్కు నా శ‌రీరం
స్వేచ్ఛ నా శ్వాస
దుర్గమం అనిపించిన దేహంలో
దాగుండిన జ్ఞాప‌కం నిన్న విసిరిపోయిన కాలంలో
క‌రిగిపోయిన క‌న్నీటి సంజె.. అందుకే రాత‌లో
చేత‌నను తోడు తెచ్చి పెట్టుకోవ‌డం త‌ప్పు ప‌ని
ప‌నికిమాలిన ర‌చ‌యితలు క‌వులూ ఇలాంటిలాంటి ప‌నులు చేస్తారు
ఏక‌మ్ పురుషః గ‌ది నుంచి హృది నుంచి వీస్తున్న స‌వ్వ‌డుల నుంచి
మోయాల్సిన మౌన‌పు నిశ్వాస‌ల నుంచి...

 

- ధ‌ను అండ్లూరి రేఖ‌ల‌తో

 

ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి

 

వ‌చ‌న వ‌ర్ఛ‌స్సుతో

మరింత సమాచారం తెలుసుకోండి: