చంద్రబాబే ప్రధాని ఆఫీస్ కి ఫోన్ చేశాడా ... ? లేక ప్రధాని కరోనా మీద కంగారు పడి చంద్రబాబు సలహాలు తీసుకునేందుకు ఫోన్ చేశాడా ..? అసలు ఎవరు ఎవరికి ఎందుకు ఫోన్ చేసుకున్నారో తెలియదు కానీ, టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం, ఈ విషయాన్ని గొప్పగా చెప్పుకునేందుకు ప్రయత్నిస్తూ ఉండటం ఇప్పుడు హాస్యాస్పదంగా మారింది. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే విషయంలో దేశవ్యాప్తంగా మోదీ అనేకమంది అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. అందులో భాగంగా చంద్రబాబు కి మోదీ ఫోన్ చేసి ఉండవచ్చు. చేయకపోయి ఉండవచ్చు. చంద్రబాబుకు నిజంగానే మోదీ ఫోన్ చేశాడా లేక చంద్రబాబు ఫోన్ చేసినట్టుగా చెప్పుకుంటున్నాడు అనే చర్చ కూడా తీవ్ర స్థాయిలో రేగుతోంది. గతం కంటే ఇప్పుడు చంద్రబాబు లో ఎక్కడలేని ఆనందం కనిపిస్తోంది. గతంలో చంద్రబాబు మోదీని ఉద్దేశించి ఏ స్థాయిలో విమర్శలు చేశారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మోదీ వివాహ జీవితం దగ్గర నుంచి అన్ని విషయాల పైన చంద్రబాబు మోదీని తిట్టిపోశారు. 

 

అసలు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం తెలుగుదేశం పార్టీ చేసిన చారిత్రాత్మక తప్పిదం అని కూడా చంద్రబాబు గతం లో ఎన్నోసార్లు బాధపడ్డారు. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా ఎన్నికల బరిలోకి  వెళ్ళడం, ఘోరంగా ఓటమి చెందడంతో ఇప్పుడు పార్టీ పరిస్థితి దారుణం గా తయారయ్యింది. తెలుగుదేశం పార్టీ మళ్లీ రాజకీయంగా బలం పుంజుకోవాలంటే  జాతీయ పార్టీ అయిన బిజెపి మద్దతు వుండాలనే విషయం బాబుకి బాగా ఆలస్యంగా తెలుసుకునట్టు  కనిపిస్తోంది. అందుకే చాలా కాలంగా బిజెపికి దగ్గరయ్యేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు బాబు. అయినా మోదీ నుంచి సరైన స్పందన కూడా కనిపించడం లేదు. అయినా పట్టు విడవకుండా బాబు బిజెపితో దోస్తీ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. గతంలో తాను తిట్టిన తిట్ల సంగతి మొత్తం మర్చిపోయి మరీ  బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు పడుతున్న తంటాలు అన్నీ ఇన్నీ కాదు. 

 


ప్రస్తుతం కరోనాని అడ్డంపెట్టుకుని ప్రధాని చంద్రబాబు కు ఫోన్ చేసినట్లు, చంద్రబాబు ఆనందంగా చెబుతుండడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.  ఒకవేళ నిజంగానే చంద్రబాబు మోడీ తో మాట్లాడి ఉంటే టీడీపీ అనుకూల మీడియా లో మరుక్షణమే బ్రేకింగ్ న్యూస్ లు వచ్చి ఉండేవి. అయితే ఆ హడావుడి ప్రస్తుతం ఎక్కడా కనిపించలేదు. అయినా బాబు మాత్రం తాను  ప్రధానితో మాట్లాడినట్లు తనకు తానే స్వయంగా చెప్పుకున్నారు. ఒకప్పుడు మోడీ చంద్రబాబు మధ్య జరిగిన విషయాన్ని కూడా మర్చిపోయి ఒక ఫోన్ కాల్ మోదీ నుంచి వచ్చింది అంటూ చంద్రబాబు చిన్నపిల్లాడు ఐస్ కొంటే ఏ విధంగా సంబరపడతాడో అదేవిధంగా సంబరపడుతున్నారు. 

 

బాబు తీరుని ఇప్పుడు జనాలతో పాటు తెలుగుదేశం నాయకులు సైతం తప్పు పడుతున్నారు. బాబు కి వయస్సు పెరిగే కొద్దీ చిన్నపిల్లాడి లక్షణాలు వస్తున్నాయి అంటూ పలువురు పదే పదే కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ మోదికి బాబు కరోనని కంట్రోల్ చేసే సీక్రెట్ చెప్పి ఉంటే అదేంటో బహిరంగంగానే బాబు గారు ప్రకటిస్తే మంచిది కదా అంటూ కొంతమంది సోషల్ మీడియాలో బాబు ని ట్రోల్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: