బీజేపీ మిత్ర‌ధ‌ర్మం  విస్మ‌రిస్తోందా..? క‌ల‌సి న‌డుస్తున్న వారికి క‌నీస గౌర‌వం ఇవ్వ‌డం లేదా..? త తాములు విమ‌ర్శించేనోళ్ల‌ను ప‌క్క‌నేసుకుని...గౌర‌వించి మ‌రీ పాల‌న‌లో, అతిముఖ్య‌మైన నిర్ణ‌యాల్లో  స‌ల‌హాలు, సూచ‌న‌లు పొందుతున్న జాతీయ పార్టీకి అండ‌గా ఉంటున్న పార్టీలను ఎందుకంత అలుసుగా చూస్తోంది. ఇది కావాల‌ని చేస్తోందా..? లేక అలాఅలా జ‌రిగిపోతోందా..? అంటే మాత్రం మొద‌టిదే క‌రెక్ట్ అయి ఉంటుందేమో అన్న అనుమానాల‌నే ఎక్కువ‌మంది  రాజ‌కీయ విశ్లేష‌కులు త‌మ అభిప్రాయాన్ని వెల్ల‌డిస్తున్నారు. ఇలాంటి అభిప్రాయం విశ్లేష‌కులు పేర్కొన‌డానికి చాలా కార‌ణాలు కూడా చూపుతున్నారు. 

 

బీజేపీ గ‌త చ‌రిత్ర‌ను ముందు పెడుతూనే మోదీ షా ద్వ‌యం గురించి నొక్కి వ‌క్కాణిస్తున్నారు. అవ‌స‌ర‌మున్న‌ప్పుడు ఒక‌లెక్క‌..అవ‌స‌రం తీరాకా మ‌రోలెక్క అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌డం ఆ ఇద్ద‌రు క‌మ‌లం యోధుల‌కు అలవాటేన‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ఇందుకు ఎవ‌రినో కాదు..తెలుగు రాష్ట్రంలోని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌నే ఉదాహ‌ర‌ణ‌గా చూపుతున్నారు. క‌ల‌సి న‌డుస్తామ‌ని వ‌చ్చిన జ‌న‌సేనానిపై క‌మ‌లం గుర్తు పార్టీ నాయ‌కులు క‌నీస గౌర‌వం ఇవ్వ‌డం లేద‌ని జ‌న‌సేన పార్టీ శ్రేణుల్లో ఇప్పుడు కాస్త కినుక‌భావం ఉంది. వాస్త‌వానికి క‌రోనా వైర‌స్ ఉధృతమైన నేప‌థ్యంలో లాక్‌డౌన్ అమ‌లు చేస్తున్న ప్ర‌ధాన‌మంత్రి మోదీ దేశంలోని అన్ని పార్టీల నేత‌ల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా మాట్లాడారు.  

 

అలాగే బిన్న వ‌ర్గాల‌కు చెందిన ప్ర‌ముఖుల‌తో కూడా ఆయ‌న సంభాషించి స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకున్నారు. అయితే ఎన్‌డీఏలో భాగ‌స్వాములుగా ఉన్న వారి స‌ల‌హాలు, సూచ‌న‌ల‌ను మాట‌మాత్రంగానైనా కోర‌క‌పోవ‌డం స‌గ‌టు రాజ‌కీయ నాయ‌కుల‌ను ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ఇలాంటి స‌మ‌యంలోనే మాకు వాజ్‌పేయి పాల‌న గుర్తుకు వ‌చ్చింద‌ని చెబుతున్నారు. మిత్ర‌ప‌క్షాల‌కు ఎంతో గౌర‌వం ఇచ్చేవార‌ని, వారికి ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి ఉండేవారని గుర్తు చేస్తున్నారు. ఇక మోదీ హ‌యంలోని ఎన్డీఏలో ఇది ఎక్స్‌పెక్ట్ చేయ‌డం పెద్ద‌పొర‌పాటే అవుతుంద‌ని వ‌క్కానిస్తున్నారు. కానీ మోదీ ఒక్క‌టి గుర్తుకు పెట్టుకోవాలి. ఈరోజు బీజేపీ బ‌లంగా ఉండొచ్చు...రేపు ప్రాంతీయ పార్టీ అవ‌స‌ర‌మైనప్పుడు వారు ముందుకు రార‌న్న విష‌యం తెలుసుకోవాలంటూ హిత‌వు ప‌లుకుతున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: